Bhogapuram Airport: ఎట్టకేలకు ఏపీలోని భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవానికి ముహూర్తం ఖరారైంది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్ర మోదీ ఎయిర్‌పోర్టును ప్రారంభించనున్నారు. ఈ విషయాన్ని సీఎం చంద్రబాబు వెల్లడించారు. ఆషాడ మాసంలో ప్రారంభోత్సవంపై మంచిది కాదని కొందరు చెబుతున్నారు.
ఎట్టకేలకు ముహూర్తం ఖరారు-ఏపీలో ఎకానమీ జోరందుకోనుంది. ఉత్తరాంధ్రకు మణిహారంగా భావించే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు ప్రారంభానికి రెడీ అయ్యింది. ఆగస్టు ఒకటిన ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు స్వయంగా వెల్లడించారు. చరిత్రలో నిలిచేలా ప్రారంభోత్సవం జరగాలన్నది ప్రభుత్వ ఆలోచన.
ఆగష్టు 1న భోగాపురం ఎయిర్ పోర్ట్ ఓపెన్- ఎయిర్‌పోర్టు ప్రారంభమైతే కొత్త అవకాశాలు తెస్తుందన్నది ఓ అంచనా. ముఖ్యంగా పోర్టులు, హైవేలు, పరిశ్రమలు, టూరిజం ప్రాజెక్టులతో ఉత్తరాంధ్ర కళకళలాడనుంది. శనివారం భోగాపురం ఎయిర్ పోర్టుపై నిర్వహించిన సమీక్ష నిర్వహించారు సీఎం చంద్రబాబు. దీనికి పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్‌నాయుడు, బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి నాదెండ్ల మనోహర్, అధికారులు హాజరయ్యారు.
ప్రధాని మోదీ చేతుల మీదుగా-ఏపీ సంస్కృతి, వారసత్వం చాటేలా అత్యంత కళాత్మకంగా ప్రతి విభాగం ఉండాలన్నారు. పౌర విమానయాన శాఖ-జీఎంఆర్ అధికారులు విమానాశ్రయం మౌలిక సదుపాయాలు, ప్రయాణీకుల సౌకర్యాలు-కార్యాచరణ గురించి సీఎం చంద్రబాబుకు వివరించారు. వాణిజ్య కార్యకలాపాలు ప్రారంభించడానికి అవసరమైన 8 రకాల అనుమతులు ఇప్పటికే వచ్చాయని వివరించారు.
ఆషాడంలో ప్రారంభోత్సవంపై పలు ప్రశ్నలు-ఉత్తరాంధ్రకు విమానాశ్రయం ఒక గేమ్ ఛేంజర్ మారుతుందని వర్ణించారు ముఖ్యమంత్రి. ఆర్థికాభివృద్ధిలో విశాఖ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. శంషాబాద్ విమానాశ్రయంతో పోల్చుతూ పెట్టుబడులను ఆకర్షించడం, ఉపాధిని కల్పించడం, ఆర్థిక కార్యకలాపాలను వేగవంతం చేయడం ద్వారా భోగపురం ఎయిర్‌పోర్టు ఉత్తరాంధ్రను రూపు మార్చుతుందని అభిప్రాయపడ్డారు.
ALSO READ: ఏపీలో కరోనా కేసుల కలకలం.. కొత్త రకం వేరియంట్ గుర్తింపు, ఆగ్నేయాసియాలో ఎక్కువగా..
ప్రారంభోత్సవ కార్యక్రమంలో గిరిజన సంప్రదాయాలు, హస్తకళలను ప్రదర్శించాలన్నారు. తద్వారా ఈ చారిత్రాత్మక ప్రాజెక్ట్ పట్ల ఉత్తరాంధ్రలోని ప్రతి నివాసి గర్వపడేలా చేయాలన్నారు. మొదటి దశలో రూ. 4,750 కోట్ల పెట్టుబడితో, 2,203 ఎకరాల్లో జీఎంఆర్ గ్రూప్ గ్రీన్‌ఫీల్డ్ విమానాశ్రయా న్ని అభివృద్ది చేసింది.
ఇంతవరకు బాగానే ఉంది. ఉన్నట్లుండి భోగాపురం ఎయిర్‌పోర్టు ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆషాడ మాసంలో నిర్వహించడాన్ని కొందరు తప్పుబడుతున్నారు. జూలై 15న మొదలైన ఆషాడం మాసం ఆగష్టు 12 వరకు ఉంటుంది. కేవలం 12 రోజులకు అంత తొందర ఎందుకని అంటున్నవాళ్లూ లేకపోలేదు.