E-Paper
Advertisement

Podarillu Today Episode : తండ్రి కోసం కన్నీళ్లు పెట్టుకున్న మహా.. నారాయణ, రమణయ్య మధ్య గొడవ.. అసలేం జరుగుతుంది..?

Podarillu Today Episode : తండ్రి కోసం కన్నీళ్లు పెట్టుకున్న మహా.. నారాయణ, రమణయ్య మధ్య గొడవ.. అసలేం జరుగుతుంది..?
Advertisement

Podarillu Today Episode January 24th: నిన్నటి ఎపిసోడ్ లో.. చక్రి తన లవ్ స్టోరీని ఉన్నదానికన్నా ఎక్కువగానే చెప్తాడు. అందరూ కలిసి నీ లవ్ స్టోరీ లో ఇన్ని ట్విస్టు లు ఉన్నాయా అని అనుకుంటారు.. అయితే అందరూ కలిసి పడుకుందామని అనుకుంటారు. మహా మాత్రం ఈ రూమ్ కి గడియ లేదు అని ఏదైనా జరుగుతుందేమో అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే ఈ గదిలో పడుకోవడం ఎలానో అని భయపడిపోతూ ఉంటుంది. చక్రి సడన్గా తలుపు తీసుకుని లోపలికి రావడంతో మహా షాక్ అవుతుంది.. ఇంట్లో నలుగురు మగాళ్లు ఉన్నారు కదా.. నేను ఎలా ఉంటాను అని మీరు భయపడిపోతున్నారు కదూ అని చక్రి అంటాడు. అదేం లేదండి మీరు ఏమి భయపడకండి మేము మీకు సైనికులు లాగా ఉంటాము అని చక్రి మహాకే ధైర్యం చెప్తాడు. పడుకోగానే ప్రతాప్ అరిచినట్లు వినిపిస్తుంది. మహా ఉలిక్కిపడి లేచి తండ్రి కోసం బాధపడిపోతూ ఉంటుంది. కన్నా బాత్రూమ్ అర్జెంట్ అని వెళ్లడానికి ప్రయత్నిస్తాడు. కానీ మాధవ్ మాత్రం కన్నని బాత్రూం లోపలికి రానివ్వడు.. మొత్తానికి మహాలక్ష్మి స్నానం చేసి బయటకు వస్తుంది. మిగిలిన వాళ్ళందరూ కూడా సిగ్గు పడిపోతుంది లోపలికి వెళ్ళిపోతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. మహా స్నానానికి వెళుతుంది. నారాయణ తన ఇంటికి గొప్పింటి కోడలు వచ్చిందంటూ చంకల గుద్దుకుంటూ అందరితో చెబుతూ ఉంటాడు. అది చూసిన రమణయ్య ఓర్వలేక మాటకు మాట సమాధానం చెప్తాడు.. ఇన్ని రోజులు అదేదో చాపలు పెట్టింది మా ఇంటికి తగిలింది అని చెప్పేసి చాలా మాటలు అన్నారు ఇప్పుడు నా ఇంటికి గొప్పింటి కోడలు వచ్చింది అని నారాయణ అంటాడు. కోట్లు కోట్లు ఉన్న ఇంటి నుంచి నా ఇంటికి నా కొడుకే కావాలని వచ్చింది అని నారాయణా అనగానే అంత చదువు చదివి అన్ని కోట్లు ఉన్న అమ్మాయి ఎందుకు మీ ఇంటికి వచ్చింది అని అందరూ అంటారు.

Advertisement

మహాలక్ష్మి మా నాన్నతో మాట్లాడక చాలా రోజులవుతుంది మా ఇంట్లో వాళ్ళు నాకు బాగా గుర్తొస్తున్నారు అని చక్రిని ఫోన్ అడుగుతుంది. మీ దగ్గర ఫోన్ నెంబర్ ఉందా అని అడుగుతుంది. మా వదిన నెంబర్ కూడా గుర్తు లేదు అని మహా ఫీల్ అవుతుంది.. మీ దగ్గర ఉందా అని చక్రిని అడుగుతుంది.. హారిక సిస్టర్ అని చక్రి ఫోన్ లో ఫీడ్ చేసి ఉంటాడు. ఇది చూస్తే అప్పుడే నేను వరుసలు కలిపేసాను ఏమో అనుకొని నన్ను తిట్టేస్తుంది అని చక్రి అనుకుంటాడు. ఆ ఫోన్ నెంబర్ ని మార్చేసి చెక్రి మహా కి ఫోన్ ఇస్తాడు. మహా హారికతో మాట్లాడుతుంది. అమ్మ నాన్న ఎలా ఉన్నారు వదినా అని అడుగుతుంది.

