E-Paper
Advertisement

Fake DigiLocker scam: బ్యాంక్ అకౌంట్ దోచుకుంటున్న ఈ నకిలి యాప్.. వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి

Fake DigiLocker scam: బ్యాంక్ అకౌంట్ దోచుకుంటున్న ఈ నకిలి యాప్.. వెంటనే ఈ జాగ్రత్తలు పాటించండి
Advertisement

Fake DigiLocker scam| ఇండియాలో డిజిటల్ సేవలు వినియోగదారుల సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. ఈ సేవలు మన జీవిన విధానాన్ని సులభతరం చేస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఆన్‌లైన్ మోసాలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పుడు గూగుల్ ప్లే స్టోర్‌లో నకిలీ డిజిలాకర్ యాప్‌లు కనిపిస్తున్నాయి. గతంలో కూడా ఇలా జరిగింది. ఈ యాప్‌లు అన్నీ అఫీషియల్ యాప్ లాగా ఓరిజినల్ లాగానే కనిపిస్తాయి. కానీ పొరపాటున డౌన్‌లోడ్ చేసుకున్నారో.. నిజంగా ఫోన్‌లోని మీ వ్యక్తిగత డేటా, బ్యాంక్‌లోని డబ్బులు పోయినట్టే.

ఫేక్ డిజిలాకర్ యాప్‌లు ఎలా మోసం చేస్తాయి?

మోసగాళ్లు ఈ యాప్‌లను ప్రభుత్వ యాప్ లాగానే డిజైన్ చేస్తారు. అఫీషియల్ లాగా కనిపించే లోగో, రంగులు, డిజైన్ ఉపయోగిస్తారు. చాలా మంది యూజర్లు.. డెవలపర్ పేరు చూడకుండా డౌన్‌లోడ్ చేసేస్తారు. యాప్ ఇన్‌స్టాల్ అయ్యాక వెంటనే SMS, కాల్ లాగ్స్, స్క్రీన్ రికార్డింగ్, కాంటాక్ట్స్ వంటి ప్రమాదకరమైన పర్మిషన్లు అడుగుతుంది. అయితే ఇది ఒక డాక్యుమెంట్ స్టోరేజ్ యాప్‌.. ఇలాంటి యాప్‌కి ఈ పర్మిషన్స్ అవసరం లేదు. అనుమతి ఇచ్చిన తర్వాత Aadhaar, PAN, ఫోన్ నంబర్ వెరిఫికేషన్ అడిగి OTPలు చదివేస్తారు. కొన్ని యాప్‌లు ఫేక్ బ్యాంక్ లేదా UPI పేజీలు చూపిస్తాయి. అక్కడ లాగిన్ డీటెయిల్స్, ట్రాన్సాక్షన్ OTPలు ఎంటర్ చేస్తే డబ్బులు కోల్పోతారు. చాలా మంది ఇన్‌స్టాల్ చేసిన కొన్ని నిమిషాల్లోనే తమ బ్యాంక్ బ్యాలెన్స్ ఖాళీ అయినట్లు ఫిర్యాదు చేశారు.

ఈ ఫేక్ యాప్‌లు ఎందుకు చాలా ప్రమాదకరం?

Advertisement

ఈ యాప్‌లు బ్యాక్‌గ్రౌండ్‌లో నిశ్శబ్దంగా పనిచేస్తాయి. డబ్బు పోయాకే యూజర్లకు తెలుస్తుంది. SMS యాక్సెస్‌తో OTPలు ఇంటర్‌సెప్ట్ చేస్తారు. స్క్రీన్ రికార్డింగ్‌తో బ్యాంకింగ్ యాక్టివిటీ చూస్తారు. దీంతో బ్యాంక్, UPI ఖాతాలపై పూర్తి కంట్రోల్ వస్తుంది. యూజర్లు ఏమీ షేర్ చేయకుండానే డబ్బులు కోల్పోతారు.

అధికారిక డిజిలాకర్ యాప్‌ను ఎలా గుర్తించాలి?

అధికారిక డిజిలాకర్ యాప్‌ను ప్రభుత్వం విడుదల చేసింది. డెవలపర్ పేరు “National e-Governance Division” (NeGD), Government of India అని ఉంటుంది. ఇది ఒక్కటే అసలైన యాప్. డెవలపర్ పేరులో చిన్న తేడా కనిపించినా అది ఫేక్ యాప్. అధికారిక యాప్ అనవసర పర్మిషన్లు కోసం అడగదు. SMS రీడింగ్ లేదా స్క్రీన్ రికార్డింగ్ అడగదు.

