E-Paper
Advertisement

Podarillu Today Episode : చక్రీని గిల్లిన మహా.. శైలును కాపాడిన కేశవ.. మహాకు షాకిచ్చిన భూషణ్..

Podarillu Today Episode : చక్రీని గిల్లిన మహా.. శైలును కాపాడిన కేశవ.. మహాకు షాకిచ్చిన భూషణ్..
Advertisement

Podarillu Today Episode May 18th :అందరూ పడుకుని ఉండగా చక్రీ దగ్గరికి వచ్చిన మహాలక్ష్మి చక్రిని లేపుతుంది. అందరూ పడుకున్న తర్వాత నన్ను ఇలా ఒంటరిగా లేపుతుంది అంటే నా మీద ప్రేమ పుట్టిందో ఏంటో అని చక్రి చాలా సంతోష పడిపోతూ ఉంటాడు. అయినా మహాలక్ష్మి ఈ టైంలో నన్నెందుకు పిలిచింది అని ఆలోచిస్తూ ఉంటాడు. అయితే మా వదిన నీతో ఏం మాట్లాడింది చెప్పు నాకు టెన్షన్ గా ఉంది అని మహాలక్ష్మి కంగారు పడిపోతూ ఉంటుంది. మీ వదిన గారు నాకు ఏమీ చెప్పలేదండి మహాలక్ష్మి ఇక్కడ ఇబ్బందులు పడుతుంది కదా తన ఫ్రెండ్ ఇంటికి పంపించు అని చెప్పింది.. మా వదిన ఇక్కడికి రాకుండా ఉంటే బాగుండేది పెద్ది వల్ల కూడా చాలా ఫీల్ అయ్యారు అని మహాలక్ష్మి అంటుంది.. మహాలక్ష్మి గిల్లి లేపినందుకు చక్రి బాధపడతాడు కానీ ఏం జరగలేదని తెలుసుకున్న మహా కాస్త ఫ్రీ అవుతుంది.

శైలు కోసం కేశవ ఫైట్..

శైలు అక్కడున్న వ్యక్తుల మధ్యలో చిక్కుకొని పోతుంది. తనతో ఎలాగైనా సరే బోల్డ్ వీడియో చేయాలి అని వాళ్ళు చాలా ప్రయత్నాలు చేస్తుంటారు. శైలు కాపాడడానికి వచ్చిన కేశవ అక్కడ తనని ఆ పరిస్థితిలో చూసి ఒక్కసారిగా షాక్ అవుతాడు.. శైలు వాళ్ల మధ్యలో ఉండటం చూసినా కేశవ ఏం చేస్తున్నారు రా ఒక ఆడపిల్లని అని అందరినీ చితకబాధతాడు. ఏంటి బుషు ఇప్పటికైనా నీకు అర్థమైందా? వాళ్ళు ఎలాంటి వాళ్ళు చూసావా ఏం చేస్తున్నారో అని శైలుని తిడతాడు కేశవ. ఇక అందర్నీ కొట్టి కేశవ శైలుని కాపాడతాడు.

కేశవను పొగిడిన పోలీసులు..

Advertisement

పోలీసులు ఆ రౌడీ వెధవల్ని పట్టుకొని ఏంట్రా అమ్మాయిని ఏడిపిస్తున్నారా..? అసలు కొంచమైన బుద్ధుందా రా అమ్మాయిలతో ఎలా ప్రవర్తించాలో తెలీదా? ఏం చేస్తున్నారు మీరు? నీకు నేను షూటింగ్ చేస్తాను పదండి అని అతను అంటాడు. శైలు అంటే నువ్వేనా అమ్మ.. నీకు రీల్స్ అంటే పిచ్చి ఉండొచ్చు కానీ ఏది నమ్మాలో ఏది నమ్మ కూడదో తెలుసుకోవాలి.. ఇలాంటి వాళ్ల గురించి నువ్వు తెలుసుకొని వెళ్లాలి అయిన ఒంటరిగా ఒక్కదానివే ఎలా వచ్చావో ఇలాంటి వాళ్ళ దగ్గరికి అని పోలీసులు శైలుకి గడ్డి పెడతారు.. సారీ సార్ అని శైలు అంటే సారీ నాకు కాదమ్మా అబ్బాయి నేను కాపాడాడు ఈరోజు నీ జీవితాన్ని నిలబెట్టాడు నువ్వు తనకి థాంక్స్ చెప్పు అని అంటారు.

