E-Paper
Advertisement

Podarillu Today Episode : నారాయణ ఫుల్ హ్యాపీ.. చక్రీ, మహాకు గ్రాండ్ వెల్కమ్.. చక్రీ మోసం బయటపడుతుందా..?

Podarillu Today Episode : నారాయణ ఫుల్ హ్యాపీ.. చక్రీ, మహాకు గ్రాండ్ వెల్కమ్.. చక్రీ మోసం బయటపడుతుందా..?
Advertisement

Podarillu Today Episode January 20th: నిన్నటి ఎపిసోడ్ లో.. ఇంటికి మొత్తం లైట్లు వేసి సెటప్ ని పూర్తిగా మార్చేస్తారు. అంతే కాదు డీజే కూడా పెట్టి మా ఇంటికి ఆడ దిక్కు వచ్చింది అని చెప్పాలని అనుకుంటారు.. వదిన వస్తుంది కదా అన్నయ్య ఈ మాత్రం చేయకపోతే భయపడిపోతుంది కదా అందుకే ఇలాంటివి చేస్తున్నాము అని అంటారు.. బయటి నుంచి వచ్చిన నారాయణ నేనేంటి పొరపాటున తాగకుండానే పక్కింటికి వచ్చేసానా ఏంటి అని అనుకుంటారు. బషీర్ మాత్రం ఇది మీ ఇళ్లే ఒకసారి చూడండి అని అంటాడు..

అవును మా ఇళ్లే అయితే ఏంటి ఇలా మారిపోయింది అని నారాయణ అడుగుతాడు.. నారాయణ ఏంటి ఇదంతా నేను పోయిన తర్వాత చేయాల్సింది బతికుండగలే చేస్తున్నారేంటి అని అడుగుతాడు. అయితే ఈ విశేషం ముందు నాన్న చిన్నోడు ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఏంట్రా నువ్వు మాట్లాడేది అని మాధవ్ ని నారాయణ అడుగుతాడు.. నువ్వు విన్నది నిజమే వాడు ఒక గొప్ప అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. వాడు ఈ ఊర్లో ఉన్న అమ్మాయినైతే కచ్చితంగా చేసుకొని ఉండడు పక్కూర్లో అమ్మాయినే చేసుకుని ఉంటాడు అని నారాయణ అనుకుంటాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది.

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. చక్రి మహనీ తన ఇంటి గురించి గొప్పగా చెప్పినట్లు ఊహించుకుంటాడు. మా ఇంటి గురించి ఎన్నెన్నో గొప్పలు చెప్పాను. ఇంటిని చూస్తే ఖచ్చితంగా భయపడుతుందేమో అని చక్రి అనుకుంటాడు. మీ ఇల్లు కాశీలో ఉందా ఏంటి ఇంకా రాలేదు అని అడుగుతుంది. నారాయణ తన కొడుకుకి పెళ్లి అయిందని చాలా సంతోషంగా ఉంటాడు.. నా ఇంటికి కూడా కోడలు వచ్చింది అని పాటలు పాడుకుంటూ టీ షాప్ దగ్గరికి వస్తాడు. అక్కడ అందరూ ఏంటి నారాయణ ఎక్కువ మందు తాగావా? పిచ్చి పట్టినట్లు ప్రవర్తిస్తున్నావ్ అని అనగానే నాకేమీ పిచ్చి పట్టలేదు నేను చెప్పింది వింటే మీ అందరికీ పిచ్చి పడుతుంది అని అంటాడు.. తన రెండో కొడుకు ఒక గొప్పింటి అమ్మాయిని పెళ్లి చేసుకుని వస్తున్నాడని చెప్తాడు. ఆ మాట వినగానే తన అన్న షాక్ అవుతాడు..

ఇక నా ఇంటికి అమ్మాయి రాదని అన్నారు. ఎవరో శాపాలు పెట్టారు అవన్నీ జరుగుతాయని అందరూ అనుకున్నారు కానీ అందులో నిజం లేదు నా కొడుకు కోడల్ని తీసుకొని ఇంటికి వస్తున్నాడు మీరు దగ్గరుండి చూడాలి అని అంటాడు. అప్పుడే చక్రి మహాను తీసుకొని వస్తాడు. వాళ్ళ ఇంటిదగ్గర లైట్లు వేసి వీధి చివరి నుంచి బాంబులు పేలుస్తూ చాలా హడావిడి చేస్తూ కనిపిస్తారు.. చక్రి కారుని కన్నా కేశవ ఆపుతాడు.. నువ్వు స్లోగా కారును తీసుకొని రా అని బాంబులు పేల్చడంతో మహా ఏంటిదంతా అని అనుకుంటుంది.. అయితే చక్రి ఇప్పుడు వీళ్ళేదంతా చేస్తే కచ్చితంగా నన్ను తిడుతుందేమో అని భయపడుతూ ఉంటాడు..

