E-Paper
Advertisement

Film industry: ప్రముఖ గాయని కన్నుమూత.. ఆ భయంకరమైన వ్యాధితో పోరాడుతూ!

Film industry: ప్రముఖ గాయని కన్నుమూత.. ఆ భయంకరమైన వ్యాధితో పోరాడుతూ!
Advertisement

Film industry: సినిమా ఇండస్ట్రీలో నటీనటులు, గాయనీ గాయకులు, దర్శక నిర్మాతలు ఇలా ఇండస్ట్రీ కి చెందిన ఎవరి ఇంట్లోనైనా లేదా ఎవరైనా సెలబ్రిటీలు పరమపదించారు అంటే విషాదఛాయలు ఒక ఇండస్ట్రీనే కాదు వారి అభిమానులను కూడా దుఃఖంలోకి నెట్టివేస్తూ ఉంటాయి. ఈ క్రమంలోనే కొంతమంది అనారోగ్య సమస్యలతో.. మరికొంతమంది వయసు మీద పడి కన్నుమూస్తూ ఉంటారు. ఇక్కడ ఒక గాయని తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించి, విపరీతమైన పాపులారిటీ సంపాదించుకోవడమే కాకుండా ఎంతో మంది అభిమానులను పొందారు కూడా.. అలాంటి గాయని నేడు భయంకరమైన వ్యాధితో బాధపడుతూ స్వర్గస్తులవడంతో అభిమానులు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. మరి ఆ గాయని ఎవరు? అసలేం జరిగింది? అనే విషయం ఇప్పుడు చూద్దాం.

బ్రెయిన్ స్ట్రోక్ తో ప్రముఖ గాయని మృతి..

ఆమె ఎవరో కాదు ప్రముఖ ఒడియా గాయని గీతా పట్నాయక్ (Geeta patnaik) ఆదివారం సాయంత్రం 6:18 గంటలకు కటక్ నగరంలోని సిడిఏ ప్రాంతంలోని ఒక ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ కన్నుమూశారు. విషయంలోకి వెళ్తే.. గురువారం తెల్లవారుజామున సాహిత్య సమావేశానికి హాజరైనప్పుడు ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారట. ఇక వెంటనే ఆమెను భువనేశ్వర్ లోని క్యాపిటల్ ఆసుపత్రికి తరలించగా.. తెల్లవారుజామున 3 గంటలకు పరిస్థితి విషమించడంతో ఒక ప్రైవేట్ హాస్పిటల్ కి తరలించి ఐసీయూలో చేర్చారు. ఇక వైద్య పరీక్షల్లో ఆమెకు బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిందని వైద్యులు తెలిపారు. ఇక చికిత్స పొందుతూ హాస్పిటల్లోనే తుది శ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు వెల్లడించారు.

అంతిమక్రియలు నేడే..

Advertisement

ప్రస్తుతం ఆమె వయసు 73 సంవత్సరాలు. గాయనిగా సంగీత ప్రపంచంలో తనకంటూ ఒక ప్రత్యేకమైన ముద్ర వేసుకున్న గీతా పట్నాయక్ మృతి పట్ల ప్రముఖులు , అభిమానులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. సోమవారం కాఫ్లా బజార్లోని ఆమె నివాసానికి తీసుకెళ్తారు. అక్కడ ప్రజలు తమ చివరి నివాళులర్పించడానికి అందుబాటులో ఉంచి, ఆ తర్వాత కటక్ లోని చారిత్రాత్మక సతి చౌరా స్మశాన వాటికలో ఆమె అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు మీడియాతో తెలిపారు. గీతా పట్నాయక్ మృతితో సినీ పరిశ్రమ కూడా మూగబోయింది.

ALSO READ:Couple friendly: A సర్టిఫికెట్ పై ధీరజ్ అసహనం.. పీఎంను కలుస్తానంటూ!

గీతా పట్నాయక్ కెరియర్..

Advertisement

గీత పట్నాయక్ విషయానికి వస్తే.. ఒడియా సంగీత ప్రపంచంలో ఒక ప్రియమైన వ్యక్తి. అనేక ఐకానిక్ ట్రాక్ లకు తన గాత్రాన్ని అందించి మరింత పాపులారిటీ సంపాదించుకుంది.. ఎన్నో అద్భుతమైన పాటలకు తన గాత్రాన్ని అందించి సంగీత ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన గీతా పట్నాయక్ మృతి జీర్ణించుకోలేనిది. ముఖ్యంగా ఈమె సంగీత ప్రపంచానికి చేసిన కృషి అసమానమైనది. ఆమె మనోహరమైన ప్రదర్శనలను ఇష్టపడే వారందరూ ఆమెను మరింత గుర్తించుకుంటారు అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనా గీతా పట్నాయక్ మరణ వార్త అభిమానులనే కాదు సినీ సెలబ్రిటీలను కూడా మరింత దిబ్రాంతుకి గురిచేస్తోందని చెప్పవచ్చు.

Related News

Nagarjuna:ఇండస్ట్రీకి నాగార్జున స్ట్రాంగ్ హెచ్చరిక!

Lenin: వాటి కోసమే అఖిల్ ఇన్నేళ్లు ఎదురు చూసాడు.. నాగార్జున ఎమోషనల్!

మెగా ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. ఒక్కొక్కరికి రూ.5లక్షలు ప్రకటన!

నేరుగా ఓటీటీలోకి రాబోతున్న మృణాల్ సస్పెన్స్ థ్రిల్లర్!

చిన్న సినిమా.. విపరీతమైన క్రేజ్.. 72వ జాతీయ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్లు’ రచ్చ!

కుంభమేళా వైరల్ గర్ల్ మోనాలిసా లైఫ్‌లో బిగ్ ట్విస్ట్.. తండ్రిపై సంచలన ఆరోపణలు

స్పిరిట్ కథ లీక్: ఆ ఒక్క ట్విస్ట్‌తో థియేటర్లు షేక్ అవ్వడం ఖాయం!

మరో సినిమాతో ‘రాజు వెడ్స్ రాంబాయి’ దర్శకుడు.. హీరో ఎవరో తెలుసా ?

Big Stories

Advertisement
×