E-Paper
Advertisement

Podarillu Today Episode : కన్నా మాటతో మహా ఎమోషనల్.. కేశవ్, శైలు మధ్య ఫైట్.. మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న లలిత..

Podarillu Today Episode : కన్నా మాటతో మహా ఎమోషనల్.. కేశవ్, శైలు మధ్య ఫైట్.. మహా కోసం కన్నీళ్లు పెట్టుకున్న లలిత..
Advertisement

Podarillu Today Episode February 16th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహాలక్ష్మికి కన్నా బాగా దగ్గరవుతాడు.. నిజంగానే తను చక్రికి భార్యని ఫీల్ అవుతాడు.. ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ అయిపోతారు కూడా.. అయితే భోజనం చేద్దామని చెప్పగానే కేశవ ఇంటికొచ్చి మహాని అరిచిన విషయాని గుర్తు చేసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత మహాలక్ష్మి కన్నాతో కూర్చుని మాట్లాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది.. నారాయణ మాత్రం వీరిద్దరిని చూసి సంతోషంగా ఉంటాడు. ఇక నీ దగ్గర గంప కొడుతుంది నువ్వు ఏమి మాట్లాడద్దు అని కన్నా అంటాడు. అయితే నారాయణ మీ అన్నయ్యకి చికెన్ షాప్ లో మటన్ షాపులు బంద్ అయ్యాయని ఎవరైనా చెప్పారా? తోటకూర బచ్చలు కూర అంటూ ఆకుకూరలు మేకలకు పెట్టినట్లు పెట్టాడు అని నారాయణ అంటాడు. ఆ మాట వినగానే కన్నా కాస్త కోపంతో ఉంటాడు. మహాలక్ష్మి మాత్రం ఏంటి మీ నాన్న అలా మాట్లాడుతున్నాడు. పెద్ది అందరికోసం ఎంతో కష్టపడుతున్నాడు కదా మీరు ఆయన్ని కనీసం గుర్తించడం లేదు అని ఫీల్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కన్నా మహాలక్ష్మి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు.. ఇంకా భోజనం చేద్దామని కన్నా అడగడంతో మహాలక్ష్మి కూడా భోజనం చేద్దామని అంటుంది. కేశవ ఇంటికి వస్తాడు అయితే మహాలక్ష్మిని చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకతనాల పారిపోతున్నాడు. అతను మళ్లీ సాయంత్రమే ఇంటికి రావాలి కదా అని మహా అడుగుతుంది.. మీపై అరిచాడు కదా ఇక ఇప్పటిలో రాడు అని కన్నా అంటాడు. మనము తినడానికి ఆమ్లెట్ వేసుకోమని చెప్పాడు.. మీరు వేస్తారని అడిగితే నాకు ఆమ్లెట్ తినడం ఇష్టం కానీ వేయడం రాదు అని మహాలక్ష్మి అంటుంది.. ఓ మీకు ఇది కూడా వేయడం రాదా అయితే నేను వేస్తాను మీరు ఉల్లిపాయలు కట్ చేయండి అని కన్నా అంటాడు.. అయితే మహాలక్ష్మి కట్ చేస్తుంటే ఇట్లా కట్ చేస్తే సాయంత్రం అవుతుందేమో నేను కట్ చేస్తాను ఇవ్వండి అని చకచకా కట్ చేసి ఆమ్లెట్ వేస్తాడు..

Advertisement

అయితే నీకు వంట చేయడం కూడా వచ్చా అని కన్నా అని అడుగుతుంది మహా. అవును నాకు వంట చేయడం కూడా వచ్చు ఇంట్లో ఎవరూ లేనప్పుడు నేనే వంట చేసి పెడతాను అని కన్నా అంటాడు.. అయితే నీకు వంట చేయడం వచ్చు కదా దుర్మార్గుడ్లగా ఎందుకు అలా చేస్తున్నావు అన్ని పెద్ది చేత చేస్తున్నావు అని మహా తిడుతుంది.. మా అన్నయ్య మా చేత ఏది చేయించడు అందుకే మేము చెయ్యాలని అన్నా కూడా మా అన్నయ్య తిడతాడు అని కన్నా అంటాడు. మీ అమ్మ ఎలా ఉంటుంది అని అడిగితే మా అన్నయ్య 12 ఏళ్ళ వయసులో ఉన్నప్పుడు మా అమ్మ చనిపోయింది అన్ని మా అన్నయ్య మాకు చూసుకున్నాడు అమ్మాయి నానైనా అన్ని మా అన్నయ్య అని కన్నా చెప్పడంతో ఎమోషనల్ అయిపోతుంది మహా..

