E-Paper
Advertisement

Podarillu Today Episode : హాస్టల్ కోసం వెళ్లిన మహా.. మాధవ్ సీరియస్.. అయ్యో.. మహాకు ఎన్ని కష్టాలో..?

Podarillu Today Episode : హాస్టల్ కోసం వెళ్లిన మహా.. మాధవ్ సీరియస్.. అయ్యో.. మహాకు ఎన్ని కష్టాలో..?
Advertisement

Podarillu Today Episode February 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ కలిసి ఫోటోలు దిగిన తర్వాత భోజనం చేద్దామని వస్తారు. చక్రి మహాలను కూడా మాధవ్ పిలవడంతో అందరూ కలిసి భోజనం చేయడానికి కూర్చుంటారు.. మహా ఫీల్ అవుతుంటే చక్రి మాత్రం మీరు అలా ఫీల్ అవ్వకండి కాస్త ఫ్రీగా కూర్చోండి ఎలాగో ఫంక్షన్ అయిపోయింది కదా అని అంటాడు. ఇక భోజనం చేసిన తర్వాత అందరూ ఇంటికి వెళ్లారు. మాధవ్ నీకంత అయిపోయిందమ్మా జరగాల్సినంత జరిగిపోయింది ఇక నిన్ను ఎవరు ఏమీ అనరు భోజనం చేయమ్మా అని అనగానే భోజనం చేస్తుంది.

ఇక అందరూ కలిసి పడుకోవాలని అనుకుంటారు. లోపల మహా చూస్తే చాలా సీరియస్ గా ఉందని చక్రి అనుకుంటాడు.. లోపలికి వెళ్తే చంపేస్తుందేమో అని గుమ్మం దగ్గరే నిల్చుని ఆలోచిస్తూ ఉంటాడు..అక్కడికి వచ్చిన నారాయణ చక్రిని ఒక్కసారిగా దెబ్బ కొడతాడు. ఎందుకో అంత గట్టిగా కొట్టావ్ కొట్టకుండా కూడా మాట్లాడొచ్చు కదా అనేసి నారాయణను చక్రి అడుగుతాడు. ఈ మాటలు విన్న మాధవ్ అన్ని అబద్ధాలు చెప్తున్నావు అని సీరియస్ అవుతాడు. అని చక్రి మాత్రం మహా పై తనకున్న ప్రేమని చెప్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మాధవ్ కన్నా ఇద్దరూ మాట్లాడుకుంటూ చాలా ఆనందంగా ఉంది. ఇలాంటివి జరుగుతాయని నేను కలలో కూడా ఊహించలేదు అని కన్నా సంతోషంగా ఉంటాడు. మళ్లీ ఫంక్షన్ చేయడంతో నాకు చాలా ఆనందంగా ఉంది. అమ్మలాంటి వదిన నాకు రావడం చాలా సంతోషంగా ఉందని కన్నా ఆలోచిస్తూ ఉంటాడు కానీ మాధవ్ మాత్రం దిగులుగా ఉంటాడు.. మన ఇంటిలో ఎవరికి పెళ్లి కాలేదని అందరూ ఎన్నో మాటలు అన్నారు. నిన్న జరిగిన ఫంక్షన్ వల్ల ఆ మాటలన్నీ ఇప్పుడు వెనక్కి తీసుకున్న పరిస్థితి వచ్చింది. నాకు చాలా సంతోషంగా ఉంది అన్నయ్య మన ఇంట్లో ఒకరికి పెళ్లి అవ్వడం.. ఎన్ని రోజులు మన ఇంట్లో ఆడ దిక్కు లేదని అందరూ ఎన్నో మాటలు అంటున్నారు నాకు ఒక్కొక్కసారి బాగా ఏడుపు వచ్చేసింది కూడా..

ఇప్పుడు ఆ బాధ ఏమీ లేదు చక్రి అన్నయ్య కి పెళ్లి అయిపోయింది నెక్స్ట్ కేశవ్ అన్నయ్యకి నీకు పెళ్లి అయితే ఆ తర్వాత నాకే కదా అని కన్నా సిగ్గు పడిపోతూ ఉంటాడు.. ఏంట్రా పెళ్లి గురించి మాట్లాడుతూ అలా సిగ్గు పడుతున్నావేంటి ఎక్స్ట్రాలు ఆపేసి ముందు చదువుకో అని మాధవ్ అంటాడు. సరే అన్నయ్య ఇవాళ నాకు మధ్యాహ్నం వరకే కాలేజ్ ఉంటుంది. ఆ తర్వాత నేను ఇంటికి వస్తాను వదిన బోరింగ్ గా ఫీల్ అవుతుంది కదా అని కన్నా కాలేజ్ కి వెళ్ళిపోతాడు.. మహాలక్ష్మి ఎప్పుడైనా ఇంట్లోంచి వెళ్లిపోతుందని తెలిస్తే వీడు ఎలా బాధపడతాడో అర్థం కావడం లేదని మాధవ్ బాధపడతాడు.

