E-Paper
Advertisement

Gundeninda GudiGantalu Today episode: రవి కాపురంలో చిచ్చుపెట్టిన నీతూ.. సంజుకు మీనా దిమ్మతిరిగే షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..

Gundeninda GudiGantalu Today episode: రవి కాపురంలో చిచ్చుపెట్టిన నీతూ.. సంజుకు మీనా దిమ్మతిరిగే షాక్.. ఇది కదా అసలు ట్విస్ట్..
Advertisement

Gundeninda GudiGantalu Today episode February 25th : నిన్నటి ఎపిసోడ్ లో.. మీనా బాలు ఇద్దరు కలిసి ఒక అవ్వ తాత దగ్గరికి వెళ్తారు. మీనా బాలు ఇద్దరు కలిసి ఇవ్వాలని చాలా సంతోషంగా ఉంచాలి అని అనుకుంటారు. ఆ తాత చెప్పినా డైలాగులు జనాలను కన్నీళ్లు తెప్పించేలా ఉంటాయి. ఈ సీరియల్ కి ఇదే ఎమోషనల్ ట్విస్ట్. మనోజ్వచ్చిన లెటర్ ని తెలుసుకోవడానికి గుడికి వెళ్తారు.. అక్కడ ఒక స్వామీజీ రోహిణి గురించి బండారం బయట పెట్టబోతాడు.. అయితే రోహిణి ఖచ్చితంగా ఈ వేషంలో వచ్చింది దినేష్ అని ఫీల్ అవుతుంది. వీడు నా గురించి అంత నిజాలను బయట పెట్టేలా ఉన్నాడు. ఏదో ఒకటి చేసి ఆపాలి అని ఎంతగా ప్రయత్నించినా సరే దినేష్ మాత్రం మనోజ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు. దినేష్ ఈ లెటర్ చదువు నీకే అర్థమవుతుంది అని మరో లెటర్ ని మనోజ్ కి ఇస్తాడు. ఎవరు ఇచ్చారు స్వామి అంటే ఒక అబ్బాయి ఇచ్చాడు. మీ ఇంట్లో వల్లే ఇచ్చినట్లున్నారు అని అనగానే మనోజ్ కచ్చితంగా నా చుట్టూ ఎవరో ఉన్నారు అని అనుకుంటాడు. బాలు అన్న పేరు తెలుసుకోగానే మనోజ్ ఇంటికి పోయి రెచ్చిపోతాడు. పెద్ద రచ్చ కూడా చేస్తాడు.. ఇంట్లో ఏం జరిగినా బాలు మీదేకే వేస్తున్నారు అని మీనా మాటకు మాట సమాధానం చెబుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. బాలు కారు ఎక్కిన విద్య రోహిణి గురించి అన్ని విషయాలు షేర్ చేసుకుంటుంది. బాలు కి అనుమానం కూడా వస్తుంది. రోహిణి చెప్పినట్లు బాలు ఫోన్ ని విద్య తీసుకుంటుంది.. కానీ అంతలోపే మీనా ఫోన్ చేయడంతో ఆ ఫోన్ ని మళ్లీ బాలు తీసుకుంటాడు.. ఇక బాలు మీనా తో దినేష్ దొరికినట్లు చెప్తాడు.. ఆ మాట విన్నా విద్యా షాక్ అవుతుంది. ఈ విషయం ఎలాగైనా సరే ఇంట్లో చెప్పాలని అనుకుంటాడు.. మాట చెప్పగానే వీడు ఇలాంటి గొడవలు కూడా తెచ్చి పెడుతున్నాడా అని ప్రభావతి అంటుంది.. వాడు కావాలనే ఇదంతా చేసాడు వాని పట్టుకొని వాడి నోటనే నిజం చెప్పేస్తాను అని బాలు అంటాడు.. ఇక తర్వాత రవి శృతి వెళ్తూ ఉంటే రవి బాస్ నీతూ కూడా అదే బండిపై వెళ్ళాలని అనుకుంటుంది.. కలిసి త్రిబుల్ రైడ్ వెళ్తే పోలీసులకు చిక్కుతారని ఎంతగా చెబుతున్నా సరే ఆమె వినకుండా బండి ఎక్కుతుంది.

Advertisement

శృతి మాత్రం మధ్యలో కూర్చుని ఉంది అని తనని ఏదో ఒకటి అంటూ ఉంటుంది. దానికి తోడు రవి స్పీడ్ బ్రేక్ వేయడంతో శృతి ఇవాళ ఇంటికి వెళ్తే నీకు కచ్చితంగా మూడుతుంది పద అనేసి అనుకుంటుంది.. అయితే ట్రాఫిక్ పోలీస్ ఆపడంతో శృతి రవిని తిడుతుంది. కానీ నీతూ మాత్రం ఏకంగా పోలీస్ బండి ఎక్కేసి వెళ్ళిపోతుంది.. ఇక ప్రభావతి ముగ్గురు కొడుకులు ఉన్నారు కూడా నన్ను ఎవరు తీసుకొని వెళ్లి తీసుకొని రావడం లేదు. కాళ్ళు నొప్పులు వస్తున్నాయి నడిచిన అని ప్రభావతి అంటుంది.. అయితే ఏంటి ఈ మాతావతి ఏదో అంటుంది అని బాలు వచ్చి అంటాడు. మొత్తానికి బాలు ప్రభావతి ఇద్దరూ కూడా కాసేపు సరదాగా గొడవపడతారు. ఆ తర్వాత మీరు అమ్మతో గొడవ పడుతూ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు..