ఇక కేశవ మహాలక్ష్మికి ఏదైనా గిఫ్ట్ కొనివ్వాలని అనుకుంటాడు. స్టైలిష్ శైలజ ఒక గిఫ్ట్ షాప్ కి వెళ్లి అక్కడ మన ఫాలోవర్స్ కి మనం ఏంటో తెలిసేలా చేయాలి అని అనుకుంటుంది.. ముందుగా ఆ షాప్ అతన్ని చూసి అతని దగ్గర ఆఫర్ అడుగుతుంది. ఆ తర్వాత షాప్ లోకి వచ్చిన కేశవ ని చూసి తన ఫాలోవర్ అని అనుకుంటుంది. కానీ అతను ఆమెను సేల్స్ గర్ల్ అని అనగానే షాక్ అవుతుంది. వీడి మీద నేను రివెంజ్ తీసుకుంటాను అని తన ఫ్రెండ్ తో చెప్తుంది శైలజ. లేడీస్ కి ఏం కావాలో గిఫ్ట్ ఎక్కడ ఉంటుందో అని షాప్ అతనే తెలుసుకొని కేశవ అక్కడికి వెళ్లి చూడబోతాడు. అయితే అప్పుడే అక్కడ శైలజ ఒక గిఫ్ట్ నీ పగల కొట్టి మళ్ళీ అక్కడే పెడుతుంది.. అది చూసినా కేశవ ఆ బొమ్మని విరగొట్టి అక్కడే పెట్టావా అని అడుగుతాడు.

Advertisement

నాకేం తెలియదండి అతనే పగల కొట్టి చేతులు పట్టుకొని నా మీద వేయాలి అనుకుంటున్నాడు.. చూసారా ఆ బొమ్మ కూడా అతని దగ్గరే ఉంది అని శైలజ అనడంతో షాపు అతను అది నిజమే అనుకుంటాడు. ఇక కేశవ తప్పక ఆ బొమ్మ ఖరీదు కడతానని ఒప్పుకుంటాడు. ఇంకొకసారి నాకు దొరకపోవు అప్పుడు నీ పని చెప్తాను అని ఆ బొమ్మకి డబ్బులు కట్టేసి వస్తాడు. ఇక మహాలక్ష్మి మిగతా వాళ్ళందరూ వంట పనులు చేస్తూ ఉంటే నేను కూడా చేస్తానని అక్కడికి వెళ్తుంది. కూరగాయలు కడగడ మీరు రాకపోవడంతో మాధవ్ నేను కడుగుతాను వంట చేస్తాను నువ్వు వెళ్ళమ్మా అనేసి అంటాడు. అప్పుడే ఇంట్లోకి కేశవ్ రావడంతో మహాలక్ష్మి కోసం ఒక గిఫ్ట్ తెచ్చి ఇస్తాడు. ఎవరితోనైనా గొడవపడితే వాడు ఇంతే గిఫ్ట్ ఇస్తాడు అని కన్నా చెబుతాడు.

Also Read:గుణతో మీనా ఫైట్..రెచ్చిపోయిన బాలు.. గుణకు షాకిచ్చిన శివ..

అయితే మధ్యాహ్న భోజనం చేయలేదన్న విషయాన్ని మాధవ్తో కన్నా మహా చెప్తారు.. ఏంటి బయట ఎక్కడైనా తినొచ్చు కదరా పస్తులు ఎందుకు ఉన్నావు అని మాధవ్ అంటాడు. గిఫ్ట్ను కన్నా చేతిలో పెట్టి కేశవా లోపలి నుంచి తొంగి తొంగి చూస్తూ ఉంటాడు. ఆ కప్పును చూసి కన్నా చక్రి ఇద్దరూ కూడా నవ్వుకుంటారు. కానీ మహాలక్ష్మి ఆ కప్పు చాలా బాగుంది నాకు బాగా నచ్చింది అని చెప్పడంతో కేశవ హ్యాపీగా ఫీల్ అవుతాడు. అందరూ కలిసి భోజనం చేద్దామని కూర్చుంటారు కానీ నారాయణ లోపలికి పిలవడంతో అతను తిని పద్ధతిని చూసి మహాలక్ష్మి షాక్ అవుతుంది.. ఇక ఆది మహాలక్ష్మి పరిస్థితిని ఇంట్లో వివరించి బాధపడతాడు. లళిత కూడా తన కూతురు అలాంటి ఇబ్బందులు పడుతుందని బాధపడుతుంది. మహాలక్ష్మికి మస్కిటో కాయిల్ ఆల్ అవుట్ అలాగే బ్యాటు అన్ని తెచ్చి చెక్రి ఇస్తాడు. వాటిని మళ్లీ బయటకు తీసుకొచ్చిన మహా వాళ్ళందరూ ముందే ఇవ్వడంతో అందరూ కలిసి చక్రిని కొడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో తాయారు మహాలక్ష్మి తో మాట్లాడడానికి వస్తుంది. తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Telugu TV Serials: ఈ వారం సీరియల్స్ టీఆర్పీ రేటింగ్.. శ్రీవల్లి సీరియల్ కు షాక్..!

Big Stories

Advertisement
×