E-Paper
Advertisement

Podarillu Today Episode : పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహా, చక్రి..ప్రతాప్ కు దిమ్మతిరిగే షాక్.. చక్రితో మహా పెళ్లి..?

Podarillu Today Episode : పోలీస్ స్టేషన్ కు వెళ్లిన మహా, చక్రి..ప్రతాప్ కు దిమ్మతిరిగే షాక్.. చక్రితో మహా పెళ్లి..?
Advertisement

Podarillu Today Episode January 13th: నిన్నటి ఎపిసోడ్ లో.. మహా వాళ్ళని ఫాలో అవడానికి రౌడీలు కూడా వస్తారు.. ఈ సీన్ మొత్తం సినిమాని తలపించేలా ఉంటుంది.. మహా చక్రి ఇద్దరు పారిపోతుంటే రౌడీలు వచ్చి అడ్డుపడతారు.. రౌడీలను కొట్టేందుకు చక్రి రెడీ అవుతాడు కానీ ఎక్కువ మంది రౌడీలు రావడంతో భయపడతాడు.. ప్రతాప్ వాడిని చంపేసి నా కూతుర్ని తీసుకురండి అని అంటారు.. అయితే వాళ్ళు చక్రిని కొట్టబోతుంటే ఒక రెడ్ కలర్ వచ్చి అక్కడ ఆగుతుంది. సినిమా లెవెల్ లో ఆ సీన్ ఉండడంతో అక్కడ రౌడీలు ఏమవుతుందని చూస్తూ షాక్ అవుతారు.. అందులో గుండె నిండా గుడి గంటలు సీరియల్ బాలు రావడం కనిపిస్తుంది.. బాలుని చూసిన రౌడీలు అందరూ కూడా ఎవరా అని చూస్తూ ఉంటారు.  బాలు వాళ్ళని కారులోకి ఎక్కమని అంటాడు. భూషణ్ మీ చెల్లెలికి ఇంకెంతమంది ఫాలో అవుతున్నారు. ఇంత ఫాలోయింగ్ ఉన్నా ఏంటి అని షాక్ అవుతాడు. వాడెవడో నాకు తెలియదు బావగారు ఇప్పుడు వాడిని ఎవడో కనుక్కొని నా చెల్లిని తీసుకొచ్చి నీతో పెళ్లి చేస్తాను అని అది అంటాడు.. ఒక దేవుడిలాగా వచ్చి బాలు మహా, చక్రిని కాపాడుతాడు. ఈ ఎపిసోడ్ కు ఇదే హైలెట్ అవుతుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే… బాలు అటూ ఇటూ చేసి రౌడీలను కన్ఫ్యూజ్ చేసేందుకు రోడ్లన్నీ తిప్పుతాడు.. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్కు వెళ్లి మమ్మల్ని కాపాడమని వేడుకోండి నేను నా కారులోని మీరు ఉన్నట్లు వాళ్ళని డైవర్ట్ చేసి అటు ఇటు తిప్పేస్తాను అని అంటాడు.. పోలీస్ స్టేషన్ కు మహా, చక్రి వెళ్లిపోతుంటే రౌడీలు వాళ్లని చూసి పట్టుకొనేందుకు ప్రయత్నాలు చేస్తారు.. కానీ వాళ్ళిద్దరూ కూడా అక్కడి నుంచి పారిపోతారు. వాళ్ళని చూసి పోలీస్ స్టేషన్లోకి పరుగులు పెడతారు అయినా కానీ రౌడీలు వదిలిపెట్టరు.. వాళ్ళిద్దర్నీ తరుముకుంటూ పోలీస్ స్టేషన్ లోపలికి వెళ్ళిపోతారు. కానీ అక్కడికి వెంటనే ప్రతాప్ వాళ్ళు కూడా వస్తారు..

Advertisement

చక్రితో మహా ఉండడం చూసిన వాళ్లందరూ కూడా నువ్వు ఇలా రా నువ్వు వాడిని వదిలేసి ఇక్కడికి వచ్చేసేయ్ అని ఎంత చెప్పినా మహా మాత్రం చక్రిని వదిలిపెట్టదు.. కానీ ప్రతాప్ నేను ఒక బిజినెస్ మాన్ ని నా కూతురును కిడ్నాప్ చేసి తీసుకొచ్చాడు అని ప్రతాప్ అనడంతో మహా షాక్ అవుతుంది. కానీ వాళ్ళెంత చెప్పినా సరే వినకుండా భోజనం వచ్చి చక్రిని కొట్టబోతాడు. పోలీసులు ఇది పోలీస్ స్టేషన్ అనుకుంటున్నారా ఇంకేమైనా అనుకుంటున్నారా రౌడీలను తీసుకువచ్చారు ముందు వాళ్ళందరిని బయటకు వెళ్ళమనండి అని అంటారు. ఆది తమ రౌడీలు అందరినీ బయటికి పొమ్మని చెప్తాడు..

