E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: లక్ష కోసం బాలు కష్టాలు..మనోజ్ కు దొరికిన రోహిణి.. రాజేష్ కు నిజం చెప్పిన మీనా..?

Gundeninda GudiGantalu Today episode: లక్ష కోసం బాలు కష్టాలు..మనోజ్ కు దొరికిన రోహిణి.. రాజేష్ కు నిజం చెప్పిన మీనా..?
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 10th: నిన్నటి ఎపిసోడ్ లో.. రాజేష్ మాత్రం అక్కడ పడిపోయి కనిపించడంతో ఏమైందిరా వీడు నిద్రపోతున్నాడా ఏంటి అని బాలు అడుగుతాడు. తాగొస్తే పడుకోక ఇంకేం చేస్తారు అని బాలు అంటాడు.. తాగి రావడమేంట్రా ఏం మాట్లాడుతున్నావ్ రా అసలు పగలు తాగడం ఏంటి అయినా తాగితే ఇద్దరం కలిసే తాగుతాం కదా.. అని అనగానే ఏమో వాడ్ని లేపి నువ్వే అడుగు అని వాళ్ళు అంటారు..రాజేష్ ని లేపి ఏం జరిగింది అని అడుగుతారు బాలు. కొడుకుగా పుట్టినందుకు మా నాన్న అమ్మ సంతోషాన్ని నేను చూడలేకపోతున్నాను అని రాజేష్ బాధపడతాడు.. ఏం జరిగిందో చెప్పురా ఎందుకలా మాట్లాడుతున్నావు అని బాలు అడుగుతాడు..అమ్మ నాన్నలా షష్టిపూర్తి కార్యక్రమాన్ని చేయడానికి డబ్బులు లేవురా అదే నా బాధ అని రాజేష్ అంటాడు. డబ్బుల కోసం నువ్వు ఇంతగా బాధపడి తాగొచ్చావా? బాలు రాజేష్ కి డబ్బులు ఇస్తానని మాటిస్తాడు.. కానీ మీనా మాత్రం ఆ డబ్బులు ఇవ్వడానికి ఒప్పుకోదు.. వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టడానికి ప్రభావతి చూస్తుంది.. అక్కడితో ఎపిసోడ్ అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు బయటకు వెళ్లి తన ఫ్రెండ్స్ ని డబ్బులు కావాలని అడుగుతారు. వాళ్లు నువ్వు ఇస్తానని చెప్పావు కదరా మరి ఒక మాట వాడికి ముందే చెప్పి ఉంటే ఈ సమస్యలు వచ్చేవి కాదు కదా అని అంటారు.. అయినా మాటిచ్చే ముందు రా ఆలోచించాలి కదా అని బాలుని అక్కడ వాళ్ళు కూడా అనడంతో.. నేను రాజేష్ కి హెల్ప్ చేయాలని అనుకున్నాను.. అంతే తప్ప తప్పేమీ చేయలేదు కదా అని బాలు అంటాడు.. మన దగ్గర ఉంది కదా అని మనం వేరే వాళ్ళకి ఇస్తే ఆ తర్వాత మనకి ఇవ్వడానికి ఎవరూ ఉండరు. మనము ఫ్రెండ్స్ కోసం ఆలోచిస్తే భార్యలు మాత్రం మన ఫ్యామిలీ కోసం ఆలోచిస్తారు మీనా చెప్పింది కూడా నిజమే కదా అని బాలు ఫ్రెండ్ చెప్తాడు..

Advertisement

పెళ్లయిన తర్వాత ఫ్రెండ్స్ అందర్నీ వదిలేసాను ఇప్పుడు నాకు అన్ని మా ఆవిడే అని బాలు ఫ్రెండ్ అనడంతో నేను అలా కాదురా.. ఫ్రెండ్స్ కోసం ఏదైనా చేస్తాను అని బాలు అంటాడు.. ఎలాగైనా సరే రాజేష్ కి లక్ష రూపాయలు ఇవ్వాలి అని బాలు ఫిక్స్ అవుతాడు.. ఇక రోహిణికి విద్య కాల్ చేసి ఆ ఇంటి ఓనరు అర్జెంటుగా లక్ష రూపాయలు కావాలని అంటున్నాడు మరి ఏం చేయమంటావు అని అడుగుతుంది.. అయితే ఇప్పటికిప్పుడు లక్ష రూపాయలు ఉంటే కష్టం అని మాట్లాడుతూ ఉంటుంది.. రోహిణి చేసిన మోసం గురించి విద్య గుర్తు చేస్తుంది.. తర్వాత రోహిణి ఫోన్ మాట్లాడుతూ దుబాయిలో బిజినెస్ స్టార్ట్ చేశాడు అని అంటుంది..

