E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా నాది.. భూషణ్ కు చక్రీ వార్నింగ్..చక్రీకి ప్రతాప్ ఛాలెంజ్.. ఇదే ట్విస్ట్..

Podarillu Today Episode : మహా నాది.. భూషణ్ కు చక్రీ వార్నింగ్..చక్రీకి ప్రతాప్ ఛాలెంజ్.. ఇదే ట్విస్ట్..
Advertisement

Podarillu Today Episode May 21st : సర్టిఫికెట్లు తీసుకొని మహాలక్ష్మి ఆఫీస్ కి వెళ్ళగానే… అక్కడ భూషణ్ సర్టిఫికెట్లు తీసుకున్న తర్వాత తన మాస్కుని తీసేస్తాడు.. అది చూసిన మహాలక్ష్మి నువ్వా ఇక్కడిక్కడ తిరుగుతున్నావా కెనడాకు ఎందుకు వెళ్లలేదు అని అడుగుతుంది. ఇప్పటికైనా నీకు ఒక ఛాన్స్ ఇస్తున్నాను. నువ్వు ఇకనుంచి వెళ్ళిపోవచ్చు నీకు ఎక్కడ జాబ్ లేకుండా చేస్తాను అని భూషణ్ అనగానే మహాలక్ష్మి షాక్ అవుతుంది.. సర్టిఫికెట్లు ఇస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పినా కూడా అతని ఇవ్వకపోవడంతో నువ్వు ఇక్కడే ఉండు అని చక్రికి నిజం చెప్పి లోపలికి తీసుకుని వెళుతుంది.. చక్రి భూషణ్ కి దిమ్మ తిరిగిపోయేలా షాక్ ఇచ్చి ఆ సర్టిఫికెట్లను మళ్ళీ తీసుకుంటారు..

మహా నాది.. ఊరుకోను..

భూషణ్ సర్టిఫికెట్లు ఇవ్వను అని అంటాడు. అయితే భూషణ్ ని కొట్టి మరి ఆ సర్టిఫికెట్లు తీసుకోవాలి అని చక్రీ అనుకుంటాడు. మొత్తానికి భూషణ్ ని కొట్టి మరి సర్టిఫికెట్లను తీసుకుంటాడు చక్రి.. నీకు చీకొట్టి వెళ్లిపోయిన అమ్మాయిని మళ్లీమళ్లీ కావాలని అనుకుంటావా కొంచమైనా బుద్ధి ఉందా నీకు అని చక్రి భూషణ్ ని అడుగుతాడు.. మహాలక్ష్మి నాది. తన జోలికి వస్తే అస్సలు ఊరుకోను అని రైమింగ్ బాగుంది అని చక్రి భూషణ్ కి దిమ్మ తిరిగిపోయేలా కౌంటర్లు ఇస్తాడు.. మీరు ఆ సర్టిఫికెట్లను తీసుకోండి మన వెళ్ళిపోదామని మహాలక్ష్మి తో అంటాడు. ఇక చక్రి మహాలక్ష్మి ఇద్దరు కూడా భూషణ్కి వార్నింగ్ ఇచ్చి బయటికి వస్తారు..

చక్రీకి మహా స్ట్రాంగ్ వార్నింగ్..

Advertisement

జీతంతో చక్రి ఈ మహాలక్ష్మి బయటికి రాగానే మహా చాలా కోపంగా ఉంటుంది. మీరు కార్ ఎక్కితే బయటకు వెళ్ళిపోదాం అని చక్రి అడుగుతాడు. కానీ, ఇందాక మీరేమన్నారు గుర్తు చేసుకోండి అని మహాలక్ష్మి అంటుంది. లోపల మీరు ఏమన్నారో ఒకసారి గుర్తు చేసుకోండి అని మహాలక్ష్మి మళ్ళీ మళ్ళీ చెప్పడంతో చక్రి షాక్ అవుతాడు.. నేను లోపల చాలానే అన్నాను దేని గురించి మీరు మాట్లాడుతున్నారు అని మహాతో అంటాడు చక్రి.. చివర్లో ఏమన్నారు..మహా నాది అని అనగానే.. ఆ మాట విన్న మహాలక్ష్మి ఇంకొకసారి ఈ మాట అంటే అసలు ఊరుకోను అని వార్నింగ్ ఇస్తుంది.. అంత సీరియస్ గా ఉన్న కూడా ఆ మాటని మర్చిపోలేదే అని చక్రి అనుకుంటాడు.

