E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీ ఫుల్ హ్యాపీ.. కేశవ సీరియస్.. మహా దెబ్బకు నారాయణ షాక్.. ఇదేం ట్విస్ట్ సామీ..

Podarillu Today Episode : చక్రీ ఫుల్ హ్యాపీ.. కేశవ సీరియస్.. మహా దెబ్బకు నారాయణ షాక్.. ఇదేం ట్విస్ట్ సామీ..
Advertisement

Podarillu Today Episode February 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. నా తప్పు లేదని ఎన్నిసార్లు మహాలక్ష్మి చెప్తున్న సరే ప్రతాప్ అస్సలు విననే వినడు.. నువ్వు ఇక్కడే ఉంటే నీకు మంచి జాబ్ నేను చూపిస్తానని ప్రతాప్ అంటాడు.. నువ్వు ఇక్కడే ఉండు ఆ జాబ్ ఏదో నేను చూపిస్తానని ఎంత చెప్తున్నా సరే మహా మాత్రం నేను ఇక్కడే మళ్ళీ బందీగా ఉండాలని అనుకోవడం లేదు అని అంటుంది. ఆది కూడా మహాలక్ష్మిని బాధపెట్టేలా మాట్లాడుతాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం నన్ను అర్థం చేసుకుంటే చాలు అని అంటుంది.. నేను ఇప్పుడు వచ్చింది కేవలం సర్టిఫికెట్ల కోసమే.. నా కాళ్ళ మీద నేను నిలబడాలని ఎన్నిసార్లు చెప్పినా..

మీరు వినకుండా మీ ఇష్టం వచ్చినట్లు పెళ్లి సంబంధాన్ని ఫిక్స్ చేశారు.. నాకు ఇష్టం లేకపోయినా మీరు పెళ్లి చేయాలనే అనుకున్నారు. కానీ నా ఇష్టాన్ని కూడా మీరు అర్థం చేసుకోవాలి కదా.. నాన్న అని మహా ఎంత చెప్తున్నా సరే ప్రతాప్ మాత్రం వినడు.. నీకు ఈ సర్టిఫికెట్ కావాలా లేదా మేము కావాలా అన్నది నువ్వే నిర్ణయించుకొని ప్రతాప్ అంటాడు.. ఆ సర్టిఫికెట్లను మహా కళ ముందరే కాల్ చేస్తాడు అది చూసిన మహా గుండెలు పగిలేలా ఏడుస్తుంది. ఇష్టం వచ్చినట్లు నేను ఉంటాను అని వార్నింగ్ ఇచ్చి బయటకు వచ్చేస్తుంది మహాలక్ష్మి.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. కన్నా ని తీసుకొని బయటకు వెళ్ళిపోతుంది మహాలక్ష్మి.. ఏమైంది వదిన ఎందుకు బాధపడుతున్నావ్ అని నేను ఏమైనా అన్నానా అని కన్న అడుగుతాడు.. నువ్వు శాశ్వతంగా ఇక్కడే ఉంచాలని ప్లాన్ చేశారు అని బాధపడుతుంది మహాలక్ష్మి.. తన సర్టిఫికెట్లు కాల్చేసిన విషయాన్ని కన్నాతో చెప్పి ఎమోషనల్ అవుతుంది.. మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటే కన్నా కూడా బాధపడిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి ఎలాగైనా సరే డైవర్ట్ చేయాలని కన్నా నన్ను చంపాలని చూడొద్దు నాకు ఆకలేస్తుంది వెళ్లి తిందాం పద అనేసి అడుగుతాడు..

అప్పుడే చక్రి కన్నాకి ఫోన్ చేస్తాడు.. ఏమైందిరా ఎక్కడున్నార్రా అని అడిగితే ఇదిగో వదినకి ఇస్తున్నాను మాట్లాడు అనేసి ఇస్తాడు కన్నా.. మహాలక్ష్మి చక్రితో మాట్లాడుతుంది.. ఏం జరిగిందండి? మళ్లీ వాళ్ళు ఎవరు ఏమీ అనలేదు కదా.. మిమ్మల్ని ఏదైనా చేశారేమో అని నేను చాలా కంగారు పడ్డాను. అసలు ఏమైపోయారు మీరు? ఏం అనలేదు కదా మిమ్మల్ని వాల్లు అని అడుగుతాడు. ఇప్పుడు ఫోన్లో అవన్నీ చెప్పలేను ఇంటికి వచ్చిన తర్వాత చెప్తాను అని మహాలక్ష్మి అంటుంది. ఏంటి మీరు ఇంటికి వస్తున్నారా అని అనగానే లేదు.. అట్నుంచి అంటే ఢిల్లీ నుంచి ఫ్లైట్ ఎక్కి పోతామని మహాలక్ష్మి సరదాగా అంటుంది. మీరు ఇంటికి వస్తున్నారు కదా నాకు చాలా సంతోషంగా ఉంది. రండి మీరు వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం అని చక్రి అంటాడు..

