Intinti Ramayanam Today Episode May 21st : పల్లవికి ఎంతగా నచ్చచెప్పినా సరే పల్లవి మాత్రం తన పేరుని మార్చుకోవడం లేదు. తనని తాను ఎప్పటికీ అర్థం చేసుకునే పరిస్థితి అయితే లేదని కనిపిస్తుంది. తన కాపురాన్ని చేతులారా నాశనం చేసుకుంటుంది అని చక్రధర్ ఒంటరిగా ఉండి బాధపడిపోతూ ఉంటాడు.. అది చూసిన అవని ఏంటి నాన్న బాధపడుతున్నావా పల్లవి మారదు అని నాకు కూడా అర్థమవుతుంది కానీ ఇప్పుడు ఆ ఇంట్లో ఉంటే మనకు లేనిపోని సమస్యలు వస్తాయి. ఎలాగైనా సరే పల్లవిని ఇక్కడికి తీసుకురావాలి అని అవని అంటుంది. నా కొడుకు నా భార్య నా మాట వినడం లేదు ఇప్పుడు నా కూతురు కూడా నాకు సమస్యగా తయారైంది అని చక్రధర్ బాధపడిపోతూ ఉంటాడు. అవని పల్లవి ఎక్కడుంటే భరత్ అలాగే ప్రణతిలను విడగొట్టే ప్రయత్నం చేస్తుంది కాబట్టి ఎలాగైనా సరే నేను పల్లవిని తీసుకొని వస్తాను అని అంటుంది..
శ్రీకర్ పల్లవిని ఇంట్లో నుంచి పంపించేశాడు కమలని భానుమతి ఫోన్ చేసి చెప్పగానే అక్కడికి వెళ్లి ఏం జరిగింది తెలుసుకోవాలని అనుకుంటాడు. శ్రీకర్ బయటకు వెళ్తుండగా అడ్డుపడుతుంది. మీ వాళ్ళు ఫోన్ చేస్తే నువ్వు చాలా సీక్రెట్ గా ఫోన్ మాట్లాడవు నాకు అర్థం అయిపోయింది మీ వాళ్ళే ఫోన్ చేశారని ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నావ్ నువ్వు చెప్తావా అని అడుగుతుంది. ఎక్కడికో ఎందుకు వెళ్తున్నావ్ మా వాళ్లని కలవడానికి ఇంటికి వెళ్లొస్తాను మా అమ్మ చాలా బాధపడుతుంది అంట అని శ్రీకర్ అనగానే చేయ ఎలాగైనా సరే తినని ఆపాలి అని అనుకుంటుంది. అనుకున్న విధంగానే నువ్వు మీ వాళ్ళని కలవడానికి అస్సలు వీల్లేదు అని శ్రియ కండిషన్ పెడుతుంది. మా వాళ్ళకి నన్ను శాశ్వతంగా దూరం చేయాలని అనుకుంటున్నావా అని శ్రీకర్ అడుగుతాడు. నువ్వు ఇలా మారవ్ ఏంటి ఇంత రాక్షసులాగా మారాల్సిన అవసరం ఏంటి అని శ్రీకర్ ఎంతగా అడిగినా సరే శ్రీయ మాత్రం కన్నీళ్లు పెట్టుకొని ఎమోషనల్ గా బ్లాక్మెయిల్ చేస్తుంది. శ్రియ బాధపడుతుంది అని శ్రీకర్ తన ఇంటికి వెళ్లడు. తన ఇంటికి వెళ్లకుండా చేయడమే శ్రియ ప్లాన్..
ఇంట్లో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అని నాకు చాలా బాధగా ఉంది అని పార్వతి బాధ పడిపోతూ ఉంటుంది. అందరూ కలిసి ఉండాలని నా భర్త కోరిక ఇప్పుడు నెరవేరకుండా పోతుంది అని భయంగా ఉంది అని పార్వతి ఎమోషనల్ అవుతుంది. అప్పుడే అక్కడికి వచ్చిన కమల్ ఏంటి పిండి వంటలు వాసన వస్తుంది ఏం చేశారు అని అడుగుతాడు. పల్లవి వెళ్లిపోయిన తర్వాత గుమగుమలు లాడిపోతున్నయి అని అనగానే అందరూ ఒక్కసారిగా కమల్ పై సీరియస్ అవుతారు. లాంటిది ఇంట్లో లేకపోవడమే మంచిది మన చెడు కోరుకునేది మన మధ్య ఉంటే మనకి సమస్య అని కమల్ అంటాడు. అతని మాట విన్న పార్వతీ కన్నీళ్లు పెట్టుకుంటుంది. శ్రియ కోసం నేను పిండి వంటలు చాలా చేశాను. ఈ గొడవ వల్ల అక్కడికి వెళ్ళలేకపోతున్నాను అని బాధపడిపోతుంది పార్వతీ.
