Illu Illalu Pillalu Today Episode December 9th: నిన్నటి ఎపిసోడ్ లో.. ధీరజ్ ప్రేమకు ఒక గిఫ్ట్ బాక్స్ ఇస్తాడు. ఇందులో ఏముందో చెప్పరా అని అంటే అని ప్రేమ అడుగుతుంది. అందులో ఏముందో నువ్వే ఓపెన్ చేసి చూడు అని ధీరజ్ అంటాడు.. ఆ గిఫ్ట్ బాక్స్ లో పోలీస్ డ్రెస్ ఉండడం చూసి ప్రేమ ఆశ్చర్యంతో షాక్ అవుతుంది.. నేను ఇంకా ఎగ్జామ్ ఏ రాయలేదు కానీ నువ్వేంటి రా అప్పుడే డ్రెస్ కూడా తీసుకొని వచ్చావు అని ప్రేమ అడుగుతుంది. నువ్వు వెళ్లి ఈ డ్రెస్ ని వేసుకోరా ఎలా ఉంటుందో చూడాలనిపిస్తుంది అని ధీరజ్ అంటాడు. ప్రేమ ధీరజ్ కోరిక మేరకు వెళ్లి డ్రెస్ ను వేసుకుని వస్తుంది. అది చూసిన ధీరజ్ సంతోష్ పడతాడు.. ఏంట్రా నువ్వు ఈ డ్రెస్సుతో నన్ను చూసి షాక్ అవుతున్నావా..? డ్రెస్ నేను బయటికి వేసుకొని వెళ్తే కచ్చితంగా పోలీస్ అని అనుకుంటారు కదా అని ప్రేమ ఉంటుంది. ఆ మాట వినగానే ధీరజ్ పక్కున నవ్వుతాడు.. నన్నే పొట్టి అంటావా అని ప్రేమ ఫీలవుతుంది. ఆ తర్వాత భాగ్యం ఆనందరావు వచ్చి శ్రీవల్లి సర్టిఫికెట్లు పోయాయని అంటారు. కానీ ప్రేమ నర్మద ఇద్దరు కూడా సర్టిఫికెట్లను డూప్లికేట్ తీసుకోవచ్చు అని అంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే… భోజనానికి ఇంటికి వచ్చిన రామరాజుకు ఒక ఫోన్ వస్తుంది.. అతను ఇంగ్లీషులో మాట్లాడటంతో నాకు తెలుగు తప్ప ఏది రాదు అని రామరాజు అంటాడు.. అక్కడే ఉన్న శ్రీవల్లిని చూసిన రామరాజు అమ్మ శ్రీవల్లి ఇటు రా.. మా కోడలు ఎం ఏ ఇంగ్లీషు బాగా మాట్లాడుతుంది ఒక నిమిషం లైన్లో ఉండండి ఇస్తాను అని అంటాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి ఓరి నాయనో అడ్డంగా దొరికిపోయిన సత్య దేవుడా అని అనుకుంటుంది.. మా కోడలు బాగా మాట్లాడుతుంది ఆమెకి ఇస్తాను ఒకసారి మాట్లాడండి అని రామరాజు అంటాడు.. శ్రీవల్లి బాబోయ్ అడ్డంగా ఇరుక్కున్నానే అంటూ అక్కడికి వెళ్లి అతనితో ఫోన్ మాట్లాడుతుంది..
ఎంతసేపు మాట్లాడినా ఎస్ యా యా అంటూ మాట్లాడడంతో తిరుపతికి అనుమానం వస్తుంది.. ఏంటి బావ ఎం ఏ ఇంగ్లీష్ అన్నావ్ గడగడ మాట్లాడాలి కదా ఈ అమ్మాయి ఏంటి అని యరలవా అని చదువుతుంది తప్ప కొత్తగా ఏమీ మాట్లాడలేదు.. నాకు అదే అనుమానం ఉంది రా అయినా కూడా ఇవి కూడా ఇంగ్లీష్ పదాలే కదా నీకు తెలియదులే నోరు మూసుకొ రామరాజు అంటాడు.. ఏమి ఇంగ్లీషు నాకు అర్థం కావట్లేదు.. ఏంట్రా నాకు అర్థం కావట్లేదు ఈ అమ్మాయి ఇంగ్లీష్ ఉంది కదా మరి గడగడ నీళ్లు తాగినట్లు ఇంగ్లీష్ మాట్లాడాలి కదా అని రామరాజు కూడా అనుమానం వ్యక్తం చేస్తాడు.. ఆ మాట వినగానే శ్రీవల్లి కూడా నామీద అనుమానం వచ్చినట్లుంది. ఏదో ఒకటి మేనేజ్ చేసి ఇకనుంచి తప్పించుకోవాలి అని అనుకుంటుంది..
