E-Paper
Advertisement

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పల్లవి నిజస్వరూపం తెలుస్తుందా..?

Intinti Ramayanam Today Episode: పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. పల్లవి నిజస్వరూపం తెలుస్తుందా..?
Advertisement

Intinti Ramayanam Today Episode May 19th : అవని వాళ్ళు గుడికి వెళ్లి తిరిగి వచ్చేలోగా బయట పోలీసులు కారు ఉండడంతో ఏమైంది అని అనుకుంటారు. లోపలికి వెళ్లి చూడగానే పోలీసులు దొంగను పట్టుకొని ఉంటారు. మీ ఇంట్లో డబ్బులు కొట్టేసిన దొంగ ఇతనే చెప్పగానే కమల్ అక్ష ఇద్దరు కూడా సీరియస్ అవుతారు. మీరు దొంగని కొడితే మేము మిమ్మల్ని అరెస్ట్ చేయాల్సి వస్తుంది అని చెప్పగానే వాళ్ళ ఆగుతారు. ఆ తర్వాత ఆ డబ్బులు నీ కమల్ చేతికి ఇస్తారు. డబ్బులు దొరికాయి ఆ ఫైనాన్షియర్ కు ఇవ్వాలి అని అవని చెప్పగానే అక్షయ్ అలానే అని అంటాడు. మొత్తానికి డబ్బులు దొరికేసాయి. ఇకపోతే పల్లవికి తన ప్లాన్ గురించి చెప్పి అవని దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది.

పల్లవికి అవని స్ట్రాంగ్ వార్నింగ్…

అవని పల్లవి గురించి తెలుసుకోవడంతో పల్లవి దగ్గరికి వెళ్లి దొంగ ఎలా దొరికాడు అని ఆలోచిస్తున్నావా అని అడుగుతుంది. అదేం లేదు అక్క దొంగ దొరికాడని నేను కూడా సంతోషంగా ఉన్నాను అని పల్లవి చెప్తుంది. కానీ పల్లవి కే దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇస్తుంది అవని. డబ్బులు కొట్టమని దొంగను అరేంజ్ చేసింది నువ్వు ఆ విషయం నాకు బాగా తెలుసు అని మొత్తం జరిగిన విషయాన్ని పల్లవికి పూసకొచ్చినట్లు చెబుతుంది అవని. నువ్వు ఇంకా మారవా అందుకే నీచేతే ఇంకో 50 లక్షలు నష్టపరిహారం కట్టించేలా చేశాను అని అవని చెప్పగానే పల్లవి మొహంలో ఫ్యుజులు ఎగిరిపోతాయి. అవనికి తెలిసే ఇదంతా చేసిందని అనుకుంటుంది.. ఇంకొకసారి ఇలాంటివి వెనక చేస్తే నీ బండారు మొత్తం ఇంట్లో వాళ్లకు చెప్తాను అని వార్నింగ్ ఇస్తుంది..

అడ్డంగా ఇరుక్కున్న పల్లవి..

Advertisement

ఫైనాన్షియర్ ను రమ్మని ఫోన్ చేసి పిలుస్తారు అక్షయ్. అతను ఇంట్లోకి రాగానే డబ్బుల కోసం మర్యాద లేకుండా మాట్లాడారు ఇప్పుడు ఇలా మాట్లాడుతున్నారు ఏంటి అని అందరూ తలా ఒక మాట అంటారు. ముఖ్యంగా చక్రధర్ కూడా డబ్బుల కోసం నానా మాటలు ఇప్పుడు డబ్బుల కోసమే వచ్చావు కదా అని అంటాడు. ఉదయం దొంగలు పడి దోచుకెళ్ళారన్నారు ఇప్పుడు ఎలా వచ్చాయా డబ్బులు అని అడుగుతాడు ఫైనాన్స్యర్.. పోలీస్ కంప్లైంట్ ఇవ్వడంతో పోలీసులు ఆ డబ్బులు తీసుకొని వచ్చి ఇచ్చారు. అని చెప్పగానే అతను మౌనంగా ఉండిపోతాడు. మీ డబ్బులు మీరు తీసుకొని డాక్యుమెంట్ మాకు ఇవ్వండి అని అవని అడుగుతుంది. ఆ డాక్యుమెంట్స్ ని తీసుకుని పల్లవి నీ పిలిచి చించేయమని అడుగుతుంది. ఇక పల్లవి కూడా అవన్నీ ఏం చెప్తే అది చేయాలి అన్నట్లుగా చేసింది.

