Podarillu Today Episode May 20th : ఆ తర్వాత రోజు మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటుంది.. ఏంటమ్మా నువ్వు ఇంకా టిఫిన్ చేయకుండా ఎలా కూర్చున్నావు అని అడుగుతాడు. అయితే నువ్వు ఇంటర్వ్యూలో సెలెక్ట్ అవ్వలేదని బాధపడుతున్నావు అది మర్చిపోతే బాగుంటుంది అని మాధవ్ అంటాడు. అప్పుడే మహాలక్ష్మికి ఫోన్ వచ్చి నువ్వు సెలెక్ట్ అయ్యావు అని చెప్పగానే.. చాలా సంతోషంగా ఉంటుంది. ఎలాగైనా సరే ఈ జాబును కొట్టేయాలి అని మహాలక్ష్మి అనుకుంటుంది. అందరూ మహాలక్ష్మికి కంగ్రాట్స్ చెప్తారు. టెన్షన్ గా ఉందని మాధవ్ ని రమ్మని చెప్తుంది. పని చక్రి మాత్రం వద్దన్నయ్య నాకు వచ్చిన ఒక అవకాశాన్ని ఉపయోగించుకోవాలి అని అంటాడు.. అక్కడికి వెళ్లిన తర్వాత భూషణ్ తనకి ఎటువంటి టైం లేకుండా డిజైన్ చేయమని చెప్పగానే నావల్ల కాదు అని అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది..
మహాలక్ష్మి వెళ్లిన వెంటనే బయటికి రావడంతో చక్రి ఏమైంది అని అడుగుతాడు.. బాలు ఇచ్చిన టాస్క్ అరగంటలో డ్రా చేసి చూపించమన్నారు అది మూడు గంటలు పడుతుంది.. అలాంటిది ఇప్పుడు నేను వెంటనే వెయ్యమంటే ఎలా వేస్తానో నా వల్ల కాదు అని వదిలేసి వచ్చాను అని మహా అంటుంది.. మీరు ఏదైనా సాధించాలి అనుకోవాలి కానీ ఇలా నావల్ల కాదు అని బయటకు వచ్చేస్తే ఏంటని అర్థం మహాలక్ష్మి ఇలా ఉండదు. ఏదైనా అనుకుంటే అది సాధిస్తుంది అని చక్రి తనని మోటివేట్ చేసి మళ్లీ లోపలికి పంపిస్తాడు.. అయితే మహాలక్ష్మి లోపలికి వచ్చింది అని చెప్పగానే భూషణ్ ఏంటి మళ్లీ వచ్చిందా అని షాక్ అవుతాడు.. కేవలం చక్రి మాటతో లోపలికి వెళ్ళిన మహా ఎలాగైనా సాధించాలి అని అనుకుంటుంది.
లోపలికి మహాలక్ష్మి వచ్చిందని చెప్పగానే తన ఫ్రెండ్ తో పాటుగా భూషణ్ కూడా చాలా ఆశ్చర్యపోతాడు.. ఏంటి మహాలక్ష్మి మళ్ళీ వచ్చిందా ఎందుకు వచ్చింది అని అనుకుంటూనే అక్కడికి వెళ్తాడు.. అయితే అక్కడికి వెళ్ళగానే మహాలక్ష్మి టైం సెట్ చేసుకోండి అరగంటలో నేను ఈ డిజైన్ పూర్తి చేసి ఇస్తాను అని చెప్పగానే వెళ్ళిపోయావు మళ్లీ ఎందుకు వచ్చావు అని భూషణ్ అడుగుతాడు.. నేను పిరికి దాన్ని అని అనిపించుకోవడానికి కాదు మీరు గొప్ప అని అనుకుంటున్నారు కదా దాన్నుంచి బయటికి తీసుకురావడానికి నేను వచ్చాను అని అరగంట లోపల అనుకుని డిజైన్ ని వేసి ఇస్తుంది.. మీరు నాకు జాబ్ ఇవ్వకపోయినా పర్వాలేదు అని వెళ్ళిపోతూ ఉండగా ఏంటి సెలెక్ట్ అయిన తర్వాత కూడా వెళ్ళిపోతావా అని భూషణ్ అంటాడు. ఆ మాట వినగానే మహాలక్ష్మి చాలా సంతోషంగా ఉంటుంది. రేపు మీ ఒరిజినల్ సర్టిఫికెట్స్ తీసుకురండి అని చెప్పగానే మహాలక్ష్మి అలాగే అని అక్కడి నుంచి బయటికి వస్తుంది.