శ్రీవల్లి మాట్లాడటం విన్న ప్రేమా నర్మదా అక్కడికి వచ్చి ఆ ఫోన్ తీసుకొని ప్రేమ గడగడ ఇంగ్లీషులో మాట్లాడుతుంది.. ఆ మాట వినగానే తిరుపతి ఇంగ్లీష్ అంటే ఇది బావ.. ప్రేమ ఎంత చక్కగా మాట్లాడింది బావ అని తిరుపతి ప్రేమ పై ప్రశంసలు కురిపిస్తారు. అయితే ప్రేమను అలా చూసిన రామరాజు కూడా ఇంగ్లీషులో ఎంత చక్కగా మాట్లాడింది అని అనుకుంటాడు.. అవునమ్మాయి వల్లి ప్రేమ మాట్లాడినట్టు నువ్వు ఎందుకు మాట్లాడలేదు అని అడుగుతాడు రామరాజు.. సీమ టపాకాయలు నన్ను ఇరికించాలని చూస్తున్నాయి.. నేను వీళ్ళ దగ్గర ఇరుక్కోకూడదు అని శ్రీవల్లి అనుకుంటుంది…
మాట వినగానే శ్రీవల్లి షాక్ అవుతుంది.. నేను కూడా బీభత్సంగా మాట్లాడేసేదాన్ని మావయ్య ఆయన మాట్లాడేది నాకు ఏమీ అర్థం కావట్లేదు అని అంటుంది.. నువ్వు ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడు అని ప్రేమా నర్మదా అంటారు.. అప్పుడే శ్రీవల్లిని వేదవతి కాపాడేస్తుంది.. భోజనానికి రండి ముందు భోజనం చేసిన తర్వాత మళ్లీ మాట్లాడుకోవచ్చు అని శ్రీవల్లి అంటుంది. అమ్మయ్య ఇప్పటికైతే బతికిపోయాను ఈసారి ఏదో ఒకటి చేసి మేనేజ్ చేయాలి లేకపోతే నా ఇంగ్లీష్ చదువు బయట పడిపోతుంది అని శ్రీవల్లి టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
సాగర్ తనకు ఒక 20 లక్షలు కావాల్సి వస్తుంది అని చెందూతో అంటాడు.. ఏంటి 20 లక్షల నీ తలకు మించిన భారం లాగా ఉంది..నాన్నకు తెలియకుండా ఏ పని చేయలేం కదా అనేసి అంటాడు.. ఏంట్రా ప్రతిదానికి నాన్న నాన్న అంటావు.. నువ్వు ఇలా నాన్న అంటున్న కొద్ది ఇలానే ఉండాలనిపిస్తుంది మనకు నచ్చిన జీవితాన్ని మనం ఎప్పుడు బ్రతకాలి అని సాగర్ అంటాడు.. కానీ ధీరజ్ మాత్రం నువ్వేం బాధపడకు అన్నయ్య నువ్వు అనుకున్నది సాధిస్తావు అని అంటాడు. వల్లి ఈ ఇంగ్లీష్ గండం నుంచి బయట పడాలంటే ఖచ్చితంగా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలని అనుకుంటుంది. 30 రోజుల్లో ఇంగ్లీష్ నేర్చుకోవడం ఎలా అనే ఒక బుక్కు కొనుక్కొని దాన్ని చదువుతూ ఉంటుంది.. అలానే నిద్రపోతుంది. అంత చదివిన రెండు ముక్కలకు మించి ఒక్క ముక్క కూడా రాదు..
Also Read : అవని ఇంటికి వచ్చిన పోలీసులు..మీనాక్షిని అవమానించిన శ్రీయ.. పల్లవి గొడవ..
ఉదయం లేవగానే ఎలాగైనా సరే ఇవాళ మనం ఇంగ్లీషు దంచేయాలని అనుకుంటుంది.. శ్రీవల్లి తలుపు తీయగానే ఎదురుగా నర్మదాప్రేమ కనిపిస్తారు.. పొద్దున్నే లేవగానే వీళ్లకు చిక్కని ఏంట్రా బాబు అనుకుంటుంది శ్రీవల్లి.. ప్రేమ నర్మదా ఇద్దరు కూడా తిరుపతి బాబాయ్ కి నీ ఇంగ్లీష్ మీద డౌట్ ఉందంట అక్క అందుకే రాత్రంతా నిద్రపోకుండా ఆలోచించాడు. నువ్వు గడగడ ఒకసారి ఇంగ్లీష్ లో మాట్లాడు అని అంటుంది.. శ్రీవల్లి నేను మాట్లాడుతాను ఆగండి అని జానీ జానీ ఎస్ పాపా పాడుతుంది.. ఇదేంటి ఇంగ్లీషులో మాట్లాడమంటే చిన్న పిల్లల రైమ్స్ చెప్తుంది అని వాళ్ళందరూ కూడా అనుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..