E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా కోసం ఇంట్లో టెన్షన్.. భూషణ్ కు షాకిచ్చిన హారిక.. చక్రి, మహా దొరుకుతారా..?

Podarillu Today Episode : మహా కోసం ఇంట్లో టెన్షన్.. భూషణ్ కు షాకిచ్చిన హారిక.. చక్రి, మహా దొరుకుతారా..?
Advertisement

Podarillu Today Episode January 8th: నిన్నటి ఎపిసోడ్ లో.. అందరూ పడుకున్న తర్వాత చక్రి ఫోన్ చేస్తాడు. అందరూ పడుకుంటారు మీరు వచ్చేసేయండి మెల్లగాని అనగానే మహా తన తండ్రి గదిలోకి వెళ్లి ఎమోషనల్ అవుతుంది.. పుట్టి పెరిగిన ఇంటిని చూసి ఎమోషనల్ అవుతూ బయటికి వెళ్లిపోతుంది.. మహా కారు ఎక్కగానే చెక్రి అక్కడ నుంచి బయలుదేరిపోతాడు. మీ ఫోన్ లోని సిమ్ తీసేసి పక్కన పెట్టేసేయండి అని చక్రి అంటాడు. లేకపోతే మనల్ని సిగ్నల్ ద్వారా ట్రేస్ చేసి పట్టుకుంటారు అని చక్రి అంటాడు.. అయితే సిమ్ తియ్యాలంటే పిన్ కావాలి ఆ పిన్ ఎక్కడుంది అని వెతుకుతూ ఉంటుంది.. చక్రి మీరు అలా చూడండి.. నేను పిన్నిస్ తీసిస్తాను అని అంటాడు. ఇవ్వగానే ఆ పిన్ను తీసేటప్పుడు వీళ్ళిద్దరూ సరదాగా గొడవపడతారు. అప్పుడే భూషణ్ మహా కి ఫోన్ చేస్తాడు. ఆ ఫోన్ లిఫ్ట్ చేసిన మహా చివరిసారి విడత గొడవపడాలి కడిగేయాల్సినవి చాలా ఉన్నాయి అని మాట్లాడుతుంది.

భూషణ్ తో మహా సీరియస్ గా మాట్లాడుతుంది. నీకు నేను కావాలా నీ మొహం ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా అంటూ దారుణంగా మాట్లాడుతుంది. నువ్వు ఎక్కడికైనా వెళ్తున్నావా ఏంటి? కారు హారన్ వినిపిస్తుంది ఏంటి? ఎక్కడున్నావ్ అని భూషణ్ అడుగుతాడు కానీ మహా మాత్రం ఫోన్ పెట్టేస్తుంది. మహా వెళ్ళిపోయిన విషయాన్ని భూషణ్ ఆదితో చెప్తాడు.. మహా లేదని కన్ఫామ్ చేసుకొని ఇంట్లోని వాళ్ళందరూ టెన్షన్ పడిపోతుంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది..

Advertisement

ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. ఇంట్లోని వాళ్ళందరూ కంగారు పడిపోతూ ఉంటారు.. ఆది మహా ఎలా వెళ్ళిందో తెలుసుకోవాలని ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. బయటికి వెళ్లి అది ఏం జరిగిందని చూస్తూ ఉంటాడు.. ఇక లలిత హారిక ఏమైనా తెలిసేమో అని అడుగుతుంది. కానీ హారిక మాత్రం అతనంటే ఇష్టం లేదని మాత్రమే చెప్పింది కానీ ఇలా వెళ్ళిపోతుందని నేను అసలు ఊహించలేదు అత్తయ్య అని అంటుంది. చక్రి డ్రైవర్ కూడా లేడు అని ఆది చెప్పడంతో వాళ్లందరూ డ్రైవర్ని వెతకాలని అనుకుంటారు.. మహా అతని హెల్ప్ తీసుకుని వెళ్ళిపోయి ఉంటుందని హారిక అంటుంది. అయితే ఇప్పుడు మనం వాళ్ళని ఎక్కడున్నారో పట్టుకోవాలి అని ఆది అనుకుంటాడు..