జాగ్రత్తగా ఉండాల్సిన ముఖ్య విషయాలు

Advertisement

పర్మిషన్లు సందేహాస్పదంగా ఉంటే యాప్ ప్రమాదకరం. డౌన్‌లోడ్‌లు తక్కువగా ఉండి రివ్యూలు ఎక్కువగా ఉంటే అది ఫేక్ కావచ్చు. డెవలపర్ ఈమెయిల్ ఐడి కూడా వింతగా ఉంటే జాగ్రత్త. భాషా గ్రామర్ తప్పుగా ఉన్నా, ఫేక్ వెరిఫికేషన్ ప్రాంప్ట్‌లు కనిపించినా అది మోసపూరిత యాప్. అత్యధిక పర్మిషన్లు అడిగే యాప్‌లను ఇన్‌స్టాల్ చేయకండి. ఇన్‌స్టాల్ చేయడానికి ముందు పర్మిషన్లు బాగా చూడండి.

ఫేక్ యాప్ ఇన్‌స్టాల్ చేసుకుంటే ఏం చేయాలి?

వెంటనే మొబైల్ ఇంటర్నెట్, వై-ఫై ఆఫ్ చేయండి. ఆ యాప్‌ను అన్‌ఇన్‌స్టాల్ చేయండి. బ్యాంక్, UPI యాప్‌లలో అనధికారిక ట్రాన్సాక్షన్లు చెక్ చేయండి. బ్యాంక్ పాస్‌వర్డ్‌లు, UPI పిన్‌లు మార్చండి. బ్యాంకుకు సమాచారం ఇవ్వండి. సైబర్ క్రైమ్ పోర్టల్‌లో ఫిర్యాదు చేయండి. త్వరగా చర్యలు తీసుకుంటే డబ్బు తిరిగి వచ్చే అవకాశం ఉంది.+

Also Read: మనుషుల కోసం షాపింగ్ చేసే ఏఐ.. గూగుల్ కొత్త ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్

పర్మిషన్ ట్రాప్ గురించి తెలుసుకోండి

నకిలీ యాప్‌లు పర్మిషన్లు ఇచ్చినప్పుడే మీరు ప్రమాదంలో పడతారు. డిజిలాకర్ లాంటి డాక్యుమెంట్ యాప్‌కి SMS లేదా కాల్ లాగ్ అవసరం లేదు. ఈ పర్మిషన్లతో OTPలు, క్రెడెన్షియల్స్ దొంగిలిస్తారు. స్క్రీన్ రికార్డింగ్‌తో ఫైనాన్షియల్ ఇన్ఫో క్యాప్చర్ చేస్తారు. ఫేక్ బ్యాంక్ స్క్రీన్‌లు చాలా రియలిస్టిక్‌గా ఉంటాయి. పర్మిషన్లు అడిగినప్పుడు ఎల్లప్పుడూ ఆలోచించండి.

పెరుగుతున్న బ్యాంక్ ఫ్రాడ్, మాల్‌వేర్ ముప్పు

బ్యాంకు అధికారులు, సైబర్ నిపుణులు నిరంతరం అలర్ట్ జారీ చేస్తున్నారు. ఫేక్ APKలు, మాల్‌వేర్ యాప్‌లు పెద్ద ముప్పు. ప్లే స్టోర్‌లో కూడా కొన్ని హానికర యాప్‌లు రావచ్చు. వెరిఫైడ్ డెవలపర్ల నుంచి మాత్రమే యాప్‌లు ఇన్‌స్టాల్ చేయండి. బయటి లింక్‌లు, అన్‌నోన్ APKలతో జాగ్రత్తగా ఉండండి. ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండండి.

Related News

గేమర్స్‌కు పూనకాలు తెప్పిస్తున్న Oppo K15.. నీళ్లలో పడినా, రఫ్ అండ్ టఫ్ వాడినా తగ్గేదే లేదంట!

సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వీడియో రియలా,ఫేకా? తెలుసుకోండిలా!

బడ్జెట్ ధరలో బెస్ట్ 3-డోర్ ఫ్రిజ్.. వర్ల్‌పూల్ ప్రోటాన్ రివ్యూ

రూ.1,599 కే బెస్ట్ ఇయర్‌బడ్స్..హెవీ బేస్‌తో మార్కెట్ షేక్!

మార్కెట్‌ను షేక్ చేస్తున్న 43 ఇంచుల టీవీ.. ఫీచర్స్ నెక్స్ట్ లెవెల్!

కేవలం రూ. 999 కే హెడ్‌ఫోన్స్..సౌండ్ క్వాలిటీ చూస్తే పిచ్చెక్కిపోవాల్సిందే!

రూ.6వేలలోపు టాప్ క్లాస్.. బ్రాండెడ్ వాషర్ ..మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్‌కి పండగే

బిగ్ డిస్‌ప్లే స్మార్ట్‌వాచ్.. బ్లూటూత్ కాలింగ్ ఫీచర్లతో దుమ్మురేపుతోంది!

Big Stories

Advertisement
×