ఏంటి? ఏంటి ఆ విషయం అని ప్రభావతి అడుగుతుంది. ఏం లేదు ఇప్పుడు బొమ్మలు కొలువుతో పాటుగా సంతన వ్రతం కూడా చేయించాలి అని సత్యం అంటాడు. ఇప్పుడు అవన్నీ ఎందుకు అని ప్రభావతి అడుగుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన మనోజ్ ఏంటి దేని గురించి మాట్లాడుతున్నారు అని అడుగుతాడు. అయితే బాలు ఏమి మింగావు. ఏం మింగి చచ్చావు అని మాట్లాడుకుంటున్నావ్ రా అని వెటకారంగా మాట్లాడుతాడు. ఏం లేదురా సంతానం వ్రతం చేయించాలని అనుకుంటున్నాము అని ప్రభావతి అంటుంది. ఇక వీళ్లిద్దరి కన్వర్జేషన్ ఎపిసోడ్కి కాస్త కామెడీగా అనిపిస్తుంది. మనోజ్ రోహిణి లతోనే వ్రతం చేయించాలని ప్రభావతి అంటే బాలు మీనా ఇద్దరు కూడా మాటలతో ప్రభావతికి బుద్ధ వచ్చేలా చేస్తారు.

Advertisement

ఈ వ్రతం చేయించాలి అంటే మా అమ్మ వస్తుంది అని అనగానే ప్రభావతి షాక్ అవుతుంది. ఇప్పుడు ఆవిడ ఎందుకు వస్తుంది అని షాక్ అవుతుంది.. ఆవిడొస్తే నా పని అయిపోయినట్లే అని ఆలోచిస్తూ ఉంటుంది.. ఈ వ్రతం చేయించడానికి మౌనికని సంజు ని కూడా పిలిస్తే బాగుంటుంది అని మీనా అంటుంది.. అయితే నేను చేస్తే అల్లుడుగారు తప్పకుండా వస్తాడు అని ప్రభావతి గొప్పలు చెప్పుకుంటుంది.. ప్రభావతి ఫోన్ లిఫ్ట్ చేయగానే సంజు దిమ్మ తిరిగిపోయే షాక్ ఇస్తాడు. మీ ఇంటికి వస్తే నాకు ఎలాంటి మర్యాదలు జరుగుతాయో నాకు బాగా తెలుసు. నేను రాను మీ అమ్మాయిని పంపించను అని అంటాడు. ప్రభావతి ఎంతగా నచ్చ చెప్పాలని చూసినా కూడా సంజయ్ మాత్రం తన నిర్ణయాన్ని మార్చుకోడు..

మౌనిక ఈ ఫంక్షన్ కి రావాలి అంతే కదా నేను తీసుకొని వస్తాను అని మీనా ఛాలెంజ్ చేస్తుంది. నేను పిలిస్తేనే రానని అన్నాడు నువ్వు పిలిస్తే పంపిస్తాడా ఏం మాట్లాడుతున్నావ్ అని ప్రభావతి అంటుంది. ఒకవేళ నేను తీసుకొని వస్తే ఏం చేస్తారు అని మీనా అంటుంది. నువ్వు ఏది చెప్తే అది చేస్తాను అని ప్రభావతి అంటుంది. మీనా బాలు ఇద్దరు కూడా నాన్న ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి మీరే సాక్ష్యం మీనా గెలిస్తే అమ్మ మీనా చెప్పినట్టు చేయాలి అని బాలు అంటాడు. ఇక మీనా మౌనిక దగ్గరికి వెళ్లి మాట్లాడుతూ ఉండగా సంజయ్ వస్తాడు.. సంజయ్ కి దెబ్బకు దెబ్బ రుచి చూపిస్తానని వార్నింగ్ ఇస్తుంది మీనా.. మీనా మాట విన్న సంజయ్ నీకెంత ధైర్యం అని రెచ్చిపోతాడు.. కానీ మధ్యలో నీలకంఠ వచ్చి మీ అమ్మాయిని పంపిస్తామని చెప్తాడు..

Also Read : సాగర్ గుట్టు రట్టు.. రామరాజు మాటతో కన్నీళ్లు.. నర్మదకు షాకివ్వబోతున్న భాగ్యం..

ఇక ప్రభావతి ఇంట్లో ఉన్న పాత సామాన్లని దుప్పట్లని బయటపెడుతుంది.. ఏంటి ఎందుకు ఇవన్నీ బయట పెడుతున్నావు అని బాలు అడుగుతాడు.. లేదు మీ ఆవిడ లాగా ఓడిపోతుంది కదా అ పూల కంపెనీ పక్కన పెట్టేసి ఇంట్లో ఉన్న సామాన్లన్నీ రోజు కడుగుతూ ఇంట్లోనే ఉండాలి అని అంటుంది.. అప్పుడే ఇంట్లోకి వచ్చిన మీనా ఇవన్నీ ఏంటి ఇక్కడ పెట్టారు అని అడుగుతుంది. ఏంటి మౌనిక వాళ్ళని తీసుకొని వస్తానని శబదాలు చేశావు కదా రానన్నారా గెంటేసారా బయటికి తోసేసారా అని ప్రభావతి అడుగుతుంది.. మావయ్య గారు మీరు ఒకసారి అమ్మమ్మ గారికి ఫోన్ చేసి మౌనికకు వాళ్ళ ఆయనకు బట్టలు పెట్టాలి ఏమో అడగండి అని మీనా అంటుంది. మాట వినగానే ప్రభావతికి ఫీజులు ఎగిరిపోతాయి. ఇక అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి…

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×