ఆ మాట వినగానే రోహిణి దొరికిపోయాను అని అనుకుంటుంది.. నీకు లక్ష రూపాయలు కావాలి కదా నేను మా ఆయనను అడిగి ఒకసారి కనుక్కుంటాను అని రోహిణి అంటుంది.. ఏంటి దుబాయ్ అంటున్నావ్ వ్యాపారం అంటున్నావ్ లక్ష రూపాయలు అంట నువ్వు నాకేం అర్థం కావట్లేదు రోహిణి అని మనోజ్ అంటాడు.. ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ దుబాయిలో బిజినెస్ స్టార్ట్ చేశాడంట. ఆయనకి లక్ష రూపాయలు కావాలంట నిన్ను అడిగి చెప్తానని అన్నాను.. ఫ్రెండ్ కి నువ్వు ఒక లక్ష రూపాయలు ఇస్తావా అని మనోజ్ ని రోహిణి అడుగుతుంది.. నేను ఎవరికి పడితే వాళ్లకి డబ్బులు ఇవ్వను అని మనోజ్ అనగానే రోహిణి అవునా మరి కల్పనకు ఎలా ఇచ్చావు అని గతాన్ని తవ్వుతుంది..

Advertisement

కల్పనకు నువ్వు డబ్బులు ఇవ్వడం కాదా ఏంటి..? నమ్మి నువ్వు ఎలా ఇచ్చావు. నేను ముందుండి ఆ డబ్బుని తీసుకున్నాను.. కాబట్టి సరిపోయింది లేకపోతే తను నీకు డబ్బులు ఇస్తుందా ఏంటి అని రోహిణి అంటుంది. మీనా దగ్గరకు వచ్చిన శృతి ఏమైంది మీనా అలా ఉన్నావు అని అడిగితే ఏం లేదు రాజేష్ కి డబ్బులు ఇవ్వాలని ఆయన నాతో గొడవపడ్డాడు అని చెప్తుంది. ఎవరికి ఎలాంటి సమయాల్లో డబ్బులు ఇవ్వాలి అని రోహిణి కూడా వచ్చి జాయిన్ అయ్యి ముగ్గురు కలిసి మాట్లాడుకుంటారు.. అయితే అటు బాలు రవి మనోజ్ కూడా డబ్బులు గురించి మాట్లాడుకుంటూ ఉంటారు.. మొత్తానికి రోహిణి దగ్గరికి మనోజ్ వచ్చి డబ్బులు వడ్డీకి ఇస్తానని చెప్తాడు దాంతో రోహిణి హ్యాపీగా ఫీల్ అవుతుంది..

Also Read : విశ్వం పై అమూల్య రివేంజ్.. వల్లికి, విశ్వంకు మైండ్ బ్లాక్.. సాగర్ దొరికిపోతాడా..?

ఆ తర్వాత రాజేష్ ఫంక్షన్ గురించి మాట్లాడుతూ ఉంటాడు.. మీన రావడంతో ఏమైనా అమ్మాయిలా వచ్చావు మీరిద్దరేమైనా గొడవపడ్డారా అని అడుగుతాడు.. నేను మీకు ఒక సొంత చెల్లెలు లాగా మాట్లాడుతున్నాను అన్నయ్య మీరు తప్పుగా మాత్రం అనుకోవద్దు. ఆయన డబ్బులు ఇస్తానని మీకు చెప్పాడు కదా.. మీరు అప్పు ఇవ్వడానికి మళ్లీ చాలా కష్టపడాలి ఇది మీరు ఆలోచిస్తే బాగుంటుంది అని చెప్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Monday Movies in Tv : సోమవారం టీవీ సినిమాలు.. అస్సలు మిస్ చెయ్యొద్దు..

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Big Stories

Advertisement
×