Podarillu Today Episode December 9th: భార్య చనిపోయిందని బాధతో తాగుబోతుగా మారిన తండ్రి.. తమ్ముళ్లను కన్నబిడ్డలుగా మాధవ చూస్తున్నాడు. నారాయణ ఇంటిని రాయించుకోవడానికి అతని అన్న , చెల్లి పథకం వేస్తారు. దీనికి నారాయణ ససేమిరా అంటాడు.. నీ దగ్గర్నుంచి ఆస్తిని ఎలా తీసుకోవాలో మాకు తెలుసు అని వాళ్ళ అనుకుంటారు.. అది ఏమి నువ్వు సంపాదించింది కాదు తాతల ఆస్తి కాబట్టి కచ్చితంగా మాకు కూడా వాటా ఉంటుంది.. కోర్టుకెళ్లి మాకు రావాల్సిన వాటాని మేము సంపాదించుకుంటాము అని వాళ్ళు అంటారు. తాయారు తీసుకొచ్చిన కోర్టు నోటీస్ ని నారాయణ చించిపడేస్తాడు.. ఈ ఇంటికి ఎటువంటి మరమ్మతులు చేయడానికి వీల్లేదు అమ్మడానికి వీల్లేదు అని కోర్టు తీర్పునిస్తది.. దాంతో తాయారు మీ ఇంట్లో వాళ్లకి ఆడదిక్కు లేకుండా పోతుంది నన్నే అవమానిస్తారా నా భర్తనే కొడతారని అంటుంది. నా శాపం మీకు ఈ జన్మలో పెళ్లి కాదు అని అంటుంది.. నీ శాపాలు ఇక్కడేమీ ఫలించవులే వెళ్ళు వచ్చిందండి ఉత్తమ ప్రతివత అని నారాయణ అంటారు. పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అయితారు. వాళ్ళ అత్త పెట్టిన శాపం వాళ్లకి ఫలిస్తుంది. పిల్లలు పెద్దయిన సరే ఏ ఒక్కరికి పెళ్లి కాదు. చక్రి మాత్రం ఒక అమ్మాయి చూపించే దేవుడా అని వేడుకుంటాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. చక్రి అందరికీ పెళ్లి అయిపోతుంది నాకు మాత్రం ఇంకా పెళ్లి కాలేదు అని తన కారులో ఎక్కేస్తాడు అమ్మాయిలకు 50 శాతం ఫ్రీ అని బోర్డు పెట్టేస్తాడు.. తనకు ఎలాగైనా అమ్మాయి దొరకాలని దేవుడు నీ ప్రార్థిస్తూ ఉంటాడు.. ఇంట్లో మాధవ్ కి మాత్రం పెళ్లిచూపులు అని కన్నా రెడీ చేస్తూ ఉంటాడు.. అన్నయ్య నువ్వు చాలా అందంగా రెడీ అయితే నీకోసం ఏ అమ్మాయి అయినా వచ్చేస్తుంది నీ పెళ్లి జరిగిపోతుంది అని కన్నా ఎటు వెళ్ళనివ్వకుండా అందంగా రెడీ చేస్తాడు.. చక్రి తన కారును తీసుకొని గ్యారేజ్ కెళ్ళి కలెక్షన్లను ఇస్తాడు.. అయితే ఆ కలెక్షన్లను చూసినా ఓనరు ఏంట్రా నువ్వు? పెళ్లి కోసం 50% ఫ్రీ అని పెట్టావు ఇలా అయితే నా పరిస్థితి ఏంట్రా అని అడుగుతాడు..
నీకు అంతగా ఇబ్బంది అయితే నాకు ఇచ్చే జీవితంలో తీసేసుకో అనేసి ఓనర్ తో అంటాడు.. ఇలా అయితే నీకు పెళ్లి జరుగుతుందని నమ్మకం లేదురా అని అతను అనగానే.. చక్రి బాబాయ్ నువ్వు ఏదైనా అను గానీ నా పెళ్లి గురించి మాత్రం అనొద్దు. ఇక చక్రి కారుని స్టాండ్ లో పెట్టి ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేస్తూ ఉంటారు.. ఎందుకు దేవుడా నేనంటే నీకు అంత పగ నాకోసం ఒక అమ్మాయిని పంపించొచ్చు కదా అనేసి వేడుకుంటూ ఉంటాడు..
మహాలక్ష్మి తన ప్రాజెక్టును చెక్ చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే తన వదిన వచ్చి నీ ప్రాజెక్ట్ చాలా బాగుంది. కానీ నువ్వు ఇక్కడ ఈ ప్రాజెక్టు గురించి ఆలోచిస్తుంటే కింద మాత్రం నీకోసం వేరే ప్రాజెక్ట్ ని తయారు చేస్తున్నారు అని అంటుంది.. ఏంటి వదిన ఏం మాట్లాడుతున్నావ్ అని మహా అడుగుతుంది.. కు పెళ్లి సంబంధం చూడాలని ఇంట్లోని వాళ్ళందరూ రెడీ అవుతుంటే నువ్వు మాత్రం ప్రాజెక్ట్ అని తిరుగుతున్నావా నేను కింద పిలుస్తున్నారు రా అనేసి అంటుంది..
