Podarillu Today Episode May 11th : రోజు ఉదయం అందరూ రెడీ అయ్యి టిఫిన్ చేయడానికి రెస్టారెంట్ కి వస్తారు. అక్కడ మహాలక్ష్మి వాళ్ళ కుటుంబాన్ని చూసి మౌనంగా ఉంటారు.. వాళ్ల గురించి ఆలోచించాల్సిన పనిలేదు మీరు తినండి ముందు అని చక్రి కూడా అంటాడు.. ఆ తర్వాత అందరూ భోజనం చేసిన తర్వాత గేమ్స్ ఉన్నాయని చెప్పగానే అక్కడికి వెళ్తారు. ప్రతాప్ వాళ్ళ ఫ్యామిలీ కూడా అక్కడికి వస్తారు. ఈ గేమ్ లో ఎవరైతే ఓడిపోతారో పల్లకి పనిష్మెంట్ ఉంటుందని అక్కడ చెప్తూ ఉండగా ఆది వీళ్ళని ఎలాగైనా పంపించాలి అని ప్లాన్ చేస్తాడు.. వాళ్ల సంతోషంను దూరం చెయ్యాలని ఆది అనుకుంటాడు.
వాళ్ళెంత సంతోషంగా ఉన్నారో సరే నాన్న.. వాళ్లను ఎలాగైనా సరే.. ఈ రిసార్ట్ నుంచి పంపించేయాలి అని ఆది అనుకుంటాడు. తాడుని లాగి మనం కూడా వాళ్ళని ఓడించాలి అప్పుడు వారి రిసార్ట్ ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలని కండిషన్ పెట్టాలని అనుకుంటాడు. థగ్ ఆఫ్ వార్ జరుగుతున్నప్పుడు ఆది అక్కడికి వెళ్తాడు. ఏం కూడా ఈ గేమ్ ని ఆడాలి అనుకుంటున్నాము. ఈ గేమ్ లో ఓడిపోతే రిసార్ట్ నుంచి వెళ్ళిపోవాలి అని అది కండిషన్ పెడతాడు. చక్రి ఆది ఇద్దరు కూడా నువ్వా నేనా అని గట్టిగా పోటీ పడతారు.. ఇక చక్రికి తోడుగా కేశవ వస్తే ఆదికి తోడుగా వాళ్ళ నాన్న ప్రతాప్ వస్తాడు.. తనకి ఈ సీన్ చూడడానికి కన్నుల పండుగగా ఉంటుంది.
అందరూ ఒక్కొక్కరుగా ఎవరి కుటుంబానికి ఇవాళ సపోర్ట్ చేసుకుంటూ తాడుని లాగడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.. ఇక మహాలక్ష్మి చక్రి వాళ్ళకి సపోర్ట్ చేస్తూ తాడుని గుంజుతూ ఉంటుంది.. అటు సైడు హారిక అలాగే లలిత కూడా తోడవడంతో అందరూ గట్టిగా లాగడం మొదలు పెడతారు. అయితే నారాయణ అక్కడికి వచ్చి తన కుటుంబాన్ని ఎంకరేజ్ చేసే విధంగా పాట పాడుతూ ఇంకాస్త ఉత్సాహాన్ని పెంచుతూ ఉంటాడు. మొత్తానికి అందరూ అనుకున్న విధంగానే ఆ తాడుని గట్టిగ లాగి మహా చక్రి ఫ్యామిలీ విన్నర్గా నిలుస్తారు. ఇక అనుకున్న విధంగా ఈ రిసార్ట్ నుంచి వాళ్ళు వెళ్లిపోవాలి అని అంటారు.
