E-Paper
Advertisement

Podarillu Today Episode : మహా మాటే నిజమైందా..? హమ్మయ్య కన్నా దొరికేశాడు.. సెంటిమెంట్ తో ఏడపించేశారు..

Podarillu Today Episode : మహా మాటే నిజమైందా..? హమ్మయ్య కన్నా దొరికేశాడు.. సెంటిమెంట్ తో ఏడపించేశారు..
Advertisement

Podarillu Today Episode May 3rd : ఇంటికి వచ్చిన నారాయణను తిట్టేస్తుంది మహా.. మీరు చెప్పిన నిజం వల్లే వాడు బాధతో ఇంట్లోంచి వెళ్లిపోయాడు. ఇంట్లోకి రాలేదు అంటే వాడికి ఏదైనా అయ్యిందా? ఎక్కడున్నాడు అని వెతకాల్సిన బాధ్యత మీకు లేదా అని నారాయణ ను తిడుతుంది మహాలక్ష్మి. మహాలక్ష్మి తిడుతుంటే నారాయణ నవ్వుతాడు. నేను తిడుతుంటే నువ్వు నవ్వుతున్నావ్ ఏంటి అని మహాలక్ష్మి అంటుంది. 20 ఏళ్ల క్రితం ఇలా ఒక ఆడ మనిషి దబాయించేది. ఇప్పుడు ఇంట్లో మనుషుల గురించి ఒక ఆడ మనిషి ఆలోచిస్తుంది అంటే నాకు చాలా సంతోషంగా ఉంది. నువ్వు చెప్పావు కదమ్మా నేను వెళ్లి ఊరంతా జల్లేరు పట్టేలా సరే వాడిని తీసుకొని వస్తాను అని నారాయణ అంటాడు..

కన్నాను తలచుకొని మహా ఎమోషనల్..

కన్నా ఎంత మంచివాడు నాకు తమ్ముడు లాంటివాడు.. ఎక్కడున్నావ్ రా కన్నా అని మహాలక్ష్మి బాధ పడిపోతూ ఉంటాది. తనతో గడిపిన క్షణాలని గుర్తు చేసుకుంటుంది మహాలక్ష్మి. అయితే ఒక రోజు నేనొక్కన్నే ఆడుకోవడం బోర్ కొడుతుంది మీరు కూడా ఒకసారి క్యారం బోర్డ్ ఆడాలి అని మహాలక్ష్మితో కన్నా అంటాడు.. ఇందులో నేను ఓడిపోతే నన్ను సినిమాకు తీసుకొని వెళ్ళాలి. నేను ఓడిపోతే నాకిష్టమైన ప్లేస్ దగ్గరికి మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అని మహాలక్ష్మితో అంటాడు.. కన్నాతో గడిపిన క్షణాల్ని గుర్తు చేసుకొని ఎమోషనల్ అయినా మహాలక్ష్మి తాను బాధ వచ్చిన సంతోషం వచ్చినా ఒక ప్లేస్ కి వెళ్తాడని చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకుంటుంది. కచ్చితంగా తన అక్కడే ఉంటాడు అని మహాలక్ష్మి అనుకుంటుంది.

చక్రీకి కన్నా అడ్రస్ చెప్పిన మహా..

Advertisement

తనకి బాధ చిన సంతోషం వచ్చినా ఆ ప్లేస్ లో ఉంటాను అని చెప్పాడు కదా.. అయితే కచ్చితంగా తను అక్కడే ఉంటాడేమో అని మహాలక్ష్మి అనుకుంటుంది. వెంటనే ఈ విషయాన్ని చక్రీతో చెప్పి కన్నా అక్కడ ఉన్నాడో లేదో తెలుసుకోమని చెప్పాలి అని అనుకుంటుంది.. చక్రి కి ఫోన్ చేసిన మహా కన్నా దొరికాడా అని అడుగుతుంది. ఊరంతా వెతుకుతున్నామండీ కానీ ఎక్కడ కనిపించడం లేదు ఎక్కడికి వెళ్లాడు అని చక్రి అంటాడు. ఇది నేను ఒక అడ్రస్ చెప్తాను మీరు అక్కడికి వెళ్లి వెతకండి అక్కడ ఉంటాడో లేదో చూద్దామని మహాలక్ష్మి అంటుంది. ఈ అడ్రస్ గురించి మీకు ఎలా తెలుసు అని అనగానే నాకు దీని గురించి తెలుసు.. రోజు కన్నానే తనకు బాధ వచ్చినా ఆ ప్లేస్ కి వెళ్తానని చెప్పాడు ఒకసారి మీరు అర్జెంటుగా ప్లేస్ కి వెళ్లి చూడండి అని మహాలక్ష్మి అంటుంది.

కన్నా కోసం వెళ్లిన చక్రీ..