పల్లవి ఒంటరిగా కూర్చుని బాధ పడిపోతూ ఉంటుంది. అక్కడికి వచ్చిన భరత్ మీరు ఇలా బాధపడిపోతూ ఉంటే నేను చూడలేకపోతున్నాను సిస్టర్ అని అంటాడు. నేను ఇంతలా బాధ పడిపోవడానికి కారణం మీ అవని అక్క అని పల్లవి భరత్ ని ఇంకాస్త రెచ్చగొట్టేలా మాట్లాడుతుంది.. మనం ఏమనుకుంటే ఏం ప్రయోజనం అని అవని గురించి లేనిపోనివి చెప్పి భరత్ ని ఇంకాస్త దూరం చేయాలని పల్లవి ప్లాన్ చేస్తుంది.. తాను అనుకున్న విధంగానే భరత్ అవనిపై ఇంకాస్త సీరియస్ గా ఉంటాడు..
రాజేశ్వరి టైమెంతయిందో తెలుసా మీరు ఇంకా భోజనం చేయలేదు ఏంటి పదండి భోజనం చేద్దామని అందరిని పిలుస్తుంది. భరత్ నీ ఎలాగైతే మన వైపు తిప్పుకున్నామో అలాగే ప్రణతిని కూడా మన వైపు తిప్పుకునే ప్లాన్ చేస్తున్నాను మామ్ అని పల్లవి అంటుంది. ప్రణతి వల్లే ఇప్పుడు నేను మళ్ళీ ఆ ఇంటికి కూడా వెళ్ళగలను అని పల్లవి ఆలోచిస్తుంది. భరత్ రాజేశ్వరి పల్లవి ముగ్గురు భోజనానికి కూర్చుంటారు కానీ ప్రణతి ఎక్కడ కనిపించలేదు అంటే ఏమో నాకు ఎలా తెలుసు తినాలని అనిపించలేదు ఏమో అని భరత్ అంటాడు. కానీ రాజేశ్వరి మాత్రం ప్రణతిని పిలవడంతో కిందకు వస్తుంది. మీరు భరత్ మీరా ఇంత ప్రేమని ఇప్పుడు ఎందుకు చూపిస్తున్నారు అని ప్రణతి అనగానే రాజేశ్వరి పల్లవి ఇద్దరు దిమ్మతిరిగిపోయేలా షాక్ అవుతారు.
కడుపుతో ఉన్న వాళ్ళకి చాలా కోరికలు ఉంటాయి. శ్రియ మనకి దూరంగా ఉన్నా సరే తన కోసం ఏదైనా చేసి పెట్టాలి అని నేను ఎన్నోసార్లు అనుకున్నాను. ఈరోజు కూడా తనకోసం ఇష్టమైన వంటల్ని చేసిపెట్టాను. ఇప్పుడు తీసుకెళ్లి ఇవ్వలేని పరిస్థితి నాది అని బాధ పడిపోతూ ఉంటుంది పార్వతి. నువ్వేం బాధపడకు అమ్మ నీ కోరికను మేము తీరుస్తాము శ్రేయ కోసం నువ్వు చేసిన వంటల్ని మేమే స్వయంగా తీసుకెళ్లి ఇస్తామని అక్షయ్ అనగానే చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. తల్లి కోరిక కోసం అక్షయ్ శ్రీకర్ శ్రీయ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. కానీ అక్కడ శ్రేయ మాటలకు అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. పార్వతి ఎంతో ఇష్టంగా చేసి పంపించిన పిండి వంటల్ని నాకొద్దు అని పంపించేస్తుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో పల్లవి కోసం అవని తన ఇంటికి వెళ్తుంది ఆ తర్వాత ఏం జరుగుతుందో చూడాలి…
Also Read : బిగ్ బాస్ యష్మీ చేసిన బిగ్ మిస్టేక్..సీరియల్స్ కు గుడ్ బై..?