ఆది ఫోన్ మాట్లాడుతూ ఉండగా సిరి అక్కడ ఆడుకుంటూ ఉంటుంది అటుగా వచ్చిన మహా కన్నా ఇద్దరు కూడా తనతో మాట్లాడే ప్రయత్నం చేస్తారు ఆది ఎక్కడ చూస్తాడో అని ప్రాబ్లం అవుతుందని మహాలక్ష్మి అక్కడి నుంచి వచ్చేస్తుంది. కానీ కన్నా మాత్రం ఆదికి తెలియకుండా సిరిని ఎత్తుకొని వెళ్లి మహాలక్ష్మి దగ్గరికి తీసుకొని వెళ్తాడు. మహాలక్ష్మి సర్ప్రైజ్ చేసేలా కన్నా ప్లాన్ చేస్తాడు. ఫోన్ మాట్లాడటం అయిపోయిన ఆది సిరి కోసం వెతుకుతాడు. కానీ అక్కడ కనిపించకపోవడంతో హారికాకు వచ్చి ఎక్కడ పాపా అని అడుగుతుంది. ఇక హారికతో పాటుగా మిగిలిన వాళ్ళందరూ కూడా సిరి ఎక్కడుందో అని వెతుకుతూ ఉంటారు. ఆదికి మాత్రం చెక్రి వల్ల పై అనుమానం వస్తుంది.. మళ్ళీ గొడవకు దిగుతారు.
సిరి ఎక్కడికి వెళ్ళింది అని అందరూ వెతుకుతూ కంగారు పడిపోతూ ఉంటారు.. సీసీటీవీ ఫుటేజ్ లో చూడడానికి వెళ్ళిన ఆది ప్రతాప్ వాళ్లకి అక్కడ కన్న ఎత్తుకుపోయినట్టు కనిపించడంతో ఒక్కసారిగా షాక్ అవుతారు.. వాడే మన పాపని కిడ్నాప్ చేసి ఉంటాడు అని వాళ్ళతో గొడవకి దిగుతారు. అది చూసినా మహా కన్నా మీద కొట్టడానికి వచ్చిన ఆదిని కొడతాను అని అంటుంది. వీడు నా కూతురుని ఎత్తుకొని వెళ్ళాడు అని చెప్పగానే మహాలక్ష్మి ఒక్కసారిగా సీరియస్ అవుతుంది..సీసీటీవీ ఫుటేజ్ లో కూడా ఇదే కనిపిస్తుంది అని ఆది అంటాడు..
సిరి ఎనీ ఎక్కడికి ఎత్తుకొని వెళ్లలేదు నా దగ్గరే ఉంది. ఇప్పటివరకు సిరి నా దగ్గరే ఉంది అని మహా చెప్పడంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. సంస్కారం మీకు లేదు కాబట్టే మీరు ఇలా మారారు. వీళ్ళ ఇంట్లో నేను ఎలా ఉన్నాను తెలుసా కనీసం ఆలోచించరా అని మహాలక్ష్మి ప్రతాప్ వాళ్ళ కుటుంబానికి దిమ్మ తిరిగిపోయేలా క్లాస్ పీకుతుంది. కన్నాని క్షమించమని అడుగుతుంది. నీకు మంచి మర్యాదలు తెలియాలంటే నా కుటుంబంలో వచ్చి ఒక నాలుగు రోజులు ఉండండి అని వాళ్ళ అమ్మతో చెప్తుంది. నువ్వు ఇంకెప్పుడూ మాకు ఎదురుపడాలని చూడొద్దు అని లలిత వార్నింగ్ ఇస్తుంది.
మహా ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. అయితే ప్రతాప్ లలిత వల్ల రిసార్ట్ ని కాళీ చేసి వెళ్లిపోతూ ఉండగా మహాలక్ష్మి ఎదురుగా కనిపించడంతో ఎక్కడికి వెళ్లినా ఎదురుగానే కనిపిస్తుంది. వెళ్లేటప్పుడు అయినా కనీసం ప్రశాంతంగా వెళ్లాలని అనుకున్నాను అని ప్రతాప్ అంటాడు. ఆ మాట వినగానే మహా ఫీల్ అవుతుంది. హారిక ఆదివాలు వస్తున్నదా హారికతో మాట్లాడడానికి మహా ప్రయత్నిస్తుంది కానీ ఆది వల్ల ఆగిపోతుంది. కనీసం సిరి తో కూడా మాట్లాడిన ఇవ్వకపోవడంతో మహాలక్ష్మి ఫీల్ అవుతుంది. ఇక మనమందరం ఇంటికి వెళ్ళాలి పదండి అని చక్రి వచ్చి మహాలక్ష్మి దగ్గర చెప్తాడు. ఎంతో సంతోషంగా గడపాలని అనుకున్న ఆ కుటుంబానికి విషాదం మిగలడంతో అందరూ బాధ పడతారు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లు ఏం జరుగుతుందో చూడాలి..