కన్నా కచ్చితంగా ఈ అడ్రస్ లో ఉంటాడు అన్నయ్య మహాలక్ష్మి నాకు చెప్పింది అని చక్రి అక్కడికి వెళ్తాడు. నిజంగానే మహా చెప్పిన విధంగానే కన్నా ఒక్కడే ఒంటరిగా అక్కడ కూర్చుని బాధ పడిపోతూ ఉంటాడు. అరె కన్నా నీకోసం మేము ఊరంతా వెతుకుతున్నాం రా నువ్వు ఇక్కడ ఉన్నావా అని చక్రి తన దగ్గరికి వెళ్తాడు. అన్న కనిపించిన సంతోషంలో మాధవ్ ఒక్కసారిగా గొప్ప కూలిపోయి బాధపడిపోతూ ఉంటాడు.. నువ్వు ఎందుకురా ఇలా చేశావు నీకు మేమందరం లేమా అని చక్రి కన్నాతో అంటాడు. మాధవ్ బాధపడడం చూసిన కన్నా అన్నయ్య బాధపడుతున్నాడు అని అక్కడికి వెళ్తాడు.

ఎమోషనల్ డైలాగులతో కన్నీళ్లు..

Advertisement

మాధవ దగ్గరికి వెళ్ళిన కన్నా నన్ను క్షమించు అన్నయ్య అని కన్నీళ్లు పెట్టుకుంటాడు. ఎందుకురా కన్నా ఇలా చేశావు నీకు మేమేం తక్కువ చేసామని ఇలా చేసావు అని మాధవ్ అడవుగానే కన్నా కన్నీళ్లు పెట్టుకుంటాడు. అన్నదమ్ముల సెంటిమెంట్ సీన్ తో ప్రేక్షకులు కంటతడి పెట్టుకుంటారు. ఇక చక్రి మహాలక్ష్మికి అలాగే కేశవ కి ఫోన్ చేసి కన్నా దొరికాడు అని చెప్తారు. నువ్వు ఎప్పుడూ ఇలా చేయొద్దు రా నువ్వు మా ప్రాణం.. నీకోసం ఉదయం నుంచి ఎక్కడికి వెళ్లకుండా ఊరంతా తిరుగుతూనే ఉన్నాము అని కన్నాతో మాధవ్ అనగానే చాలా బాధపడిపోతారు.

కన్నా కోసం వెయిటింగ్…

కన్నా ఇంకా ఇంటికి రాలేదేంటి దొరికాడని చెప్పాడు కదా చక్రి అని కేశవ నారాయణ మహా ముగ్గురు కూడా బయట ఎదురు చూస్తూ ఉంటారు.. ఇక కన్నా రాగానే అందరూ ఒక్కసారిగా ఎమోషనల్ అయిపోతారు.. ఎందుకురా కన్నా ఇలా చేశావు అని కేశవ కన్నీళ్లు పెట్టుకుంటాడు. కన్నా నన్ను కూడా వదిలేసి వెళ్ళిపోవాలనుకున్నావా అని మహాలక్ష్మి ఏడుస్తుంది. ఇక అందరికీ కన్నా క్షమాపణలు చెప్తాడు.. నేను చేసింది తప్పే మిమ్మల్ని వదిలేసి నేను ఎక్కడికి వెళ్ళను అని మాట ఇస్తాడు.. కన్నా కోసం మాధవ్ ఇంకా కన్నీళ్లు పెట్టుకుంటూనే ఉంటాడు. నువ్వు మా కోసం కాకపోయినా పెద్ది కోసమైనా ఇక్కడ ఉండాలి కదరా తను చూడరా చిన్నపిల్లల లాగా ఎలా ఏడుస్తున్నాడు అని మహాలక్ష్మి అనగానే కన్నా ఇంకా బాధపడి పోతాడు. అక్కడితో ప్రోమో ఎండ్ అవుతుంది. సోమవారం ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి…

Also Read :Intinti Ramayanam Today Episode: రాజేశ్వరి ప్లానేంటి..? శ్రీయకు నొప్పులు.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Related News

Intinti Ramayanam Today Episode: అవనిని కొట్టించిన పల్లవి.. రెచ్చిపోయిన అక్షయ్.. పల్లవికి దిమ్మతిరిగే షాక్..

Illu Illalu Pillalu Today Episodes: వల్లికి విశ్వం వార్నింగ్.. వేధవతికి సీరియస్.. భాగ్యం ప్లాన్ సక్సెస్..

Podarillu Today Episode : జమున దొరుకుతుందా..? శైలు మాటతో షాక్.. నారాయణ దెబ్బకు మైండ్ బ్లాక్..

Karthika Deepam 2 Serial Today Episode October 17th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: మాలిని ఎదురుగానే జ్యోత్స్న చేయి పట్టుకున్న సూరజ్            

Gundeninda GudiGantalu Today episode: బాలును ఇరికించే ప్లాన్.. దొంగగా రోహిణి.. ఇది కదా అసలు ట్విస్ట్..

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

Big Stories

Advertisement
×