E-Paper
Advertisement

Smartphone Comparison: రియల్‌మి P4x vs మోటో G67 పవర్ vs రెడ్‌మి 15.. రూ20000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?

Smartphone Comparison: రియల్‌మి P4x vs మోటో G67 పవర్ vs రెడ్‌మి 15.. రూ20000 బడ్జెట్‌లో ఏది బెస్ట్?
Advertisement

Realme P4x vs Moto G67 Power vs Redmi 15| భారతదేశంలో రియల్ మి మిడ్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో కొత్త ఫోన్ విడుదల చేసింది. రూ.20000 బడ్జెట్‌లో రియల్‌మి P4x ఇటీవలే లాంచ్ చేసింది. అయితే ఇదే రేంజ్‌లో మోటో G67 పవర్, రెడ్‌మి 15.. రెండు ఫోన్లు కూడా ఉన్నాయి.

ధర వివరాలు

రియల్‌మి P4x ఫోన్ మూడు వేరియంట్లలో వస్తుంది. 6GB+128GB ధర రూ.15,499, 8GB+128GB ధర రూ.16,999కి, 8GB+256GB ధర రూ.17,999. అయితే మోటో G67 పవర్ 5G ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది, అది 8GB+128GB. దీని ధర రూ.16,999కి వస్తుంది. రెడ్‌మి 15 5G కూడా ఒక్క వేరియంట్ మాత్రమే ఉంది, అది 8GB+128GB రూ.15,999కి లభిస్తుంది. మూడు ఫోన్లలో అతి తక్కువ ధరలో రెడ్‌మి అందుబాటులో ఉంది.

డిస్‌ప్లే ఎలా ఉంది?

Advertisement

రియల్‌మి P4xలో 6.72 అంగుళాల FHD+ స్క్రీన్ ఉంది. దీని 144Hz రిఫ్రెష్ రేట్‌. అయితే ఈ ఫోన్ 1000 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. మోటో G67 పవర్ లో 6.7 అంగుళాల FHD+ LCD డిస్‌ప్లే ఉంది. దీని 120Hz రిఫ్రెష్ రేట్. రెడ్‌మి 15లో 6.9 అంగుళాల FHD+ స్క్రీన్ ఉంది. ఇది 144Hz రిఫ్రెష్ రేట్‌తో వస్తుంది 850 నిట్స్ బ్రైట్‌నెస్ ఇస్తుంది. గేమింగ్, స్క్రోలింగ్ విషయంలో రియల్‌మి, రెడ్‌మి 144Hz రిఫ్రెష్ రేట్‌తో ముందుంటాయి.

బ్యాటరీ, ఛార్జింగ్ ఎలా ఉంది?

మూడు ఫోన్లలోనూ పెద్ద 7000mAh బ్యాటరీ ఉంది. ఇది రెండు రోజులు సులువుగా నడుస్తుంది. రియల్‌మి P4x 45W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. అంటే అతి త్వరగా ఛార్జ్ అవుతుంది. మోటో G67 పవర్ 30W ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. రెడ్‌మి 15 33W ఛార్జింగ్‌తో పాటు 18W రివర్స్ ఛార్జింగ్ కూడా ఇస్తుంది, అంటే ఇతర ఫోన్లు ఛార్జ్ చేయొచ్చు.

ప్రాసెసర్, సాఫ్ట్‌వేర్ ఎలా ఉంది?

Advertisement

మూడు ఫోన్లలోనూ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఉంది. రియల్‌మి P4xలో మిడియాటెక్ డైమెన్సిటీ 7400 అల్ట్రా ప్రాసెసర్, రియల్ ‌మి UI 6.0 ఉన్నాయి. మోటో G67 పవర్ లో స్నాప్‌డ్రాగన్ 7s జెన్‌ 2 ప్రాసెసర్, హెలో UX (యాడ్స్ లేని క్లీన్ ఆండ్రాయిడ్) ఉన్నాయి. రెడ్‌మి 15లో స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్, హైపర్ OS 2.0 ఉన్నాయి. పర్ఫామెన్స్‌లో రియల్‌మి కొంచెం ముందుంటుంది, మోటోలో యాడ్స్ ఉండవు.

కెమెరా ఎలా ఉంది?

రియల్‌మి P4xలో 50MP మెయిన్ + 2MP డ్యూయల్ కెమెరా మరియు 8MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి. మోటో G67 పవర్ లో 50MP మెయిన్ + 8MP అల్ట్రావైడ్ + ఫ్లికర్ సెన్సార్ ఉన్నాయి. 32MP సెల్ఫీ కెమెరా ఉంది (బెస్ట్ సెల్ఫీ కెమెరా). రెడ్‌మి 15లో 50MP మెయిన్ కెమెరా మాత్రమే ఉంది. 8MP సెల్ఫీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ ఎక్కువైతే మోటో గెలుస్తుంది.

ఏ ఫోన్ ఎవరికి బెస్ట్?

త్వరగా ఛార్జింగ్, బెస్ట్ పెర్ఫామెన్స్ కావాలంటే రియల్‌మి P4x కొనండి. మంచి సెల్ఫీ కెమెరా, క్లీన్ సాఫ్ట్‌వేర్ కావాలంటే మోటో G67 పవర్ తీసుకోండి. అతి తక్కువ ధర, పెద్ద బ్యాటరీ కావాలంటే రెడ్‌మి 15 సరిపోతుంది. మూడు ఫోన్లూ ఈ ధరలో అద్భుతమైన వాల్యూ ఇస్తున్నాయి. మీ ప్రాధాన్యం బట్టి తీసుకోండి. రూ.20 వేల లోపు బెస్ట్ 5G ఫోన్ కావాలంటే ప్రస్తుతం మార్కెట్‌లో ఇవే టాప్ ఛాయిస్‌లు!

Also Read: ఒటిపి లేకుండానే బ్యాంక్ డబ్బు దొంగిలించే కొత్త మాల్వేర్.. ఎలా పనిచేస్తుందంటే

Related News

ప్రీమియం వాషింగ్ ఎక్స్‌పీరియన్స్..క్షణాల్లోనే బట్టలు తెల్లగా మెరిసిపోవాల్సిందే!

బడ్జెట్ ధరలో.. బెస్ట్ వాషింగ్ మెషీన్ హయర్ 6.5 కేజీ టాప్ లోడ్ రివ్యూ?

రూ.20వేలలోపు శామ్‌సంగ్ గెలాక్సీ M36 5G.. ఫోన్ అంటే ఇలా ఉండాలి బాస్

స్టూడెంట్స్ అండ్ యూత్‌కి పండగే..తక్కువ ధరలో ఎక్కువ ఫీచర్లు

వివో మాస్టర్ ప్లాన్ అదిరింది.. మూడు 200 మెగాపిక్సల్ కెమెరాలతో Vivo X500 Ultra ఎంట్రీ!

ఐఫోన్, శాంసంగ్‌లకు దెబ్బ మీద దెబ్బ.. హువావే నుంచి మరో మైండ్ బ్లోయింగ్ ఫోన్, డిజైన్ లీక్!

సిమ్ కార్డుకు ఒక వైపు ఎందుకు కట్ చేసి ఉంటుందో తెలుసా? దీని వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఇదే!

అమెజాన్‌లో దుమ్ములేపుతున్న..రెడ్‌మీ లేటెస్ట్ స్మార్ట్‌వాచ్!

Big Stories

Advertisement
×