Podarillu Today Episode October 26th: మహాలక్ష్మి చాలా కోపంగా ఇంటికి వస్తుంది. అయితే నారాయణ దగ్గరికి వచ్చి నేను మీతో మాట్లాడాలి అని అంటుంది. నేను బీడీలు ఏమి కాల్చలేదు ఏం మాట్లాడాలి అని నారాయణ అంటాడు. అయితే మహాలక్ష్మి నారాయణను బండి ఎక్కించుకొని ఒక గుడి దగ్గరికి తీసుకొని వెళుతుంది. నీకు బండి రాదు కదా నాకు భయమేస్తుంది. బండి పక్కన ఆపు నేను రిస్క్ తీసుకోలేను అని నారాయణ అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం గుడి దగ్గర నుంచి ఒక్క అడుగు కూడా బయటకు పెట్టదు నేను నీతో చాలా మాట్లాడాలి. గుడి లోపలికి వెళ్లి అసలు కన్నా ఎవరి కొడుకు ఆ జమునకు మీకు ఉన్న సంబంధం ఏంటి అని అడుగుతుంది. ఇదేం ప్రశ్న నా కొడుకు అని తెలుసు కదా మళ్లీ ఇది కొత్తగా అడుగుతున్నావేంటి అని మహాలక్ష్మితో అంటాడు నారాయణ. కానీ మహాలక్ష్మి దేవుడి సన్నిధిలో నిజం చెప్పమని కోరగానే ఎవరికీ చెప్పని నిజం నీకు చెప్తాను అని నారాయణ మొత్తం నిజాన్ని చెప్పాడు.
కన్న గురించి జమున గురించి చెప్పగానే మహాలక్ష్మి ఎమోషనల్ అయిపోతుంది.. జమున తన జీవితంలోకి ఎలా వచ్చిందో అన్న నిజాన్ని నారాయణ బయట పెట్టగానే మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నా నిజం తెలిస్తే తట్టుకోలేడు అందుకే నేను ఎప్పుడూ వాడికి దూరంగా పెట్టాలని అనుకోలేదు వాడ్ని కూడా నా కొడుకులాగే చూసుకున్నాను. మీరు చాలా గ్రేట్ అంటూ కన్నీళ్లు పెట్టుకుంటూ ఎమోషనల్ అయిపోతుంది. దాంతో నారాయణ ఒక్కసారిగా షాక్ అవుతాడు.. అసలు మీరు ఎంత మంచి వాళ్ళు మీలాంటి వ్యక్తిని అందరూ ఇలా మాట్లాడుతున్నారని మహాలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటుంది. కన్నాకి ఎప్పుడూ నిజం చెప్తే అప్పుడు మీ గురించి మంచిగా ఆలోచిస్తాడు. కానీ మీరు ఎందుకు నిజం చెప్పలేదు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తుంది. అయితే నారాయణ గొప్పతనాన్ని తెలుసుకున్న మహాలక్ష్మి తనని దేవుడితో సమానంగా చూస్తుంది.
నారాయణ గుడిలో దేవుడిగా కనిపించాడు అని మహాలక్ష్మి చాలా గొప్పగా తన గురించి మాట్లాడుతుంది. మీకు ఏ సంబంధం లేని ఒక ఆడది పసి బిడ్డను తీసుకొని వచ్చి మీ దగ్గర వదిలేసి తన సుఖాన్ని తను చూసుకుంది అంటే ఎవరైనా కూడా ఆ బిడ్డని ఎక్కడైనా వదిలేయాలి అని అనుకుంటారు. కానీ మీరు మాత్రం ఆ బిడ్డని చాలా జాగ్రత్తగా మీ కన్న కొడుకు లాగా చూసుకున్నారు అని మహాలక్ష్మి అనగానే నారాయణ నా మనసు ఒప్పుకోలేదు అమ్మా అని అంటాడు.. ఇకపోతే నారాయణ నువ్వు మా ఇంట్లో ఎందుకు ఉన్నావు నీకన్నా నేను గొప్పవాడిని కాదు కదా అని అంటాడు. కానీ మహాలక్ష్మి మాత్రం నాకన్నా మీరు చాలా గొప్ప వాళ్ళు మీలాంటి మంచి మనసు నాకు లేదు అని అంటుంది. ఇక నారాయణ ఈ విషయాన్ని ఇక్కడితోనే మర్చిపోతే మంచిది అని అంటాడు.
మాధవ్ తన కన్న తండ్రి ఎంత గొప్పదో తెలుసుకున్న తర్వాత చాలా ఎమోషనల్ అయిపోతాడు. మా నాన్న నిజంగానే ఇలాంటివాడని నాకు అసలు తెలియదు నిజంగానే దేవుడు నా చంటి బిడ్డ లాగా కన్నాని పెంచాను కానీ వాడే మా నాన్నని ఇంట్లో నుంచి పంపించాలి అని చూస్తున్నాడు వాడికి నిజం తెలిస్తే ఏమైపోతాడు అని మాధవ్ చాలా బాధపడిపోతాడు. అయితే ఈ విషయాన్ని చక్రికి గాని కేశవ కి కన్నాకి అస్సలు చెప్పకూడదమ్మా వాళ్ళు చాలా ఫీల్ అయిపోతారు. నారాయణని ఇన్ని రోజులు ఇలా చేసామని బాధ పడిపోతారు అని మాధవ్ గుడిలో మాట తీసుకుంటాడు.
చక్రీ కన్నా నారాయణ తీసుకొని వదిన వెళ్ళింది కదా.. ఇంకా రాలేదేంటి అని టెన్షన్ పడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే మహాలక్ష్మి మాధవ్ ఇంట్లోకి రావడం చూసి ఏంటి నారాయణకు వెళ్లి అన్నయ్యతో వచ్చారు. ఏం జరిగింది అని అడుగుతారు కానీ వాళ్ళిద్దరూ పొంతన లేని సమాధానం చెప్పడంతో చక్రికి అనుమానం వస్తుంది.. నేను ఎవరు ఏం మాట్లాడుకున్నారు గుడికి వెళ్ళాను రా నేను కూడా అక్కడికి కలిసాను వాళ్ళిద్దరూ ఏం మాట్లాడుకున్నారని వినాలి అనుకున్న కానీ వాళ్ళు ఏం మాట్లాడుకోలేదు అని అక్కడ అనగానే వాళ్లకి కచ్చితంగా అనుమానం వస్తుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Illu Illalu Pillalu Today Episodes: అమూల్యకు షాక్.. రామరాజు మాటతో సాగర్ ఫైర్.. భద్రకు కన్నీళ్లు..