బయట ఉన్న చక్రి దగ్గరికి మహాలక్ష్మి పరిగెత్తుకుంటూ వస్తుంది.. మీ వల్లే నాకు జాబ్ వచ్చింది. మీరు చెప్పడం వల్లే నేను సాధించాను అని చాలా సంతోషంగా ఉంటుంది.. మీరు ఈరోజు నా దగ్గర లేకుండా ఉంటే కచ్చితంగా నేను ఏమైపోయానో అని మహాలక్ష్మి చక్రిని హగ్ చేసుకుంటుంది. మీరు నిజంగా గ్రేట్ అండి అని మహాలక్ష్మి చెప్పి చక్రితో మాట్లాడుతుండగా చక్రి గాల్లో తేలిపోతూ ఉంటాడు.. అది చూసినా భూషణ్ వాడితో రొమాన్స్ చేస్తున్నావా రేపు రా నీకు చుక్కలు చూపిస్తాను అని అనుకుంటాడు.. వాడిని వదిలేసి నా దగ్గరకు వచ్చేలా చేసుకుంటాను అని భూషణ్ అనుకుంటాడు.
చోటు పని చేసుకోకుండా అటు ఇటు తిరుగుతూ కనిపిస్తాడు.. కేశవ ఏంటా పని మానేసి అటు ఇటు తిరుగుతున్నావు ఎక్కువైందని అడుగుతాడు.. కాదన్నా నిన్న మీరు వెళ్లి వదినని కాపాడారు కదా. తను మీకు థాంక్స్ చెప్తుందా? మిమ్మల్ని కౌగిలించుకొని థాంక్స్ చెప్తుందా? లేదంటే ఇప్పుడు హీరోయిన్ లాగా ముద్దు పెట్టి మీకు థాంక్స్ చెప్తుందా అన్నది నాకు అర్థం కావట్లేదు అని అనగానే నోరు మూసుకొని వచ్చే పని చేస్తావా లేదా అని కేశవ అంటాడు. అయితే శైలు అప్పుడే అక్కడికి వచ్చి కేశవతో మాట్లాడడానికి ప్రయత్నిస్తుంది. కానీ కేశవ మాత్రం తనని చూసి చూడనట్లుగానే ఉంటాడు.. దాంతో శైలు అక్కడున్న వస్తువుల్ని విసిరేయడంతో కేశవ ఏంటే నా షాప్ లో పడి అన్ని ధ్వంశం చేస్తున్నావా అని అడుగుతాడు.. శైలు సారీ థాంక్స్ చెప్పిన సరే కేశవ్ మాత్రం అస్సలు తగ్గకుండా తిడతాడు ఆ మాటలకి శైలు అక్కడి నుంచి పారిపోతుంది..
ఇంట్లోని వాళ్లందరికీ మహాలక్ష్మి జాబ్ వచ్చిందని చాలా సంతోషంగా చెబుతుంది. అందరికీ స్వీట్లు పట్టి చెప్పడంతో అందరూ కూడా కంగ్రాట్స్ చెప్తారు.. కాని చక్రికి మాత్రం స్వీట్ ఇవ్వకపోవడంతో ఏంటండీ నాకు స్వీట్ ఇవ్వడం లేదు అని అనగానే ఈ స్వీట్లన్నీ మీకే అని చక్రి ఆ బాక్స్ మొత్తాన్ని ఇస్తుంది. నేను ఒకటి అడిగానండి మీరు అన్ని నాకేస్తున్నారంటే మీరు చేసిన మంచి పనికి అన్నీ మీకే ఇస్తున్నాను అని చెప్పగానే చక్రి చాలా సంతోషంగా ఉంటారు.. కేశవ మాత్రం ఏం చేసావ్ రా మళ్లీ ఏదైనా అబద్ధాలు చెప్పావంటే లేదు ఆయన చాలా మంచి పని చేశాడు. నన్ను మోటివేట్ చేసి లోపలికి పంపించి ఈ జాబ్ వచ్చేలాగా చేశాడు అని మహాలక్ష్మి అనగానే అందరూ సంతోషంగా ఉంటారు.. జాబ్లో కేషన్ మారొచ్చు అని మహాలక్ష్మి చెప్పగానే చక్రి బాధపడతాడు..
సర్టిఫికెట్లు తీసుకొని మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళగానే… అక్కడ భూషణ్ సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత తన మాస్కుని తీసేస్తాడు.. అది చూసిన మహాలక్ష్మి నువ్వా ఇక్కడిక్కడ తిరుగుతున్నావా కెనడాకు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతుంది. ఇప్పటికైనా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఇకనుంచి వెళ్ళిపోవచ్చు నీకు ఎక్కడ జాబ్ లేకుండా చేస్తాను అని భూషణ్ అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది.. సర్టిఫికెట్లు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పినా కూడా అతని ఇవ్వకపోవడంతో నువ్వు ఇక్కడే ఉండు అని చక్రికి నిజం చెప్పి లోపలికి తీసుకుని వెళుతుంది.. చక్రి భూషణ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చి ఆ సర్టిఫికెట్లను మళ్ళీ తీసుకుంటారు.. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..