Haris Rauf Clashes With Will Jacks: పాకిస్తాన్ గడ్డపై జరుగుతున్న వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు మూడు మ్యాచ్ లు ఫినిష్ కాగా ఆదివారం పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ (Pakistan vs England, 4th Match) మధ్య నాలుగో కీలక మ్యాచ్ లాహోర్ లోని గడాఫీ స్టేడియం (Gaddafi Stadium, Lahore) వేదికగా జరిగింది. ఈ మ్యాచ్ చేజింగ్ సమయంలో హారిస్ రవూఫ్ ( Haris Rauf ), విల్ జాక్స్ ( Will Jacks ) మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది.
సామ్ కరణ్ వేసిన ఓ బౌన్సర్ ను వైడ్ ఇవ్వలేదని పాకిస్తాన్ బ్యాటర్లు రవూఫ్, షాబాద్ ఖాన్ () అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బౌలర్ ఎండ్ దగ్గర ఫిల్డింగ్ చేస్తున్న విల్ జాక్స్ బూతులు తిట్టాడు. ఇది విన్న హారిస్ రవూఫ్ రివర్స్ అటాక్ చేశాడు. బ్యాట్ తో కొట్టేందుకు మీద మీదకు వెళ్లాడు. అంతలోనే అంపైర్ తో పాటు జో రూట్ కలగజేసుకొని వాళ్ళ మధ్య గొడవను అడ్డుకున్నారు. ఈ సంఘటన ఇప్పుడు వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ ఫ్యాన్స్ షాక్ అవుతున్నారు. ఒక్క వైడ్ ఇంతలా కొట్టుకోవాలా ? అంటూ కామెంట్స్ చేశారు.
పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య జరిగిన నాలుగో వన్డే చివరి వరకు ఉత్కంఠ భరితంగా సాగింది. షాబాద్ ఖాన్ సూపర్ సెంచరీ తో మ్యాచ్ గెలిపించాడు. అటు చివరలో వచ్చిన హారిస్ రవూఫ్ బౌండరీ కొట్టి మ్యాచ్ ఫినిష్ చేశాడు. దీంతో సంబరాలు చేసుకున్న పాకిస్తాన్ ఆటగాళ్లు అనంతరం ఇంగ్లాండ్ క్రికెటర్లకు షేక్ హ్యాండ్ ఇచ్చారు. ఈ క్రమంలో విల్ జాక్స్ ఎదురుపడగానే భుజంతో గట్టిగా హారిస్ రవూఫ్ ఢీ కొట్టాడు. దీంతో వెంటనే విల్ జాక్స్ కూడా సీరియస్ అయ్యాడు.
నాపైనే సీరియస్ అవుతావా ? అంటూ వేలు పెట్టి హారిస్ రవూఫ్ బెదిరించాడు. నువ్వు మళ్ళీ పాకిస్తాన్ రాకుండా చేస్తానని వార్నింగ్ ఇచ్చాడు. పాకిస్తాన్ వస్తే చంపేస్తానని బెదిరించినట్టు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ ఇద్దరి సంఘటన నేపథ్యంలో ఐసీసీ కచ్చితంగా చర్యలు తీసుకోవడం గ్యారెంటీ అని అంటున్నారు. కాగా ఈ మ్యాచ్ లో ఇంగ్లాండ్ మొదట బ్యాటింగ్ చేసి 241 పరుగులు సాధించింది. ఈ లక్ష్యాన్ని 47.1 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి పాకిస్తాన్ ఛేదించింది.
🚨 A CONVERSATION BETWEEN HARIS RAUF AND WILL JACKS!! 🤩🔥
ENGLAND PLAYERS CAN'T BELIEVE THIS.. pic.twitter.com/N4xFlrJmEn
— M Farhan (@MFarhan1200) October 25, 2026
FIERY SCENES IN LAHORE..!! 🤯
– Haris Rauf in a heated argument with Will Jacks. #PAKvsENG pic.twitter.com/q3VetZvojq
— Rana Ahmad. (@AhmadRana056) October 26, 2026