Podarillu Today Episode July 19th: ఉదయం లేవగానే తనకి కారేశ్వర్ మళ్ళీ ఉద్యోగం ఇచ్చినట్లు చాలా సంతోషంగా ఇంట్లో అందరికీ చక్రి చెప్తాడు.. నాకు మళ్ళీ కారేశ్వర్ ఉద్యోగం ఇవ్వడం చాలా సంతోషంగా ఉంది అని అందరితో పంచుకుంటాడు.. గుడికి వెళ్లి పూజ చేయించి మహాలక్ష్మి కోసం పాయసం చేస్తాడు.. ఇక అందరిని రండిరాని పాయసం ఇస్తాడు.. మహాలక్ష్మి కూడా రావడంతో గుడికి వెళ్లి నీ పేరు మీద అర్చన చేయించానమ్మ ఇదిగో బొట్టు పెట్టుకో అని మాధవ అనగానే చాలా సంతోషపడుతుంది. ఇదంతా అయిన తర్వాత కేశవ మీరు బర్త్డే అని మాకు తెలియదండి లేకపోతే గిఫ్ట్ తెచ్చేవాళ్ళమే అని అనగానే.. చక్రి నేను గిఫ్ట్ తెచ్చాను అని అంటాడు. ఆ గిఫ్టు మీకు నచ్చుతుందో లేదో అని ఆగాను అని చక్రి అంటాడు . కానీ మహాలక్ష్మి మాత్రం ఏమాత్రం మాట మాట్లాడుకుండా గిఫ్ట్ ఎక్కడ అని అడుగుతుంది.. చక్రి ఇచ్చిన చీరను చూసి మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది.. చీరలో మహాలక్ష్మిని చూసి చక్రీతో పాటు గా మిగిలిన వాళ్ళందరూ కూడా షాక్ అవుతారు..
మహాలక్ష్మి చక్రిని గిఫ్ట్ అడిగిమరీ ఆ చీర కట్టుకొని వస్తాను అని లోపలికి తీసుకుని వెళుతుంది. అయితే చక్రి మహాలక్ష్మిని చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు.. ఎంత బాగుందో దేవతలాగా ఉంది అంటూ తనలో తానే మాట్లాడుకుంటూ ఉంటాడు.. మహాలక్ష్మి ఎలా ఉంది అని అడగ్గానే చాలా అందంగా ఉన్నారండి అని చక్రి చెప్తాడు.. నాకు ఒక డౌటు సినిమాలలో చూపించినట్లుగా చీర ఇవ్వగానే లోపలికి వెళ్లి బ్లౌజ్ తో సహా కట్టుకుని వస్తారు అది ఎలా సాధ్యమని అడుగుతాడు. నాకు ఇష్టమైన కలర్ గ్రీన్ కలర్ వేరే శారీ మీదకి సెట్ అయ్యే జాకెట్ దొరకడంతో నేను దీనికి వేసుకున్నాను అని మహాలక్ష్మి అంటుంది.
మీరు ఇవాళ శారీ కట్టుకున్నారు కదా బస్సులైతే చీర నలిగిపోతుంది.. నేను డ్రాప్ చేస్తాను పదండి అని చెక్రి ఎంతగా చెప్తున్నా సరే మహాలక్ష్మి మాత్రం అస్సలు వినదు. నాకేమీ ప్రాబ్లం లేదు నేను వెళ్తాను అని ఎంత చెప్తున్నా సరే.. చెక్రి నేను వస్తానన్నా కూడా మహాలక్ష్మి అసలు వినకుండా కన్నాని తోడుగా తీసుకొని వెళ్తుంది. కన్నా మహాలక్ష్మి ఇద్దరూ వెళ్లిపోగానే చక్రి చాలా ఫీల్ అవుతారు. అసలు ఎవరన్నా కూడా ఆమెకు చాలా ఇష్టం కానీ నేనంటేనే ఆమెకు పడదు అని చెక్రి చాలా ఫీల్ అయిపోతూ ఉంటాడు. మహాలక్ష్మి సాయంత్రం తిరిగి వచ్చేలోగా తనకి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చి తనని మళ్లీ నన్ను ప్రేమించేలా చేసుకుంటాను అని చక్రి శబదం చేస్తాడు.
కానిస్టేబుల్ దామోదర్ భార్య మహాలక్ష్మి ఫోన్ చేయడంతో వాళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అని అనుమాన పడుతుంది. ఇక దాంతో ఆమె అనుమానం మరింత పెరగడంతో ఎలాగైనా సరే ఫోన్ చేసి దానికి వాయించి పడేయాలి అని అనుకుంటుంది. తను అనుకున్నట్లుగానే మహాలక్ష్మి ఆఫీస్ లో ఉండగా ఫోన్ చేసి ఎవరితో నువ్వు అని పిచ్చిపిచ్చిగా మాట్లాడుతుంది. మా ఆయనకు నీకు ఎప్పటినుంచి సాగుతుంది అది ఇది అని పొంతన లేకుండా మాట్లాడటంతో మహాలక్ష్మికి కోపం ఇంకాస్త పెరుగుతుంది. నువ్వు అసలు ఎవరు వే నాకు ఫోన్ చేయడానికి నీకు ఎంత ధైర్యం ఉంది అని విగ్నేశ్వరి కావాలనే మహాను రెచ్చగొడుతూ గొడవకు దిగుతుంది. కానీ మహాలక్ష్మి మాత్రం ఏమీ మాట్లాడకుండా ఫోన్ పెట్టేయడంతో విగ్నేశ్వరి తన భర్త ఇంటికి రాగానే చుక్కలు చూపిస్తుంది..
మహాలక్ష్మి సాయంత్రం రాగానే ఎలాగైనా సరే సర్ప్రైజ్ ఇవ్వాలని చక్రి అనుకుంటాడు. ఇక అనుకున్నట్లుగానే కన్నా రాగానే ఇద్దరు కలిసి బెలూన్స్ ని ఊరి ఇండ్లంతా మార్చేసి సరికొత్తగా చూపించాలి అని అనుకుంటారు. చక్రి తనకోసం ప్లాన్లు చేస్తూ ఉంటే మహాలక్ష్మికి మాత్రం తన పెళ్లి గురించి కాస్త అనుమానాలు ఉన్నాయని కానిస్టేబుల్ దగ్గరికి వెళ్లి ఎంక్వయిరీ చేయాలని అనుకుంటుంది. మహాలక్ష్మి అనుకున్నట్లుగానే పోలీస్ స్టేషన్కు వెళ్లి మేము విడాకులు తీసుకుంటున్నాము అని కానిస్టేబుల్ సార్ కి తెలియడంతో అయినా నాకు వార్నింగ్ ఇచ్చారు అని మహాలక్ష్మి నిజం చెప్తుంది. అలాగే చక్రిని ఇదంతా చేశాడు అని తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇదంతా చేసింది చక్రినా ఎందుకు చేసాడు అని అనుమాన పడుతుంది. మరి మహాలక్ష్మి ఇంటికి వెళ్లి చెక్రితో ఈ విషయాన్ని అడుగుతుంద లేదా అన్నది ప్రస్తుతం సస్టెన్స్ గా మారింది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…
Also Read :Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..