భూషణ్ మాత్రం నువ్వు రా వెళ్లి పెళ్లి టైం అవుతుంది అందరూ వచ్చేసారు పెళ్లి చేసుకోవాలి అని అంటాడు.. మహాను మనం వెళ్లి మేకప్ వేసుకొని రెడీ అయ్యి పెళ్లి చేసుకోండి రా నీకు బలవంతం చేస్తాడు.. కానీ పోలీసులు మాత్రం వాడు బలవంతం చేస్తున్నాడు అని బయటికి తీసుకెళ్ళమని చెప్తారు. తర్వాత ప్రతాప్ మహా దగ్గరికి వెళ్లి నిన్ను ఇంత జరిగిన తర్వాత కూడా భూషణ్ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాడు నువ్వు రా అని చెప్పేసి అడుగుతాడు.. మహా మాత్రం వాడితో పెళ్లొద్దనే కదా నాన్న నేను వచ్చేసింది.. మరి మళ్లీ వాడితో పెళ్లి అంటారు ఏంటి అని అడుగుతుంది.. ఎస్సై కానిస్టేబుల్ని చక్రిని పక్కకు తీసుకుని వెళ్లి అసలు మేటర్ అంటే కనుక్కోమని చెప్తాడు.. చక్రి కానిస్టేబుల్ ని ఒక ఆట ఆడుకుంటాడు..

Advertisement

మొత్తానికి చక్రి కానిస్టేబుల్ ని కన్ఫ్యూషన్ లో పెట్టేసి తాను చెప్పాలనుకున్న విషయాన్ని చెప్పేస్తాడు.. పెళ్లి ఇష్టం లేక నీతో వచ్చేసింది అంతే కదా అని కానిస్టేబుల్ క్లారిటీ తీసుకుంటాడు. తనని ఈ పెళ్లి నుంచి కాపాడ్డానికి నేను అమ్మాయిని తీసుకొని వచ్చాను అని చక్రి చెబుతాడు. వాడి నుంచి కాపాడడానికే వాళ్ళ నాన్నని ఎదిరించి నేను అమ్మాయిని తీసుకొని వచ్చాను మీలాంటి గొప్ప వ్యక్తులకి నేను చెప్పాలా మీకు అన్ని అలా అర్థమైపోతాయని చక్రి అంటాడు.. భూషణ్ మాత్రం చాలా ఆవేశంగా ఉంటాడు.. అటు ఎస్ఐ కూడా మహానే అడిగి జరిగిన విషయాన్ని తెలుసుకుంటాడు.. అమ్మాయి మీకు రావడానికి ఇష్టపడడం లేదని చెప్పగానే షాక్ అవుతాడు.

Also Read :ధీరజ్ ను ఆడుకున్న అన్నలు.. ప్రేమ ఎమోషనల్.. ధీరజ్ కు స్ట్రాంగ్ వార్నింగ్..

ఒకవైపు ఆది అలాగే భూషణ్ ఇద్దరు కలిసి మహనీ బలవంతంగా బయటికి తీసుకెళ్ళేందుకు ప్రయత్నిస్తారు.. పోలీసులు కూడా అడ్డుకుంటారు.. నువ్వు వాన్ని ప్రేమించావు కదా అని భూషణ్ మహాని అడుగుతాడు.. అందుకే వాడితో టైం చూసుకొని వచ్చేసావు అని అంటాడు. మహాను తీసుకొని ఒక 10 నిమిషాలు మాట్లాడాలని ఎస్ఐ ని అడుగుతాడు. చూస్తుంటే భయమేస్తుంది ఇక్కడే మాట్లాడండి అని ఎస్ఐ అనగానే మహాతో ప్రతాప్ మాట్లాడతాడు.. నా ఇష్టాన్ని మీరు అర్థం చేసుకోండి నాన్న అని మహా అడుగుతుంది. కానీ ప్రతాప్ మాత్రం నీకోసం ఎంతో చేశానో ఇంతకన్నా నీకోసం ఇంకేం చేయాలి అని సీరియస్ అవుతాడు.. కానీ మహా మాత్రం ఈ పెళ్లి నాకు ఇష్టం లేదు అని చెప్పేస్తుంది.. అంటే నేను మీతో సంతోషంగా ఇంటికి వస్తాను అని అంటుంది.. కానీ ప్రతాప్ మాత్రం అందుకు ఒప్పుకోడు.. మహా షాక్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్లో మహా చక్రి ఇద్దరు పెళ్లి చేసుకుంటారా..? ప్రతాప్ చక్రిని చంపేస్తాడా? పరిస్థితి ఏంటి అన్నది రేపటి ఎపిసోడ్లో చూడాలి…

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×