ఈ మహా ఖచ్చితంగా ఇంట్లో ఉండి ఉండదు. అందుకే మీరు ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కచ్చితంగా నేను వెళ్లి వెతకాలి.. అసలు ఉందో లేదో కనుక్కోవాలి అని భూషణ్ అక్కడికి వెళ్తారు.. ఏది ఎక్కడ చెప్పినట్టు వెళ్లిపోయిందా ఏంటి అని అడుగుతుంది. ఎక్కడికి వెళ్ళింది ఏంటి అని ఆరా తీస్తాడు. ఆ తర్వాత భూషణ్ లలిత చేతిలో ఉన్న లెటర్ని చూసి అదేంటి ఇలా ఇవ్వండి వెళ్ళిపోయింది కదా.. నాకు అర్థం అయిపోయింది అని అడుగుతాడు. ఆ లెటర్ ని చూసిన భూషణ్ షాక్ అవుతాడు.. ఇకపోతే డ్రైవర్ తో లేచిపోయిందా అని అనగానే హారిక రెచ్చిపోతుంది..

Advertisement

భూషణ్ మైండ్ యువర్ టంగ్.. మహా వెళ్లిపోవడానికి కారణం నువ్వే.. ఆడపిల్లకి అర్ధరాత్రి పూట 200 సార్లు ఫోన్లు చేసి విసిగిస్తే ఏ అమ్మాయి అయినా నీలాంటి వారిని పెళ్లి చేసుకోవాలని అనుకుంటుందా..? అయితే నువ్వు చేసిన టార్చర్ అంతా ఇంత కాదు అందుకే నీ నుంచి పెళ్లంటే పారిపోయింది అని హారిక అంటుంది.. అయితే హారిక ఏం మాట్లాడుతున్నా కూడా నాది తప్పు అంటావా అని భూషణ్ అంటాడు. ఇదంతా కాదు ఇంతకీ అమ్మాయి వస్తుందా లేదా చెప్పండి అని భూషణ్ అంటాడు. వెళ్లి ఎక్కడుందో వెతుకుదాం పదా అనేసి అంటాడు. .

భూషణ్ తీసుకొని వెళ్ళిన వాళ్లకు భూషణ్ మాటలతో చిరాకు తెప్పిస్తాడు.. మీ అమ్మాయి వెళ్ళిపోయిందా డ్రైవర్తో లేచిపోయిందా అని అనగానే ప్రతాప్ సీరియస్ అవుతాడు. అమ్మాయి అలాంటిది కాదు నువ్వు ఎక్కువ మాట్లాడద్దు అని ఎంతగా చెప్తున్నా సరే భూషణ్ మాత్రం వినకుండా ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతాడు.. ఆది అన్ని ఏరియాలోని సీసీటీవీ లను పరిశీలించి డ్రైవర్ తో వెళ్లిపోయిందని తెలుసుకుంటారు. ఆ వీడియోలను చూసిన భూషణ్ చీప్ గా డ్రైవర్ తో లేచిపోయిందా అని అడుగుతాడు. మొదటినుంచి మీ అమ్మాయికి వాడికి పరిచయం ఉన్నట్టుంది. అందుకే వాడు చెప్పగానే అక్కడి నుంచి వెళ్ళిపోయింది..

Also Read : ప్రేమ పెళ్లి చూపులు సీన్ హైలెట్.. నర్మద సెటైర్లు.. కామాక్షిని రెచ్చగొట్టిన భాగ్యం..

ఇవన్నీ చూస్తుంటే మీ అమ్మాయి వాడు లేచిపోయారు అని భూషణ్ అంటాడు. ప్రతాప్ మాత్రం తన కోపాన్ని కంట్రోల్ చేసుకుంటూ అందరికీ వెతకమని చెప్తాడు.. అయితే ఒకచోట తన మనుషులకు చక్రీ మహా దొరుకుతారు. కానీ వాళ్ళిద్దరూ ఎంతో చాకచక్యంగా తప్పించుకుంటారు. ఆ తర్వాత రౌడీలు వాళ్ళ వెనకాల వెళ్లిపోతారు. అందరూ కలిసి మహాచక్రియల కోసం వెతుకుతూ ఉంటారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×