E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా పై భూషణ్ రివేంజ్.. మనసు మార్చుకున్న శైలు.. దిమ్మతిరిగే కౌంటర్..

Podarillu Today Episode : మహా పై భూషణ్ రివేంజ్.. మనసు మార్చుకున్న శైలు.. దిమ్మతిరిగే కౌంటర్..
Advertisement

Podarillu Today Episode May 19th : బాత్రూం కట్టాలని అనుకుంటే మహాలక్ష్మి ఎందుకు నా కోసం మీరంతా ఖర్చు చేస్తున్నారు అని అంటుంది. కానీ ఆడపిల్ల అందరిలాగా ఉండకూడదు కదా మా అని మాధవ్ చెప్పగానే ఇక మౌనంగా ఉండిపోతుంది మహా. ఇంటర్వ్యూ కి వెళ్ళాలి అని అనగానే అందరూ ఆల్ ది బెస్ట్ చెప్తారు ఇక కేశవ దగ్గరుండి మహాలక్ష్మి తీసుకొని వెళ్తాడు.. లోపలికి వెళ్ళగానే మహాలక్ష్మి చాలా టెన్షన్ పడుతూ కనిపిస్తుంది. భూషణ్ తన ఫ్రెండ్ అయినా మహాలక్ష్మి ఇంటర్వ్యూ చేసే బాస్ దగ్గరికి వస్తాడు అక్కడ మహాలక్ష్మి చూస్తాడు.. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వకుండా నేను చూస్తాను అని భూషణ్ అనుకుంటాడు.. బయటికి వెళ్లి మహాలక్ష్మిని చూపిస్తాడు. మరి ఇవాళ ఇంటర్వ్యూ నేను చేస్తాను నువ్వు వెళ్లి ఇంట్లో పడుకొని నిద్రపో అనేసి భూషణ్ తన ఫ్రెండ్ ని ఇంటికి పంపిస్తాడు. మహాలక్ష్మి ఈ జాబ్ పై ఎన్నో ఆశలు పెట్టుకుంటుంది.

మహా పై రివేంజ్ తీర్చుకున్న భూషణ్..

తన ఫ్రెండ్ ఆఫీస్ కి వెళ్ళిన భూషణ్ అక్కడ మహాలక్ష్మి ఇంటర్వ్యూ కి వచ్చిందని తెలుసుకొని ఎలాగైనా సరే తనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు. తన ఫ్రెండ్ ఆఫీస్ కి వెళ్ళిన భూషణ్ కి అక్కడ మహాలక్ష్మి ఇంటర్వ్యూ కి వచ్చిందని తెలుసుకొని ఎలాగైనా సరే తనని ఇబ్బంది పెట్టాలని అనుకుంటాడు.. ఈ విషయాన్ని తన ఫ్రెండ్ తో కూడా చెప్తాడు.. మహాలక్ష్మి నీ తప్ప మిగిలిన వాళ్ళందరినీ ఇంటర్వ్యూకి పిలుస్తాడు.. అయితే మహాలక్ష్మి నేను ముందు వచ్చాను అని ఎంతగా అడుగుతున్న సరే తనని లోపలికి పంపించకుండా చేస్తారు.. చివరికి మహాలక్ష్మిని పిలిపించి తనకి సంబంధం లేని ప్రశ్నలతో తనని ఇబ్బంది పెడతారు.. మొత్తానికి భూషణ్ మహాలక్ష్మిని రివెంజ్ తీసుకోవాలని ఫిక్స్ అవుతాడు.

ముంగిస పై బస్సు ప్రేమ..

Advertisement

శైలు నిద్రపోతూ ఒక్కసారిగా తనకు జరిగిన సంఘటనను గుర్తు చేసుకుంటుంది. తనని ఎలా ఇబ్బంది పెట్టారో అది గుర్తుచేసుకొని ఒక్కసారిగా ఉలిక్కిపడి లేస్తుంది.. ఒక్కసారిగా నా ప్రాణం పోయినంత పని అయింది. కానీ చివరి నిమిషంలో ఆ ముంగిస వచ్చి నన్ను కాపాడాడు అని తనపై మనసు పడేసుకుంటుంది. ఇన్ని రోజులు మొండివాడని అనుకున్నాను. కానీ తన మనసులో కూడా ఒక మంచితనం ఉంది. వీడు పైకి కనిపించే అంత చెడ్డవాడు మాత్రం కాదు అని తన మనసులో ఒక అభిప్రాయాన్ని నింపుకుంటుంది. దానికి చూస్తుంటే శైలజ కేశవ నీ ప్రేమించబోతుంది..

చక్రీ పై మహా సీరియస్..

ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవలేదని మహాలక్ష్మి కాల ఫీలవుతూ ఉంటుంది. బయటికి రాగానే చక్రి అక్కడ సడన్గా రావడంతో ఒక్కసారిగా షాక్ అవుతుంది మహా.. కానీ ఏంటి మీరు ఇక్కడే ఉన్నారు ట్రిప్ కు వెళ్లకుండా ఇక్కడ తిరుగుతున్నారా టైం వేస్ట్ చేస్తున్నారా అని చక్రిన్ చూసి గరం గరం అవుతుంది మహాలక్ష్మి.. నేను ఎందుకు వెళ్ళలేదు తర్వాత చెప్తాను ఎండలు మండిపోతున్నాయి ముందు మీరు లోపలికి ఎక్కండి అని చక్రి బ్రతిమలాడుతాడు.. ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదా అని మహాలక్ష్మిని అడగ్గానే చండాలంగా జరిగింది అని అంటారు. ఇంటికి వెళ్లిన తర్వాత కూడా మహాలక్ష్మి తనకి ఇంటర్వ్యూ లో సెలెక్ట్ అవ్వలేదని చాలా కంగారు పడిపోతూ ఉంటుంది..