Advertisement

ఆ ఊర్లోని వాళ్ళందరూ కూడా మహాని చూడడానికి వస్తారు.. వీళ్ళు ఎవరు ఎప్పుడు మనుషుల్ని చూడలేదా ఏంటి ఇంత వింతగా చూస్తున్నారు అని మహా చిరాకు పడుతుంది. మొత్తానికి చక్రి ఏదో ఒకటి మేనేజ్ చేసే మహానే తన ఇంటి వరకే తీసుకుని వెళ్తాడు. గాయత్రి హారతిస్తుంటే మధ్యలో తాయారు ఎవరి పెళ్లి ఎవరికీ హారతి ఇస్తున్నావు అని దాన్ని విసిరి కొడుతుంది. కన్నా లోపలికి వెళ్లి నేను మా వదినకి హారతి ఇస్తాను అని హారతి పళ్లెం పట్టుకుని వస్తాడు. నారాయణ తాగేసి వచ్చి నా ఇంటికి కోడలు వచ్చింది అందరూ చూడండి అని చాలా సంతోషంగా చెప్పుకుంటాడు. నారాయణ నాగేష్ రావడంతో మహా చిరాగ్గా ఫీల్ అవుతుంది..

ఇక మహాని లోపలికి రమ్మని తీసుకుని వెళ్తారు. ముగ్గురు అన్నదమ్ములు కూడా మహాని చాలా గొప్పగా చూసుకోవాలని అనుకుంటారు. అన్నా, తమ్ములని చక్రి పరిచయం చేస్తాడు.. అందరిని చూసి చక్రి చెప్పింది అబద్ధమని అనుకుంటుంది.. ఇక మాధవ్ చేసిన పాయసం తిని చక్రి తో ఒక ఐదు నిమిషాలు మాట్లాడాలని అనుకుంటుంది. చక్రిని లోపలికి రమ్మని పిలుస్తుంది. మహా లోపలికి వెళ్ళగానే ఏంటి ఇదంతా మీ ఇంటికి నేను ఇష్టపడి పెళ్లి చేసుకుని వచ్చానని మీ వాళ్ళు అనుకుంటున్నారు.. నాకు ఎలా తెలుస్తుంది అండి ఫోన్ కూడా మీ ముందరే ఆన్ చేశాను నేను ఏమైనా ఫోన్ చేసి ఇదంతా చెప్పానా ఏంటి పోలీసులు చెప్పారు అని అంటాడు..

Also Read : చక్రధర్ ను కలిసిన మీనాక్షి..అయ్యో పల్లవి ఇరుక్కుందే.. నిజం బయటపడుతుందా..?

ఇదంతా నాకేమీ నచ్చలేదండి మీ వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు మీరు నిజం చెప్పండి అని అంటుంది.. వాళ్లు మనం నిజంగానే పెళ్లి చేసుకుందామని అనుకుంటున్నారు అందుకే ఈ హంగామా అంత చేస్తున్నారని చక్రి అంటాడు. అయితే మనం పెళ్లి చేసుకోలేదు కదా ఎందుకు వీళ్ళు ఇంత చేస్తున్నారు. ఇలాంటివన్నీ నాకు నచ్చదు అని మహా అంటుంది.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఆది చక్రి ఇంటికి వెళ్తాడు.. ఇవాళ నేను చంపేనా సరే నా చెల్లెలు తీసుకొని వెళ్తాను అని గొడవకు దిగుతాడు.. మరి ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…

Related News

Podarillu Mahalakshmi : ‘పొదరిల్లు’ సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. మహా అవుట్…

Gundeninda GudiGantalu Today episode: అయ్యో పాపం మీనా.. ప్రభావతి ఫుల్ హ్యాపీ.. బాలుకు అనుమానం..

Nindu Noorella Saavasam Serial Today Episode July 20th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: హోమం చూసి భయపడిన ప్రచండ – కోపంతో రగిలిపోయిన మనోహరి  

Podarillu Today Episode : చక్రికీ మైండ్ బ్లాక్.. భయంకరమైన నిజాన్ని తెలుసుకున్న మహా.. శైలు ఎంట్రీ..

Karthika Deepam 2 Serial Today Episode July 20th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: పోటీలో గెలిపించిన దీప – ఎమోషనల్ అయిన శివనారాయణ   

Illu Illalu Pillalu Today Episodes: దిమ్మతిరిగే ట్విస్ట్ ఇచ్చిన భద్ర.. ధీరజ్ కు అనుమానం.. వల్లి ప్లాన్ ఇదా..?

Intinti Ramayanam Today Episode: అవనికి అక్షయ్ షాక్.. పల్లవికి అక్షయ్ వార్నింగ్… పల్లవి రచ్చ రచ్చ..

Brahmamudi Serial Today Episode July 20th ‘బ్రహ్మముడి’ సీరియల్‌: ఇందు ధర్నా సక్సెస్‌ – అత్తారింటికి బయలుదేరిన రాజు  

Big Stories

Advertisement
×