రచ్చ చేసిన శైలు..

శైలు బయట బండి ఎక్కి వెళ్దామని కేశవ ఎంత చెప్తున్నా సరే వినకుండా విన్యాసాలు చేస్తుంది. నేనెక్కడికి వెళ్తే అక్కడికి నువ్వు వస్తావ్ ఏంట్రా అని తిరిగి కేశవ్ అని అనడంతో కేశవ వాటర్ బాటిల్ తెచ్చి తన మీద నీళ్లు కొడతాడు. అయితే శైలు చేసిన రచ్చతో కేశవ కి కోపం పెరిగిపోతుంది. బలవంతంగా బండిమీద ఎక్కించుకొని తనని చున్నితో కట్టుకొని కీర్తి దగ్గరికి తీసుకొని వస్తాడు. అక్కడికి వచ్చిన తర్వాత కూడా శైలు చేసిన రచ్చతో కేశవ కోపం ఇంకాస్త పెరుగుతుంది. నేను బండి దిగాను అనే కూర్చున్నా శైలుని బలవంతంగా దింపి చంప పగలగొడతాడు. దాంతో శైలుకి జరిగిందంతా గుర్తుకు వచ్చి స్పృహ వస్తుంది. కీర్తి నిజం చెప్పడంతో కేశవ ఫై ప్రేమ మొదలయితున్నట్లు కనిపిస్తుంది.

మహా కోసం కొత్త బాత్రూం..

Advertisement

మహాలక్ష్మి వాళ్ళ వదిన వచ్చి బాత్రూం గురించి చాలా చండాలంగా ఫీలయ్యింది. మనం ఏదో ఒకటి చేసి కొత్త బాత్రూం కట్టించాలి అని అందరూ అనుకుంటారు.. అయితే బాత్రూమ్ ఎక్కడ చేస్తే బాగుంటుంది అని ఆలోచించి చివరికి బాత్రూం కట్టడానికి ఒక ప్లేస్ ని వెతుకుతారు. అన్ని సదుపాయాలు ఉండేలా బాత్రూం కావాలంటే దగ్గర దగ్గర రెండు లక్షల అవుతుంది అని అనగానే చక్రి షాక్ అవుతాడు. చిన్నది కట్టాలన్న సరే దగ్గర లక్ష రూపాయలు అవుతుంది అని అనగానే సరే అన్నయ్య మన ముగ్గురం వాటాలు వేసుకొని బాత్రూం కడదామని కేశవ్ అంటాడు. ఆ మాట వినగానే కన్నా లోపలికి వెళ్ళిపోతాడు. కేశవ మాటతో బాధపడ్డాడు అని కన్నాని ఓదార్చడానికి లోపలికి వెళ్లాలనుకుంటారు కానీ కన్నా మాత్రం నా దగ్గర డబ్బులు ఉన్నాయి మీరిచ్చినవే దాచి పెట్టుకున్నాను ఇవి తీసుకొని బాత్రూం కట్టడానికి ఆ వాటా కూడా వేసుకోండి అని అంటాడు..

మహాను చూసిన భూషణ్..

