E-Paper
Advertisement

Karthika Deepam 2 Serial Today Episode May 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను దారుణంగా అవమానించిన జ్యోత్స్న  

Karthika Deepam 2 Serial Today Episode May 21st ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: దీపను దారుణంగా అవమానించిన జ్యోత్స్న  
Advertisement

Karthika Deepam 2  serial today Episode: ఆఫీసులో జ్యోత్స్న సంతకం చేసి పెన్ను దీపకు ఇవ్వబోతూ నువ్వు సంతకం చేయ్‌ అంటూ ఓ నీకు సంతకం రాదు కదా..? నువ్వు చదువుకోలేదు కదా..? అంటూ ఎగతాళిగా మాట్లాడుతుంటే.. కార్తీక్‌ అడ్డుపడతాడు. దీప ఐదో తరగతి దాకా చదువుకుంది అని చెప్పగానే.. ఏదో యూనివర్సిటీ గోల్డ్‌ మెడలిస్ట్‌ అయినట్టు మాట్లాడుతున్నావేంటి బావ అంటూ వెటకారంగా మాట్లాడగానే.. కార్తీక్‌ దీప కష్టాల గురించి ఎమోషనల్ స్పీచ్‌ ఇస్తాడు. దీంతో జ్యోత్స్న నోర్మూసుకుంటుంది. దీప మాత్రం కే. దీప అని సంతకం చేయగానే.. జ్యోత్స్న కే అంటే ఏంటి..? అని అడగ్గానే.. కే అంటే కార్తీక్‌. అదే నా చిరునామా అంటుంది.

దీంతో జ్యోత్స్న షాక్‌ అవుతుంది. అప్పుడే మేనేజర్‌ వచ్చి దీప, జ్యోత్స్నలను తీసుకెళ్లి వాళ్లకు వాళ్ల క్యాబిన్‌ చూపిస్తాడు. జ్యోత్స్న వెళ్లి తన సీట్లో కూర్చోగానే.. దీప కూడా వెళ్లి తన సీట్లో కూర్చుంటుంది. ఇద్దరి మధ్య పోటాపోటీ మాటల యుద్దం జరుగుతుంది. కార్తీక్‌ చూస్తుంటాడు. జ్యోత్స్న ఏంటి బాష మారింది అని అడగ్గానే.. పోస్ట్‌ మారింది కదా..? అంటుంది దీప. కార్తీక్‌ కూడా మీకు ఈ బాష కరెక్టే మేడం.. ముందు మీకు ఏ రెస్టారెంట్‌ కేటాయించారో చూడండి అనగానే.. జ్యోత్స్న చూసి పంజాగుట్ట అని చెప్పగానే.. కార్తీక్‌ మంచి సెంటరే.. దీప నీకు అని చెప్పగానే.. ఇదంతా ఇంగ్లీష్‌లో ఉంది బావ అనగానే.. జ్యోత్స్న నవ్వుకుంటుంది. కార్తీక్‌ తీసుకుని చూసి చెప్తాడు. దీప ఆలోచిస్తుంటుంది.

Advertisement

ఇంట్లో శౌర్య, కాంచన దాగుడుమూతలు ఆడుతుంటే.. పారిజాతం వచ్చి వెటకారంగా మాట్లాడుతుంది. దీంతో కాంచన కోపంగా పారిజాతాన్ని తిడుతుంది. దీంతో పారిజాతం మాట మారుస్తుంది. నిన్ను నీ క్యారెక్టర్‌ను అనుమానించలేదు.. ఏదో క్యాజువల్‌గా అడిగాను అంటూ పారిజాతం మాట మారుస్తుంది. శౌర్యను నీకేం కావాలి చెప్పు అని ఇష్టం లేకపోయినా అడుగుతుంది. అయితే మనం కబడ్డీ ఆడుదామా..? అని అడగ్గానే.. ఆడుదాములే అంటూ అక్కడ మీ అమ్మను నా మనవరాలు కబడ్డీ ఆడుతుంటుంది.. మనం ఇక్కడ ఆడుదాములే కబడ్డీ అని మనసులో అనుకుంటుంది.

