E-Paper
Advertisement

Davos-2026: బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ

Davos-2026: బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ.. మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ
Advertisement

Davos-2026: స్విట్జర్లాండ్‌లోని దావోస్ వేదికగా ప్రపంచ ఆర్థికవేత్తల సదస్సు మంగళవారం నుంచి మొదలుకానుంది. వివిధ దేశాల నుంచి నేతలు, అలాగే కంపెనీల ఛైర్మన్లు,ప్రతినిధులు హాజరయ్యారు. ఈ క్రమంలో పలువురు వ్యాపారవేత్తలతో మంత్రి నారా లోకేష్ భేటీ అవుతున్నారు. తాజాగా బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో ఆయన సమావేశమయ్యారు.

బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్‌తో మంత్రి లోకేష్ భేటీ

Advertisement

దావోస్ వేదికగా సోమవారం సాయంత్రం ప్రపంచ ప్రఖ్యాత బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్ దీపక్ మానేతో మంత్రి నారా లోకేష్ సమావేమయ్యారు. ఫుడ్ ప్రాసెసింగ్ హబ్‌గా ఆంధ్రప్రదేశ్‌పై ఇరువురు చర్చలు జరిపారు. దేశంలో ఏపీని అగ్రగామి అగ్రి-ఫుడ్ హబ్‌గా తీర్చాలనే లక్ష్యంతో మంత్రి లోకేష్.. దీపక్ మానేతో ముందు పలు ప్రతిపాదనలు ఉంచారు.

ఫుడ్స్-గ్రెయిన్ టెక్నాలజీ అప్లికేషన్ సెంటర్‌ని స్థాపించాలన్నారు. దానిద్వారా ప్రొడక్ట్ లోకలైజేషన్ ద్వారా అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లకు అండగా నిలవాలని కోరారు. అంతేకాదు బ్యూలర్ మిల్లెట్ ప్రాసెసింగ్ టెక్నాలజీని ఏపీలో వాణిజ్య స్థాయికి తీసుకెళ్లడం, పోషకాహార ఎగుమతులకు ఊతమివ్వాలని సూచన చేశారు.

Advertisement

మిల్లెట్ ప్రాసెసింగ్, అగ్రి ఎక్స్‌పోర్ట్ క్లస్టర్లపై చర్చ

దీనికితోడు ఆప్టికల్/కలర్ సార్టర్ తయారీ యూనిట్లను ఏపీలో విస్తరించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి కల్పించాలని ఈ సందర్భంగా కోరారు. అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన ఫుడ్ ప్రాసెసింగ్ స్కిల్ డెవలప్‌మెంట్ సెంటర్‌ను ఏర్పాటు చేయాలన్నారు. ఇంజనీర్లకు శిక్షణ ఇచ్చేలా చొరవ తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.

ఆంధ్రప్రదేశ్‌ను అంతర్జాతీయ అగ్రి-ఫుడ్ హబ్‌గా మార్చడమే మా లక్ష్యమని, అంతర్జాతీయ సాంకేతికత తోడైతే మన రైతులు పండించిన పంటకు మార్కెట్‌లో అద్భుతమైన గుర్తింపు వస్తుందన్నారు. మంత్రి లోకేష్ చేసిన ప్రతిపాదనలపై బ్యూలర్ గ్రూప్ ఛైర్మన్ దీపక్ మానే సానుకూలంగా స్పందించారు. బెంగళూరు కేంద్రంగా తమ సంస్థ కార్యకలాపాలు సాగుతున్నాయని వివరించారు.