మహా కిందకు వెళ్లగానే వాళ్ళ నాన్న నువ్వు ఎక్కడికి వెళ్ళద్దమ్మా ఇవాళ నీకు పెళ్లి సంబంధం చూడాలని అనుకుంటున్నాము.. నువ్వు పెళ్లి చేసుకోవాలి అని అంటాడు.. కానీ నాకు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని ఉద్దేశం లేదు నాన్న అనేసి మహా అంటుంది.. నేను నా ఫ్రెండ్ తో కాలేజీకి వెళ్లాలని అనుకుంటున్నాము.. సర్టిఫికెట్ల కోసం కాలేజీ కి వెళ్ళాలి నాన్న అని అంటుంది.. ఇప్పుడు ఏదో ఒకటి చెప్పి తప్పించుకొని బయటికి వెళ్లాలి అని అనుకుంటుంది.. ప్రాజెక్టు ఓకే అయితే ఆ తర్వాత ఇంట్లో వాళ్ళందరికీ చెప్తాను అని అంటుంది..
తన ఫ్రెండుకి ఫోన్ చేసి ఎక్కడున్నావని అడుగుతుంది.. నాకు పది అయితే ఆఫీస్ నుంచి బయటికి వచ్చేదానికి కుదరదు.. నువ్వు క్యాబ్ లో వచ్చేసాయి నీకోసం నేను క్యాబ్ బుక్ చేసానని అంటాడు..నువ్వు తీసుకెళ్తానని చెప్పావు కదరా మళ్ళీ క్యాబ్ అంటావ్ ఏంటి అని మహా అడుగుతుంది.. ఒకటి కానీ నువ్వు క్యాబేలో తొందరగా రావే అని అంటాడు.. తనకోసం బుక్ చేసిన క్యాబ్ కాకుండా చక్రి క్యాబ్ ఎక్కుతుంది మహా.. నాకోసం ఇంత అందమైన అమ్మాయిని పంపించావని చక్రి ఆనందపడే లోపల మహా కోసం బుక్ చేసిన క్యాబ్ డ్రైవర్ ఫోన్ చేసి మీరు వేరే క్యాప్ ఎక్కారు రండి అనేసి అడుగుతాడు.. మహా సారీ అండి వేరే క్యాబ్ ఎక్కాల్సింది మీ క్యాబ్ ఎక్కేసాను అని అక్కడి నుంచి వెళ్ళిపోతుంది..
కేశవను ఇంకా ఇంటికి రాలేదు ఏంటి అని మాధవ్ అడుగుతాడు.. చక్రి అన్నయ్య దారిలోనే ఉన్నాడు వచ్చేస్తున్నాడు కేశవ్ అన్నయ్యకి నేను ఫోన్ చేసి రమ్మని పిలుస్తాను అని అంటాడు.. కేశవ కు ఫోన్ చేస్తే నేను వస్తున్నానని అంటాడు.. దారి మధ్యలో నారాయణ టీ షాప్ దగ్గర ఉండడం చూసి అక్కడ ఆగి టీ తాగుతాడు.. ఈరోజు అన్నయ్యకు పెళ్లిచూపులని నీకు గుర్తుకు లేదా నువ్వేం చేస్తున్నావని కేశవా నారాయణను అడుగుతాడు.. నా కేశవ పెద్దనాన్న ఆడదిక్కు లేకుండా పెళ్లి చూపులకు వెళ్తారా? ఇక పెళ్లయినట్లే అని అనడంతో కేశవా రెచ్చిపోతాడు.. మా పెళ్లి గురించి మాట్లాడే అధికారం నీకు లేదు.. నువ్వు ఒక తండ్రివి అని గుర్తుపెట్టుకో అని కేశవ తన తండ్రికి చెప్పి వెళ్ళిపోతాడు..
Also Read:శ్రీవల్లికి వరుస షాక్ లు.. ఇంగ్లిష్ రాక ఇరుక్కుందే..బాధపడ్డ సాగర్..
కేశవ కోపంగా ఉండడం చూసిన చక్రీ ఏమైందిరా అని అడుగుతాడు.. నేను నాన్న అక్కడ ఉన్నాడని ఆగాను.. అన్నయ్య పెళ్లి సంబంధం గురించి చెప్పాను ఆ వెనకాలే ఉన్న పెద్దనాన్న దారుణంగా అవమానించారు.. ఇంటికి చూసి ఎవ్వరు కూడా మనకి పిల్లనివ్వడానికి ఒప్పుకోవడం లేదు.. తన దాంట్లో తప్పు లేదు కదా అని కేశవ కోపంగా అంటాడు.. ఆ మాట విన్న చక్రి.. బయట అన్నమాట బయటే వదిలేసి రావాలి. ఇంట్లో అన్నయ్య పెళ్లి చూపులు కదా మరి ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావని సీరియస్ అవుతాడు.. దానికి ఇద్దరూ కొట్టుకుంటారు కూడా… మహా తన ప్రాజెక్ట్ ని చెప్పి ఈ ప్రాజెక్ట్ ఎలాగైనా ఓకే అవుతుందని బయటకు వచ్చేస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో మహాను ఒక అబ్బాయి తో చూసానని వాళ్ళ నాన్న పెళ్లి సంబంధం ఫిక్స్ చేస్తాడు.. ఇంటి పరువు కాపాడుకోవాలంటే నేను కచ్చితంగా పెళ్లి చేయాల్సిందేనని అంటాడు..ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..