Ananya Nagalla (Image Credit: Instagram)
ప్రముఖ హీరోయిన్ అనన్య నాగళ్ళ గురించి పరిచయాలు ప్రత్యేకంగా అవసరం లేదు. తన అందంతో, నటనతో అందరినీ మెప్పించిన ఈమెకు మాత్రం సరైన అవకాశాలు రావడం లేదు అనేది వాస్తవం.

Ananya Nagalla (Image Credit: Instagram)
2019లో మల్లేశం అనే సినిమాతో సినీ ఇండస్ట్రీలోకి అరంగేట్రం చేసింది. ఆ తర్వాత 2021లో వచ్చిన ప్లే బ్యాక్ సినిమాలో నటించి పర్వాలేదు అనిపించింది.

Ananya Nagalla (Image Credit: Instagram)
ఆ తర్వాత 2021లో పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన వకీల్ సాబ్ అనే సినిమాలో కీలకపాత్ర పోషించి వెలుగులోకి వచ్చింది ఈ ముద్దుగుమ్మ.

Ananya Nagalla (Image Credit: Instagram)
ఇక అంతేకాదు 2024లో పొట్టేలు సినిమాలో అద్భుతమైన నటన కనబరిచి ఏకంగా గద్దర్ తెలంగాణ చలనచిత్ర అవార్డును కూడా అందుకుంది.

Ananya Nagalla (Image Credit: Instagram)
మళ్లీ పెళ్లి సినిమాలో పవిత్ర లోకేష్ చిన్నప్పటి పాత్రలో నటించి ఆకట్టుకుంది. అలాంటి ఈ ముద్దుగుమ్మ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ ప్రేక్షకులను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.

Ananya Nagalla (Image Credit: Instagram)
అందులో భాగంగానే తాజాగా వైట్ టీ షర్టు, డెనిమ్ షాట్ ధరించి తన అందాలతో అభిమానులను ఉక్కిరిబిక్కిరి చేసింది. ప్రస్తుతం అనన్య షేర్ చేసిన ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారుతున్నాయి.