ఆఫీసులో ఉన్న కార్తీక్‌ జ్యోత్స్న నేమ్‌ బోర్డు చూసి మిగతా విషయాలు ఎలా ఉన్నా పేరు మాత్రం బాగుంది అంటాడు. అయితే అక్కడ దుమ్ము దులిపినట్టు ఇక్కడ దులుపుతావా.. అని అడగ్గానే.. అక్కడంటే నేమ్‌ బోర్డు మీదే దుమ్ము ఉంది.. ఇక్కడ మనిషి మీద కూడా ఉంది కదా..? దులపమంటావా..? అంటూ కార్తీక్‌ అడగ్గానే.. జ్యోత్స్న వద్దులే ఈ ఫైల్‌ చదువు అంటూ ఫైల్‌ ఇస్తుంది ఓకే అంటూ ఫైల్‌ తీసుకున్న కార్తీక్‌ దీప వైపు రొమాంటిక్‌గా చూస్తూ.. కన్ను కొడుతుంటే.. జ్యోత్స్న చూస్తుంది. బావ ఏం చేస్తున్నావు అని అడగ్గానే.. మా ఆవిడకు సైటు కొడుతున్నా నిజం చెప్పాలంటే మా ఆవిడతో ఇవాళే నేను ప్రేమలో పడ్డాను అంటాడు. దీప మాత్రం ఇది ఆఫీసు బావ అంటుంది. కార్తీక్‌ మాత్రం ప్రేమకు ఆఫీసు ఉండదు.. ఏదీ ఉండదు.. అంటూ కవితలు చెప్తుంటాడు. జ్యోత్స్న  వెటకారంగా తిడుతుంది. నువ్వెళ్లి తాత దగ్గర కూర్చో బావ అని చెప్పగానే.. కార్తీక్‌ వెళ్లనని ఇక్కడే కూర్చుంటానని చెప్తూ.. దీపకు కాఫీ బ్రేక్‌ తీసుకో.. అంటూ కార్తీక్‌ క్యాంటీన్‌లోకి వెళ్తాడు. వెనకాలే దీప వెళ్తుంది.

Advertisement

ఇద్దరూ కలిసి మాట్లాడుకుంటుంటే.. జ్యోత్స్న వెళ్లి వాళ్లిద్దరి మధ్య దూరుతుంది. ఇద్దరు కలిసి నన్ను ఓడించడానికి ప్లాన్‌ చేస్తున్నారా..? అంటూ అడగ్గానే.. జ్యోత్స్నను ఓడించడానికి ప్లాన్ చేయడం అవసరం లేదని దీప తప్పకుండా గెలుస్తుందని కార్తీక్‌ చెప్పి వెళ్లిపోతాడు. దీప నవ్వుతూ జ్యోత్స్నకు వార్నింగ్‌ ఇచ్చి వెళ్లిపోతుంది. ఫస్ట్ డే అని నీ మీద నేను ఎలాంటి ప్రయోగం చేయలేదు. చేస్తే ఎలా ఉంటుందో చూపిస్తాను అనుకుంటూ జ్యోత్స్న వెళ్లిపోతుంది. తర్వాత మేనేజర్‌ దీపకు లాప్‌ట్యాప్‌ తీసుకొచ్చి ఇచ్చి మొత్తం వివరాలు అన్ని ఇందులోనే ఉంటాయని చెప్తాడు. ఇక మీదట వర్క్‌ అంతా చేయాల్సింది లాప్‌టాప్‌ తోనే అని చెప్పగానే.. దీప ఆలోచిస్తుంది. మీ మెయిల్‌ ఐడీతో లాగిన్‌ అవ్వండి మేడం అంటూ మేనేజర్‌ చెప్పగానే.. దీప అమాయకంగా నా దగ్గర ఓటర్‌ ఐడీ తప్పా ఏ ఐడీ లేదు అంటుంది. దీంతో జ్యోత్స్న గట్టిగా నవ్వుతుంది. కార్తీక్‌, దీపకు ఏదో చెప్పబోతుంటే.. జ్యోత్స్న ఆపేస్తుంది. ఇంతలో కార్తీకదీపం2 ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.

 ALSO READ: మిథున రాశిలోకి శుక్రుడు – ఆ ఐదు రాశులకు గజలక్ష్మీ యోగం – అపర కుబేరులు అవ్వడం ఖాయం

 

Related News

Telugu Tv Serials : ఈ వారం సీరియల్స్ రౌండప్.. టాక్ ఆఫ్ ది సీరియల్ ఏదంటే..?

ఇంద్రజకు ఒక్కరోజు రెమ్యూనరేషన్ ఎన్ని లక్షలో తెలుసా..? సినిమా కన్నా ఎక్కువే..

Gundeninda GudiGantalu Today episode: సంబరాలు చేసుకున్న ప్రభా.. చింతామణి కుట్ర తెలిసిపోతుందా..? బాలుకు షాక్..

Podarillu Today Episode : విగ్నేశ్వరి దెబ్బకు మహా ఫ్యూజుల్ అవుట్.. మహా కోసం సర్ప్రైజ్ ప్లాన్.. నిజం తెలిసిపోతుందా..?

Intinti Ramayanam Today Episode: అయ్యో పాపం శ్రీయ.. పల్లవి నగలను కొట్టేసిందా..? అక్షయ్ సీరియస్..

Illu Illalu Pillalu Today Episodes: ధీరజ్ కు షాక్.. వల్లి ఫిట్టింగ్ అదిరిపోయింది.. నెక్స్ట్ ఏం జరుగుతుంది..?

Sunday Movies in Tv : ఆదివారం టీవీ సినిమాలు.. మాస్ ఫ్యాన్స్ కు పునకాలే..

Nindu Noorella Saavasam Serial Today Episode July 18th ‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: ప్లాన్ ప్రకారం బుజ్జమ్మ చంపాలనుకున్న ప్రచండ

Big Stories

Advertisement
×