ఉద్యోగం పోయిందని బాధపడ్డ మహా..

కారు ఎక్కగానే మహాలక్ష్మి చాలా బాధపడిపోతూ ఉంటుంది. మీరు అలా బాధపడకండి ఈ ప్రపంచంలో ఆ ఒక్క జాబ్ తప్ప ఇంకేది లేదా.. ఉండేదే మీరు ఇలా బాధపడిపోతూ ఉంటే ఏదోలా ఉంది. మీరు ఇలా ఏడుస్తూ ఉంటే మా అన్నయ్య మీకోసం కర్చీఫ్ లు షాప్ పెట్టేస్తాడు.. మీరు బాధపడకండి ఇంకొక జాబు మీకు తప్పకుండా వస్తుంది.. వీరనారి ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మళ్లీ మళ్లీ ప్రయత్నించండి ఏదో ఒక జాబు మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది అని చక్రి మహని ఓదారుస్తాడు. చక్రి మాటలు విన్న మహాలక్ష్మి కాస్త నవ్వుతుంది.. ఇంటికి వెళ్ళిన తర్వాత అందరూ ఉద్యోగం గురించి అడగ్గానే భూషణ గురించి చెప్తుంది మహాలక్ష్మి.. అది విన్న అందరూ చాలా సీరియస్ గా ఉంటారు.. కానీ మహాలక్ష్మి మాత్రం ఇంకొక జాబ్ వస్తుందిలే అన్నట్టుగా ఫీల్ అవుతుంది..

చక్రికీ ప్రతాప్ ఛాలెంజ్..

Advertisement

చక్రీ కి కస్టమర్ ఫోన్ చేయడంతో నాకు నిజంగానే కస్టమర్ ఫోన్ చేశారు నేను వెళ్ళిపోతున్నాను అని చక్రి అంటాడు. ప్రతాప్ తన ఫ్రెండును కలవడానికి వస్తాడు.. ఆ ఫ్రెండు చక్రిని బుక్ చేసుకుంటాడు. ప్రతాప్ ని చూసిన చక్రీ అయ్యో అడ్డంగా ఇరుక్కుపోయానే అని బాధపడిపోతూ ఉంటాడు. ప్రతాప్ నేను ఈ డ్రైవర్ ఉన్న కార్లో రాను అని ఎంత చెప్తున్నా సరే తన ఫ్రెండు రారా చాలా మంచివాడు అని తీసుకొని వెళ్తాడు.. అతను దిగిపోయిన తర్వాత ప్రతాప్ చక్రిపై సీరియస్ అవుతాడు.. అయితే మహాలక్ష్మిని నా వెంట తీసుకెళ్లిపోతాను వారం రోజుల్లో నీకు దూరం చేస్తాను అని ప్రతాప్ అంటాడు.. మొత్తానికి, చక్రీ ప్రతాప్ ఇద్దరు మధ్య ఒక పెద్ద వారు నడుస్తుంది. చక్రి మాటకు మాట సమాధానం చెప్పడంతో.. ప్రతాప్ తన కూతుర్ని నీకు దూరం చేస్తాను అని వార్నింగ్ ఇస్తాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్లో మహాలక్ష్మి కోసం ప్రతాప్ అక్కడికి వస్తాడు.. ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి..

Also Read :Intinti Ramayanam Today Episode: శ్రీకర్ ను రెచ్చగొట్టిన శ్రీయ.. కన్నీళ్లు పెట్టుకున్న పార్వతి.. పల్లవి ప్లాన్ సక్సెస్..

Related News

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Karthika Deepam2 : సీరియల్ లవర్స్ కు బ్యాడ్ న్యూస్.. ఆ క్యారెక్టర్ అవుట్..

Big Stories

Advertisement
×