అక్షయ్ ఫుల్ హ్యాపీ..

ఈ డబ్బు సమస్య తీరిపోవడంతో అక్షయ్ చాలా సంతోషంగా ఉంటాడు. రాత్రి అవ్వగానే ఒక అదిరిపోయే సాంగ్కు స్టెప్పులు వేస్తాడు. గదిలోకి రాగానే ఏంటి మీరు ఇంత సంతోషంగా ఉన్నారు అని అడుగుతుంది. ఏమీ లేదు డబ్బు సమస్య తీరిపోయింది కదా ఇవాళ మనకు ఫస్ట్ నైట్ అని చెప్పగానే అవని సిగ్గుపడుతుంది. మనకి ఇప్పుడు ఫస్ట్ నైట్ ఏంటండీ అని అవని అనగానే అన్ని తీరిపోయిన తర్వాత ఇవాళ మనం చాలా సంతోషంగా ఉన్నాం కదా ఈ రాత్రినే మనం ఎంజాయ్ చేయాలి అని అక్షయ్ అంటాడు. కానీ ఆరాధ్య వచ్చి మధ్యలో పడుకోవడంతో తన ఆశ ఆవిరి అయిపోతుంది..

కన్నీళ్లు పెట్టుకున్న కమల్..

Advertisement

ఉదయం లేవగానే వంటగదిలోకి దూరిన కమల్ నేను ఉల్లిగడ్డలను కోసి ఇస్తాను అని అవనితో అంటాడు. కానీ తన వల్ల కాకపోయినా సరే కన్నీళ్లు పెట్టుకుంటూ మరీ ఉల్లిగడ్డలను కట్ చేసి ఇస్తాడు. అవని ఎంతగా వద్దని చెప్పిన సరే కమల్ మాత్రం వాటిని కట్ చేయడానికి తెగ ప్రయత్నాలు చేస్తాడు. ఒక్కరోజు కట్ చేయడానికి నేను ఇంత బాధ పడిపోతున్నాను మరి రోజు కట్ చేయడానికి మీరంతా బాధ పడిపోతున్నారో నేను అర్థం చేసుకోగలను అని కమల్ అంటాడు. కమల్ ఏడుస్తూ ఉండడం చూసిన ఆరాధ్య అందరికీ చెప్తుంది. ఉల్లిగడ్డలు నన్ను ఏడిపించేసాయని కమల్ అక్కడి నుంచి బయటికి వెళ్లిపోతాడు..

అడ్డంగా బుక్కయిన పల్లవి..

బయటికి వెళ్లిన కమల్ పల్లవి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతుంది అని దగ్గరగా వెళ్తాడు. అవనిని ఎంతగా మోసం చేయాలని చూసిన సరే తెలివిగా ప్లాన్ చేసి దాని నుంచి బయట పడిపోతుంది అని అవని గురించి పల్లవి తన తల్లితో మాట్లాడుతుండగా కమల్ ఇదంతా పల్లవి పైన అని వీడియో తీస్తాడు. మీ ఫ్యాన్లు ఇక వర్కౌట్ అవ్వవు అని కమల్ పల్లవి నీ లోపలికి తీసుకుని వెళ్లి అందరు ముందర ఈ విషయాన్ని బయట పెడతాడు. మన ఇంటి నాశనం కోరుకుంటుంది ఇది దీని తల్లితో కలిసి ఏదేదో చేస్తుంది అని అనగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read : ప్రేమ లవ్ స్టోరీలో ట్విస్ట్.. ఫ్యాన్స్ ఫీల్ అవుతారు..!

Related News

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Big Stories

Advertisement
×