చక్రీ పై మాధవ్ సీరియస్..

Advertisement

రాత్రి ఒంటరిగా కూర్చుని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది.. అయితే సడన్గా ఇంట్లోకి వచ్చిన మాధవ్ సారీ అమ్మ ఈరోజు లేట్ అయింది ఆకలేస్తుంది అనుకుంటాను అందుకే ఇంత డల్ గా ఉన్నావు అని మాధవ్ అంటాడు. బయటినుంచి అందరూ పానీపూరి తిని ఇంట్లోకి వస్తారు. ఏంట్రా మీరందరూ మహాలక్ష్మిని వదిలేసి ఇక్కడికి వెళ్లారు. అందరూ చక్రీ ని తిట్టడంతో మహాలక్ష్మి నాకు ఉద్యోగం రాదని అనిపిస్తుంది అందుకే బాధగా ఉంది అంతే ఆకలేమీ లేదు అని మహా అంటుంది. కన్ఫ్యూజన్ గా ఉంది జాబ్ లో సెలెక్ట్ అవుతానో లేదో అని కంగారుగా ఉంది అని చెప్పగానే మాధవ్ బాధపడకు అని చెప్తాడు.. ఇది కాకపోతే ఇంకొకటి వస్తుంది నువ్వు అలా బాధపడితే ఏం బాగోలేదు అమ్మ అని మహాలక్ష్మికి ధైర్యం చెప్తాడు మాధవ్.

అడ్డంగా ఇరుక్కున్న కేశవ..

కేశవ వాళ్ళందరూ మాట్లాడుతూ ఉండగా శైలు అప్పుడే కేశవ కి ఫోన్ చేస్తుంది. ఏంటి ఎవరో ఫోన్ చేసినట్లున్నారు అని కన్నా కావాలనే కేశవ కి కోపం వచ్చేలా చేస్తాడు.. ఆ ఫోన్ చేసింది ఎవరో అని తెలుసుకొని అన్నయ్యకి బస్సు ఫోన్ చేసింది అని అందరితో అంటాడు.. మళ్లీ మళ్లీ శైలు ఫోన్ చేయడంతో బుస్సు మళ్ళీ ఫోన్ చేసింది అని కేశవ్ అని తిడతాడు.. నువ్వు బాధపడుతున్నావని అన్నయ్య అలా ఏడిపించాను అని కన్నా అంటాడు. బయటికి వెళ్లిన కేశవకు మళ్ళీ శైలజ ఫోన్ చేయడంతో అసలు నీకు బుద్ధుందా నీతో మాట్లాడడమే నాకు ఇష్టం లేదు అని సీరియస్ అవుతాడు. ఏంటి వీడు నా మీద ఇంతగా అరుస్తున్నాడు అని శైలు అనుకుంటుంది..

భూషణ్ కు మహా స్ట్రాంగ్ కౌంటర్..

తర్వాత రోజు మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది.. ఏంటమ్మా నువ్వు ఇంకా టిఫిన్ చేయకుండా ఎలా కూర్చున్నావు అని అడుగుతాడు. అయితే నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నావు అది మర్చిపోతే బాగుంటుంది అని మాధవ్ అంటాడు. అప్పుడే మహాలక్ష్మికి ఫోన్ వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పగానే చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా సరే ఈ జాబును కొట్టేయాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది అందరూ మహాలక్ష్మికి కంగ్రాట్స్ చెప్తారు. టెన్షన్ గా ఉందని మాధవ్ ని రమ్మని చెప్తుంది. పని చక్రి మాత్రం వద్దన్నయ్య నాకు వచ్చిన ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని అంటాడు.. అక్కడికి వెళ్లిన తర్వాత భూషణ్ తనకి ఎటువంటి టైం లేకుండా డిజైన్ చేయమని చెప్పగానే నావల్ల కాదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పల్లవి నిజస్వరూపం తెలుస్తుందా..?

Related News

అవినాష్, అరియానా మధ్య గొడవలు నిజమేనా? బయటపెట్టిన శ్రీముఖి!

Nindu Noorella Saavasam Serial Today Episode September 4th  ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ఆత్మ కోసం ప్రచండ ప్రత్యేక పూజ  

Gundeninda GudiGantalu Today episode: మీనాను దెబ్బ అదుర్స్.. సంజుకు దిమ్మతిరిగే షాక్.. బాలుకు రాఖీ కట్టిన మౌనిక..

Ninnu kori Serial Today Episode September 4th ‘నిన్ను కోరి’ సీరియల్‌: చంద్రకు నిజం తెలిసిందన్న మందర – షాక్‌ అయిన మాయ      

Podarillu Today Episode : చక్రితో అంట్లు కడిగించిన మహా.. నారాయణ హర్ట్.. జయంతి మాటతో షాక్..

Karthika Deepam 2 Serial Today Episode September 4th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఇంట్లో పని మనుషుల్లాగా ఉంటామన్న దీప, కార్తీక్         

Illu Illalu Pillalu Today Episodes: శ్రీవల్లి మాటతో నర్మద షాక్.. విశ్వంకు భద్ర వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న వేదవతి..

Intinti Ramayanam Today Episode: పల్లవికి టెన్షన్.. ప్రణతి ఎంట్రీతో ఆల్ హ్యాపీ.. ఫైనల్ ట్విస్ట్ అదిరింది..

Big Stories

Advertisement
×