ఇన్ని రోజులు ఎంతో అపురూపంగా పెంచుకున్న నువ్వు ఇలా చేసి వెళ్తావు అని వాళ్ళు అస్సలు ఊహించలేదు. మీ నాన్న సూసైడ్ చేసుకోవాలని అనుకున్నాడు. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గానే ఉంది డాక్టర్లు ఏ పరిస్థితి చెప్పలేమని అంటున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అని కంగారుగా ఉంది భయంగా ఉంది అని హారిక చెప్పగానే మహా కన్నీళ్లు పెట్టుకుంటుంది. మహాను చూడ్డానికి వచ్చిన అక్కడ వాళ్ళందరూ కూడా ఆమె ఎందుకు ఏడుస్తుందో అని కంగారు పడిపోతూ ఉంటారు. నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడుకుంటారు.

Advertisement

మాధవ్ కేశవ కన్నా అందరూ కూడా అక్కడికి వచ్చి ఏంట్రా మహాలక్ష్మిని ఏడిపిస్తున్నావా అని అడుగుతారు. లేదన్నయ్య తని ఏడుస్తుంది అని అంటాడు. ఏమైందండీ ఎందుకు ఏడుస్తున్నారు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నాలుగు రకాలుగా మాట్లాడుకుంటున్నారు చెప్పండి అని చక్రి అడుగుతాడు. నేను ఇంట్లో నుంచి వెళ్లిపోయానని మా నాన్న ఏవో మాత్రలు మింగాడట. అయితే ఆ మాత్రల వల్ల ఆయనకు కోమాలోకి వెళ్లాడట. ప్రస్తుతం ఆయన పరిస్థితి క్రిటికల్ గా ఉంది అని మా వదిన చెప్పింది నేను అర్జెంటుగా మా నాన్నని చూడాలి అని మహా అంటుంది. సరే నువ్వు ఏడవకు అమ్మ వెళ్లి వాళ్ళ నాన్నని చూడడానికి తీసుకెళ్ళు అని మాధవ్ అంటాడు.

Also Read :నిజాన్ని బయటపెట్టిన రోహిణి.. మీనాపై సీరియస్.. రోహిణికి కొత్త టెన్షన్..

ఇదేం బాధపడకమ్మా మీ నాన్నకి ఏమీ కాదు అని మాధవ్ అంటాడు. అయితే చక్రి అందరు కూడా మహని వాళ్ళ నాన్నను చూడడానికి వెళ్ళమని చెప్తారు. కన్నా నువ్వేం బాధపడకు వదిన మీ నాన్నకు ఏమీ కాదు అని ధైర్యం చెప్తాడు. ఇది విన్న వ్యక్తి అక్కడికి వెళ్లి వేరేలా చెప్పాలని రమణయ్య దగ్గరికి వెళ్లి మీ కోడలు వెళ్ళిపోతుంది రమణయ్య చెప్పిందే నిజమైంది అని అనగానే అతను చాలా సంతోషంగా ఉంటాడు. ఏం మాట్లాడుతున్నారా నా కోడలు వెళ్లిపోవడం ఏంటి అని నారాయణ గొడవకు దిగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో మహా తన తండ్రిని చూడడానికి హాస్పిటల్ కి వెళుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుంది అన్నది తెలియాలంటే ఎపిసోడ్న్ని మిస్ అవ్వకుండా చూడాలి..

Related News

‘బైలెల్లి రాయే బతుకమ్మ’ జోరు మామూలుగా లేదుగా.. అప్పుడే మిలియన్ల వ్యూస్

సింగర్ అంతడుపుల రమాదేవి ఒక్క పాటకు ఎంత తీసుకుంటారో తెలుసా?

Telugu Tv Serials : సీరియల్స్ వీక్లీ రౌండప్.. ఆ ఒక్కటే మళ్లీ టాప్..

Gundeninda GudiGantalu Today episode: రోహిణికి కొత్త టెన్షన్.. చింటును బాలు తెస్తాడా..? గుణ ప్లానేంటి..?

Podarillu Today Episode : నారాయణకు అడ్డంగా దొరికిన జమున.. కన్నా సీరియస్.. ఇదేం ట్విస్ట్..

Intinti Ramayanam Today Episode: అక్షయ్ మాటతో మీనాక్షి షాక్.. పల్లవికి మైండ్ బ్లాక్.. అరెస్ట్ చేస్తారా..?

Illu Illalu Pillalu Today Episodes: రెచ్చిపోయిన భాగ్యం.. రామరాజు మాస్ వార్నింగ్.. వల్లికి ఇంకో ఛాన్స్..

Sunday TV Movies : ఆదివారం టీవీల్లోకి బోలెడు సినిమాలు.. మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×