E-Paper
Advertisement

Delhi cafe murder: ఢిల్లీ కేఫ్ మర్డర్.. అందరి ముందు ఆ పని చేశాడు.. అందుకే అలా చేశానన్న నిందితుడు

Delhi cafe murder: ఢిల్లీ కేఫ్ మర్డర్.. అందరి ముందు ఆ పని చేశాడు.. అందుకే అలా చేశానన్న నిందితుడు
Advertisement

Delhi cafe murder: పగ.. కోపం.. ఈ రెండు అంశాలు రోజు రోజుకూ క్రమంగా పెరుగుతున్నాయి. ఫలితంగా హత్య, ఆత్మహత్యలు వంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఢిల్లీలో వెలుగు చూసింది. చెంప దెబ్బ కొట్టినందుకు ఓ వ్యక్తి.. మరొక వ్యక్తిని కాల్చి చంపాడు. అసలు ఘటన ఏంటి? ఇంకాస్త లోతుల్లోకి వెళ్తే..

ఢిల్లీ కేప్ మర్డర్ ఘటనలో కొత్త కోణం

Advertisement

శుక్రవారం రాత్రి నార్త్‌ ఈస్ట్‌ ఢిల్లీలోని మౌజ్‌పూర్‌ ప్రాంతం అది. సాయంత్రం కాగానే అందరూ కేఫ్‌ వద్దకు చాయ్ తాగడానికి వచ్చారు. ప్రశాంతంగా ఉన్న ఆ ప్రాంతంలో ఒక్కసారిగా గన్ పేలడం కలకలం రేపింది. ఇంతకీ దీనివెనుక అసలు ఏమి జరిగింది? వెల్కమ్‌ ప్రాంతానికి చెందిన 24 ఏళ్ల ఫైజాన్‌ యువకుడు కేవ్‌లో ఉండగా అతడి శరీరంలోకి తూటాలు దిగిపోయాయి. ఆ యువకుడు అక్కడికక్కడే కుప్ప కూలిపోయాడు.

ఫైజాన్‌ను ఆసుపత్రికి తరలించేలోపు మృతి చెందినట్టు డాక్టర్లు ప్రకటించారు. ఇంతకీ ఫైజాన్‌ శరీరంలోకి బులెట్లు దించిందెవరు? దీనిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికి నిందితుడు ఇన్‌స్ట్రాలో ప్రత్యక్షమయ్యాడు. జరిగిన ఘటన గురించి పిన్ టు పిన్ క్లియర్‌గా వివరించి వీడియో పోస్టు చేశాడు. ఇంతకీ వీడియోలో ఏముంది?

Advertisement

చెంప దెబ్బ కొట్టి అవమానించాడు.. అందుకే చంపేశాను

వ్యక్తిగత ద్వేషంతో తాను ఫైజాన్‌ను హత్య చేశానని తెలిపాడు. ఈ ఘటన వెనుక నా తండ్రి పాత్ర, ఫ్యామిలీ, తన స్నేహితుల ప్రమేయం ఏ మాత్రం లేదన్నాడు. తాను ఎవరి ఆదేశం మేరకు ఈ విధంగా చేయలేదన్నాడు. నాలుగైదు నెలల కిందట ఫైజాన్.. తనను అందరి ముందు చెంపదెబ్బ కొట్టాడని, ఆ అవమానం తట్టుకోలేకపోయాయని తెలియారు. అందుకే ఇప్పుడు వాడి ప్రాణం తీశానంటూ ఆ వీడియోలో పేర్కొన్నాడు.

మృతుడి ఫ్యామిలీ వెర్షన్ మరోలా ఉంది. ఫైజాన్‌ దగ్గర 40 వేలు అప్పు తీసుకున్నాడని, ఆ డబ్బులు పదే పదే అడిగినందుకు కోపంతో పక్కాగా ప్లాన్ చేసి చంపాడని మృతుని సోదరుడు ఆరోపిస్తున్నాడు. గన్ తో కాల్చడమే కాదు కత్తితో కూడా పొడిచాడని అంటున్నారు. తన తమ్ముడు ప్రాణాల కోసం ఎంతగా పోరాటం చేశాడో పైకి కనిపిస్తున్న గాయాలు చెబుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

ALSO READ: కోరుకున్న ప్రియుడి కోసం.. ఆపై హెచ్ఐవీ ఇంజక్షన్

ఈ ఘటనలో ఢిల్లీ పోలీసులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఘటన తర్వాత ఆ కేఫ్‌ని సీజ్‌ చేశారు. అది అక్రమంగా నడుస్తున్నట్లు తెలుస్తోంది. నిందితుడు పోస్ట్‌ చేసిన వీడియో కేసును డైవర్ట్ చేసేందుకు ఈ స్కెచ్ వేశాడా? ఆ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుని కోసం గాలింపు మొదలుపెట్టారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×