Advertisement

ఇక తర్వాత మహాలక్ష్మి ఇంటికి వస్తుందని మాధవతో చెప్పగానే ఇద్దరు చాలా సంతోషంగా ఫీల్ అవుతారు.. ఇక తర్వాత వాళ్ళు ఎప్పుడు ఇంటికి వస్తారా అని వెయిట్ చేస్తుంటారు. వచ్చి రాతలికి ఇంట్లోని వాళ్ళందరూ కూడా మహాలక్ష్మి వచ్చిందని సంతోషంగా ఉంటారు.. నారాయణ మాత్రం బావగారు బాగున్నారా? ఆయన ఆరోగ్యం బాగుందా? నేను అడగమని చెప్పాను కదా అమ్మ అడిగావా అని మహాలక్ష్మిని అడుగుతాడు నారాయణ.. అందరూ బాగున్నారు అని మహాలక్ష్మి చెప్పి లోపలికి వెళ్తుంది.. లోపలికి వెళ్ళగానే మహాలక్ష్మి ఏడుస్తూ కనిపిస్తుంది..

మహాలక్ష్మి ఏడవడం చూసిన కన్నా ఏమైంది అని సీరియస్ అవుతాడు. వాళ్లు సర్టిఫికెట్లు బూడిద చేశారు అని మహాలక్ష్మి చెప్పగానే.. కేశవ వాళ్ళకి కొంచమైనా బుద్ధుందా అసలు మనం వెళ్లాల్సింది తప్పు చేసాము అని సీరియస్ అవుతాడు.. ఇన్నేళ్లు కష్టపడి చదివిన చదువుని ఆ డిగ్రీ పట్టాని కాల్చి బూడిద చేశారు వాళ్ళు ఏం మనుషులు అసలు అనేసి కేశవ కోపడతాడు.. నాక్కూడా అలాంటి కోపమే వచ్చింది అని మహాలక్ష్మి అనగానే మనము నిజంగానే తనతో పాటు వెళ్లి ఉంటే ఇంత జరిగేది కాదు అని కేశవ అంటాడు. తర్వాత మహాలక్ష్మి బాధ పడుతూ ఉంటే చక్రి లోపలికి వెళ్లి ఓదార్చడానికి ప్రయత్నిస్తాడు.. కానీ మహాలక్ష్మి మాత్రం చక్రికి కౌంటర్ల మీద కౌంటర్లు వేస్తుంది. హారిక తనకి సారీ చెప్తూ వాయిస్ మెసేజ్ పంపిస్తుంది అది విన్న మహాలక్ష్మి ఆలోచిస్తూ ఉంటుంది..

అప్పుడే గాయత్రి అక్కడికి వస్తుంది గాయత్రీ ని చూసిన మహాలక్ష్మి భయపడుతుంది.. గాయత్రి మహాలక్ష్మి ఇద్దరు ఫ్రెండ్స్ అయిపోతారు.. చక్రి వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో తెలుసుకోవాలని చాటుగా వింటాడు. మొత్తానికి ఇద్దరు కలిసి ఫ్రెండ్స్ గా మారిపోవడం చూసి చక్రి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు.. ఉదయం అందరిని మహాలక్ష్మి నిద్ర లేపుతుంది.. అది కాస్త కామెడీగా ఉండడంతో ఎపిసోడ్కి హైలైట్ గా నిలుస్తుంది.. ఇక అందరూ కలిసి సరదాగా ఉంటారు.. మహాలక్ష్మి ముగ్గు వేసి లోపలికి వెళ్ళగానే.. నారాయణ రెడీ ఈ బయటకు వచ్చి ఆ ముగ్గు పైన బీడీ ముక్క వేస్తాడు.. దాంతో అది చెరిగిపోవడంతో ఎలాగోలా ఒక మేనేజ్ చేయాలని ముగ్గు వేయడానికి ట్రై చేస్తాడు..

Also Read :మనోజ్ కు దిమ్మతిరిగే షాక్.. దినేష్ దొరికిపోయాడు.. అడ్డంగా దొరికిన రోహిణి..

నారాయణ అతి కష్టం మీద ముగ్గుని పూర్తి చేస్తాడు. అయితే లారీ డ్రైవర్ బుద్ధి పోనిచ్చుకోలేదు. అది చూసిన కన్నా ఇంట్లోని వాళ్ళందరినీ కేక వేసి బయటకు పిలుస్తాడు.. ఇక అక్కడ లారీ ముగ్గురిని చూసి అందరూ ఒక్కసారిగా నవ్వుకుంటారు.. ఆ తర్వాత మహాలక్ష్మి టీ పెట్టడం చూసి మిగతా వాళ్ళందరూ షాక్ అవుతారు మొత్తానికి మహాలక్ష్మి పెట్టిన టీ బావుండడంతో అందరూ తాగుతారు.. ఇక చక్రి మహాలక్ష్మి కోసం జాబును వెతికే ప్రయత్నం చేస్తాడు. తన ఫ్రెండుని బ్రతిమలాడి మరి మహాలక్ష్మికి జాబ్ ఇప్పించాలని ఎన్నో మాటలను చెప్తాడు.. జాబు ఇప్పుడు కష్టం రాని తన ఫ్రెండ్ ఎంత చెప్పినా సరే.. చక్రి చేతులు పట్టుకొని బ్రతిమలాడుతాడు. మొత్తానికి తన ఫ్రెండ్ లవ్ స్టోరీ ని గుర్తు చేసి అతని ఎమోషనల్ గా కట్టిపడేస్తాడు..అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×