ALSO READ: తెలుగువారు ప్రపంచ ప్రగతికి వారధులు..  జ్యూరిచ్‌లో సీఎం చంద్రబాబు ప్రసంగం

ఇప్పటికే కాకినాడలో తమ రీజనల్ సేల్స్-సర్వీస్ నోడ్ అందుబాటులో ఉందని ప్రస్తావించారు. ఏపీ ప్రభుత్వ ప్రతిపాదనలు రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధికి ఎంతో దోహదపడతాయని, వీటిని పరిశీలిస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఆ తర్వాత స్పెయిన్‌కి చెందిన EVO SL సంస్థ ఎండీ శ్రీ జోస్ మెల్లాడోతో సమావేశమయ్యారు మంత్రి లోకేష్. ఆంధ్రప్రదేశ్ గ్రీన్ హైడ్రోజన్- జీరో-ఎమిషన్ మొబిలిటీలపై చర్చించారు. వైజాగ్/కాకినాడ పోర్టులలో హైడ్రోజన్ టెర్మినల్ ట్రాక్టర్లను పైలట్ చేయడానికి ఎలక్ట్రిక్ & హైడ్రోజన్ ఆఫ్-రోడ్ వాహనాలను సహ-అభివృద్ధి చేయడానికి మేము EVOని ఆహ్వానించామని వివరించారు. ఏపీ టెస్ట్‌బెడ్‌లు, ఇంజనీరింగ్ శాండ్‌బాక్స్‌లు, రోటోటైప్‌లు, టాలెంట్ శిక్షణకు మద్దతును కోరారు.

ఈ భేటీలో ఎలాంటి రాయితీలు ప్రకటించలేదు సదరు మంత్రి. ఆంధ్రప్రదేశ్‌ని అంతర్జాతీయ టెక్నాలజీ ల్యాబ్‌‌ గా మార్చే సంపూర్ణ ప్రణాళికను వివరించారు. జీరో-ఎమిషన్ పోర్ట్స్ వల్ల వైజాగ్-కాకినాడ పోర్టులలో హైడ్రోజన్ ఆధారిత టెర్మినల్ ట్రాక్టర్లను ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టడం ముఖ్య ఉద్దేశం. దీనివల్ల కాలుష్యం సున్నాకి చేరడమే కాకుండా అంతర్జాతీయంగా గ్రీన్ పోర్ట్స్‌గా గుర్తింపు సాధించనున్నాయి.

స్పెయిన్ సంస్థ వాహనాలను మనం కొనడం కాదు. మన అవసరాలకు తగ్గట్టుగా ఎలక్ట్రిక్-హైడ్రోజన్ ఆఫ్-రోడ్ వాహనాలను ఇక్కడే కలిసి తయారు చేయడం అసలు ఉద్దేశం. ఇంజనీరింగ్ శాండ్‌బాక్స్ అనేది రాష్ట్రంలో ఇంజనీరింగ్ కాలేజీలను ఇండస్ట్రియల్ పార్కులు-రీసెర్చ్ హబ్‌లుగా మార్చడం మరొక అంశం. దీనివల్ల తెలుగు విద్యార్థులు స్పెయిన్ నిపుణులతో కలిసి నూతన వాహనాలను డిజైన్ చేస్తారు.

రెడీమేడ్ టెక్నాలజీ ఎవో సంస్. యూరప్‌లో ఈ టెక్నాలజీని విజయవంతంగా సక్సెస్ అయ్యింది. వారికి కావలసింది భారీ మార్కెట్, ప్రతిభావంతులైన ఇంజనీర్లు మాత్రమే. ఈ రెండు ఏపీలో పుష్కలంగా ఉన్నాయి.రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 పాలసీ ద్వారా రాయితీలు ఈ ప్రాజెక్టుకు రక్షణ కవచంలా మారనున్నాయి.

Related News

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

సరదా కోసం వెళ్లి.. అనంత లోకాలకు.. విశాఖపట్నంలో ఘోర ప్రమాదం

పరారీలో మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం.. కుటుంబ సభ్యులపై భూకబ్జా కేసు, అసలేం జరిగింది?

మరో అల్పపీడన గండం.. రాబోయే వారం రోజులు ఈ జిల్లాల ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే!

కాదంబరి జత్వాని కేసులో ఊహించని మలుపు.. సీఐడీ ఛార్జ్‌షీట్‌లో సంచలన నిజాలు!

చంద్రబాబుతోనే సీమ అభివృద్ధి.. ఎక్కడ అన్యాయం జరిగినా ఊరుకోం- బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి

Kadiri Child Murder: కొడుకును చున్నీతో గొంతు నులిమి.. తల్లి కిరాతకం

Big Stories

Advertisement
×