అక్కడ బాత్రూం కట్టాలని అనుకుంటే మహాలక్ష్మి ఎందుకు నా కోసం మీరంతా ఖర్చు చేస్తున్నారు అని అంటుంది. కానీ ఆడపిల్ల అందరిలాగా ఉండకూడదు కదా మా అని మాధవ్ చెప్పగానే ఇక మౌనంగా ఉండిపోతుంది మహా. ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అని అనగానే అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇక కేశవ దగ్గరుండి మహాలక్ష్మి తీసుకొని వెళ్తాడు.. లోపలికి వెళ్ళగానే మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. భూషణ్ తన ఫ్రెండ్ అయినా మహాలక్ష్మి ఇంటర్వ్యూ చేసే బాస్ దగ్గరికి వస్తాడు అక్కడ మహాలక్ష్మి చూస్తాడు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి.

ఇంటర్వ్యూ కోసం మహా రెడీ..

ఇంటర్వ్యూ కోసమని మహాలక్ష్మి బాగా రెండు రోజుల నుంచి ప్రిపేర్ అవుతుంది. చక్రి తనని తీసుకుని ఇంటర్వ్యూ లోకేషన్ కి వెళ్ళాలని రెడీ అవుతుంటాడు. ఇక మహాలక్ష్మి ఇంటర్వ్యూ దగ్గరికి తీసుకుని వెళ్ళగానే తను టెన్షన్ పడిపోతూ కనిపిస్తుంది. మీరేం టెన్షన్ పడకండి ఈ ఉద్యోగం కచ్చితంగా మీకు వస్తుంది అని చక్రి ధైర్యం చెప్తాడు. ఎలాగైనా సరే ఈ జాబ్ తను కొట్టేయాలి అని ధీమాగా ఉంటుంది మహాలక్ష్మి. కానీ లోపల భూషణ్ ఉండడమే అసలు గమనించదు.

మహా పై భూషణ్ రివేంజ్..

బయట ఇంటర్వ్యూ జరుగుతుందని తెలుసుకున్న భూషణ్ అక్కడున్న క్యాండిడేట్స్ ని చూస్తాడు. ఇంటర్వ్యూ గురించి మాట్లాడుకోవడం విని ఒక్కసారిగా వెనక్కి తిరిగి చూస్తాడు. అక్కడ మహాలక్ష్మి కనిపించడంతో తనపై ఎలాగైనా సరే రివెంజ్ తీసుకోవాలి అని అనుకుంటాడు.. తన ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళినా భూషణ్ నన్ను పెళ్లి దగ్గరికి తీసుకుని వెళ్లి చివరికి హ్యాండ్ ఇచ్చి వెళ్లిన అమ్మాయి ఇక్కడే ఉంది. ఎలాగైనా సరే ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకుండా నేను చూస్తాను అని భూషణ్ అనుకుంటాడు.. ఇంతకీ ఆ అమ్మాయి ఎవరు అని అతని ఫ్రెండ్ అడగని బయటికి వెళ్లి మహాలక్ష్మిని చూపిస్తాడు. మరి ఇవాళ ఇంటర్వ్యూ నేను చేస్తాను నువ్వు వెళ్లి ఇంట్లో పడుకొని నిద్రపో అనేసి భూషణ్ తన ఫ్రెండ్ ని ఇంటికి పంపిస్తాడు. మహాలక్ష్మి ఈ జాబ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది. మరి మహాలక్ష్మి జాబ్ కు భూషణ్ అడ్డుపడతాడా? లేదా అన్నది సోమవారం ఎపిసోడ్ లో చూడాలి..

Also Read :Gundeninda GudiGantalu Today episode: అయ్యో.. అడ్డంగా ఇరుక్కున్న రోహిణి.. ఓనర్ గా సత్యం.. ముకేష్ ఎంట్రీ..

Related News

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Ye Devi Varamo Neevu Hero : సీరియల్ హీరోకు ఎంతకష్టం వచ్చింది.. అసలేం జరిగింది..?

Friday Movies in Tv : శుక్రవారం టీవీల్లోకి సూపర్ హిట్ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్..

Big Stories

Advertisement
×