Advertisement

ఆ తర్వాత మాధవ్ ఏం చేసినా కూడా సీరియస్ గా ఉండడంతో ఏమైంది అని అక్కడ వాళ్ళందరూ అడుగుతారు. ఎప్పుడు లెండి ఎందుకన్నా ఇంత సీరియస్ గా ఉన్నావ్ ఏమైంది అని బన్సీర్ బాయ్ అడుగుతాడు. ఇక తర్వాత అందరూ ఇంట్లో కూర్చుని ఉండగా తాయారు రమణయ్య నారాయణ ఇంటికి వస్తారు.. నిన్న ఫంక్షన్ చేశారు కాబట్టి వదిలేశాం మాకు ఇంత సంస్కారం ఉంది కాబట్టే ఫంక్షన్ టైం లో ఏం మాట్లాడలేదు ఇప్పుడు ఎవరిని అడిగి ఫంక్షన్ చేశారు అని గొడవకు వస్తారు. ఇంటి మీద కేసు కోర్టులో మీరు ఇంట్లో ఫంక్షన్ ఎలా చేస్తారు మేము కోర్టుకు వెళ్లి తేల్చుకుంటాం.. లేదంటే నిన్న ఫంక్షన్ కైనా డబ్బులు ఎంత అయితే ఉన్నాయో అవి మాకు ఇవ్వాలి అని రమణయ్య తాయారు అడుగుతారు.

ఏంట్రా ఏం మాట్లాడుతున్నారు రా సిల్లీ ఫెలోస్ ఇంట్లో ఫంక్షన్ జరగకూడదని ఎవరు చెప్పారు రా.. ఇంటికి మరమ్మత్తులు చేయొద్దని చెప్పారు కదా.. అని నారాయణ వాళ్ళకి మాటకు మాట సమాధానం చెప్తాడు. ఏం మాట్లాడుతున్నావ్ రా తాగుబోతోడ నువ్వు ఎక్కువ మాట్లాడేవంటే నా సంగతి తెలుసు కదా ఇంట్లో ఉన్న సామాన్లు అన్ని బయట పడేస్తాను అని రమణయ్య అంటాడు. రమణయ్య ఇంట్లోకి వెళ్తుంటే నారాయణ రమణయ్య ను తోస్తాడు. రమణయ్యకు దెబ్బ తగులుతుంది. మాట్లాడడానికి వస్తే మమ్మల్ని చంపాలని చూస్తావా మేము పోలీసులకు చెప్తాము అని తయారు రమణయ్య ఇద్దరు పోలీసులు దగ్గరికి వెళ్తారు.

Also Read : లక్ష కోసం బాలు కష్టాలు..మనోజ్ కు దొరికిన రోహిణి.. రాజేష్ కు నిజం చెప్పిన మీనా..?

మహాలక్ష్మి మాత్రం హాస్టల్లో ఉండడానికి హాస్టల్ కోసం వెతుకుతూ ఉంటుంది.. ఎన్ని హాస్టల్ కి వెళ్ళినా కూడా ఐడి ప్రూఫ్ లేదా జాబ్ గురించి ఆఫర్ లెటర్ కావాలని అడుగుతారు. చక్రి ఎలాగైనా సరే ఈమకి హాస్టల్ దొరకకూడదు మా ఇంట్లోనే ఉండేలా ప్లాన్ చేయాలి అని అనుకుంటాడు. మహాలక్ష్మి ఎక్కడైనా రూమ్ ఉంటే బాగుంటుంది అని అనుకుంటుంది. అయితే తనకు డబ్బులు అవసరం అవుతుందని చేయనమ్మాలని మార్వాడి షాప్ కి వెళ్తుంది.. మహాలక్ష్మి ఎంత వద్దని చెప్తున్న సరే చేయను అమ్మేసి చక్రికి డబ్బులు ఇస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో నారాయణను పోలీసులు అరెస్ట్ చేస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×