E-Paper
Advertisement

Sunrisers-Bairstow: స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్ ఊచ‌కోత‌, ఒకే ఓవర్‌లో 6, 6, 6, 4, 6, 6..కావ్య పాప న‌వ్విందిరోయ్‌

Sunrisers-Bairstow: స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్ ఊచ‌కోత‌, ఒకే ఓవర్‌లో 6, 6, 6, 4, 6, 6..కావ్య పాప న‌వ్విందిరోయ్‌
Advertisement

Sunrisers-Bairstow: సౌత్ ఆఫ్రికా 20 లీగ్ 2026 టోర్నమెంట్ ( South Africa’s premier T20 cricket league) చాలా రసవత్తరంగా సాగుతోంది. ఈ నేపథ్యంలోనే సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు ( Sunrisers Eastern Cape) గ్రాండ్ విక్టరీ కొట్టింది. ఈ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ ఆటగాడు జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow ) ఊచ కోత కోశాడు. ఒకే ఓవర్ లో 34 పరుగులు సాధించాడు జానీ బెయిర్‌స్టో. ప్రిటోరియా క్యాపిటల్ జట్టుకు ( Pretoria Capitals ) సంబంధించిన కేశ‌వ్ మహారాజ్ ( Keshav Maharaj ) బౌలింగ్ లో 6,6,6,4,6,6 ఇలా వరుసగా సిక్సర్లు కొట్టి 34 పరుగులు సాధించాడు. ఇక ఈ మ్యాచ్ మొత్తంలో 45 బంతులు ఎదుర్కొన్న సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు ఆటగాడు బెయిర్ స్టో ఏకంగా 85 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. జానీ బెయిర్‌స్టోతో పాటు డికాక్ 79 పరుగులు సాధించిన నేపథ్యంలో ప్రిటోరియ క్యాపిటల్స్ పై సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ జట్టు విజయం సాధించింది.

Also Read: Vaibhav Suryavanshi: వైభ‌వ్ ఊచ‌కోత‌..68 పరుగులు, అందులో 10 సిక్సర్లు..టీమిండియా విజ‌యం

స‌న్ రైజ‌ర్స్ బ్యాట‌ర్ ఊచ‌కోత‌, ఒకే ఓవర్‌లో 6, 6, 6, 4, 6, 6

Advertisement

సౌతాఫ్రికా టీ20 లీగ్ 2026 టోర్నమెంట్ ( South Africa’s premier T20 cricket league) నేపథ్యంలో నిన్న ప్రిటోరియా క్యాపిటల్ వర్సెస్ సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ ( Pretoria Capitals vs Sunrisers Eastern Cape ) మధ్య 14వ మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు నష్టపోయి 176 పరుగులు సాధించింది. ప్రిటోరియా క్యాపిటల్స్ జట్టు ఓపెనర్ కొనర్ ఒక్కడే 52 పరుగులు సాధించగా రూథర్ ఫోర్డ్ 47 పరుగులతో దుమ్ము లేపాడు. మిగిలిన బ్యాటర్లందరూ విఫలమయ్యారు. ఇక 176 పరుగుల లక్ష్యాన్ని చేదించే క్రమంలో సన్ రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ ఒక్క వికెట్ నష్టపోకుండా విజయాన్ని సాధించింది. 14.2 ఓవర్లలోనే బెయిర్ స్టో, డికాక్ విధ్వంసానికి సన్రైజర్స్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ లో మహారాజ్ బౌలింగ్ లో 34 పరుగులు సాధించాడు జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow ). అటు డికాక్ 41 బంతుల్లో 79 పరుగులతో రెచ్చిపోయాడు.

కావ్య పాప హ్యాపీ

సన్రైజర్స్ ఈస్టర్న్ కేఫ్ ( Sunrisers Eastern Cape )) ఓనర్ గా కావ్య పాప ( Kavya maran) కొనసాగుతున్న సంగతి తెలిసిందే. అయితే నిన్న జానీ బెయిర్‌స్టో ( Jonny Bairstow ) తో పాటు డికాక్ అదిరిపోయే బ్యాటింగ్ చేయడంతో విజయం సాధించింది సన్రైజర్స్. ఈ విజయం నేపథ్యంలో కావ్య పాప ఫుల్ హ్యాపీగా ఉంది. ఇక ఈ టి20 లీగ్ లో నిన్నటి విజయంతో పాయింట్ల పట్టికలో మొదటి స్థానానికి దూసుకు వెళ్ళింది సన్రైజర్స్. ఇప్పటి వరకు మూడు మ్యాచ్ ల్లో గెలిచిన సన్రైజర్స్ కేవలం ఒక్క మ్యాచ్ లో మాత్రమే ఓడిపోయి ఇప్పుడు మొదటి స్థానంలో నిలిచింది.

Advertisement

 

 

 

Also Read: Bangladesh-IPL 2026: బంగ్లాదేశ్ లో ఐపీఎల్ ప్ర‌సారాలు బంద్‌..బీసీసీఐకి ఎన్ని కోట్ల న‌ష్టం అంటే

 

 

 

 

Related News

సెంచ‌రీ చేసినా రోహిత్ శ‌ర్మ‌పై ఆగ‌ని ట్రోలింగ్…స్లో బ్యాటింగ్ అంటూ వాయించేస్తున్నారుగా

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 విజేతగా స్పెయిన్‌..ఏకంగా 16 ఏళ్ల త‌ర్వాత స‌రికొత్త చ‌రిత్ర‌

రోహిత్ శ‌ర్మ లార్డ్స్ సెంచ‌రీ వెనుక సీక్రెట్ ఇదే, అత‌ని వ‌ల్లే ల‌క్ క‌లిసివ‌చ్చిందా?

గంభీర్ వెనక కోహ్లీ కుప్పిగంతులు..అస‌భ్యక‌రంగా చేతులు చూపిస్తూ డ్యాన్స్

లార్ట్స్ మైదానంలో ఈ గంట కొట్ట‌డానికి కార‌ణం ఏంటి? దీని వెనుక ఉన్న‌ర‌హ‌స్యం

రోహిత్ శ‌ర్మ‌, కోహ్లీ ఇద్ద‌రూ టీమిండియాకు హార్ట్ బీట్ లాంటోళ్లు..వాళ్ల‌ను ట‌చ్ చేయెద్దు

ఫిఫా వ‌ర‌ల్డ్ క‌ప్ 2026 ఫైన‌ల్ మ్యాచ్ టైమింగ్స్ ఇవే..ఇండియాలో లైవ్ ఎప్పుడంటే ?

రెండు మ్యాచ్ ల‌కే గాయ‌ప‌డ్డ బుమ్రాతో వ‌ర‌ల్డ్ క‌ప్ గెలుస్తారా? గ‌వాస్క‌ర్ సీరియ‌స్‌

Big Stories

Advertisement
×