Illu Illalu Pillalu Today Episode October 26th : నేను అంత అద్భుతంగా పాట పాడను మొత్తానికి ధీరజ్ని గెలిపించాను అని ప్రేమ అంటుంది. ఏంటి ధీరజ్ ని నువ్వు గెలిపించావా ఏం మాట్లాడుతున్నావ్ ప్రేమ అని నర్మదా అడుగుతుంది. నేను పాడిన పాట ఏంటో తెలుసా వేలంపాట.. అందులో కార్ ఏజెన్సీ మనకే వచ్చింది ధీరజ్ కొద్దిరోజుల్లో కార్ బిజినెస్ స్టార్ట్ చేయబోతున్నాడు అంటూ గొప్పగా చెప్తుంది. 12 లక్షలు పడాల్సిన పాటని ఏకంగా 30 లక్షలు పడి నా కొంప ముంచేసింది అని ధీరజ్ చెప్పగానే అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు.. ఆ డబ్బులు నేను ఎక్కడ నుంచి కట్టాలి నీ బాబు దగ్గరనుంచి కట్టాలా అని ధీరజ్ ప్రేమని అంటాడు అయితే ప్రేమ మాత్రం మా బాబు ఎందుకు ఈ బేబీ చాలు నా నగలు అమ్మేసి కట్టేద్దామని అంటుంది. అది నగలు కాదే నాగుపాములు నా మెడకు చుట్టుకున్నాయి నన్ను చంపబోయే దానికే అవే చాలు అని ధీరజ్ భయపడిపోతూ ఉంటాడు.
ఏంట్రా ఇక్కడ ఏదో పెద్ద రచ్చ జరుగుతున్నట్టు ఉంది ఎందుకురా మీరందరూ బయట ఉన్నారు అని రామరాజు అడుగుతాడు. వేలంపాటలు ప్రేమ చాలా ఎక్కువ రేటుకి పాట పాడింది అని తీరేస్ చెప్పగానే ఒక్కొక్కసారి ప్రత్యర్థుల ఒత్తిడిని తట్టుకోవడానికి అలా చేయాల్సిందే అని ప్రేమకు సపోర్టుగా రామరాజు అనగానే చూసావా మావయ్య గారు కూడా నాకు సపోర్ట్ గా ఉన్నారు అని ప్రేమ చాలా సంతోషంగా ఉంటుంది. ఒకటి రెండు కాదు నాన్న 30 లక్షల కి పాట పాడింది అని ధీరజ్ టెన్షన్ పడిపోతుంటాడు.. నేనున్నా కదరా నేను చూసుకుంటాలే అని రామరాజు భరోసా ఇస్తాడు.. కానీ ధీరజ్ మాత్రం అంత డబ్బులు నేను ఎక్కడ్నుంచి కట్టాలి అని ఆలోచిస్తూ ఉంటాడు. నా గురించి ఆలోచించాల్సిన సంగతి మీకు లేదు నేను చూసుకుంటానని అంటాడు. కానీ రామరాజు మాత్రం నేనున్నాను అని అంటాడు.
రామరాజు తన కొడుకులకి అన్ని దగ్గరుండి చేయాలి అని ఆలోచిస్తూ ఉంటాడు.. తన ఆస్తులుని కూడా పెట్టాల్సింది పోయి తన కొడుకుల కోసం ఆస్తులు అమ్మవలసిన పరిస్థితి వచ్చింది అని రామరాజు చాలా బాధపడిపోతూ ఉంటాడు. మీరు ఆస్తులను సంపాదించింది ఎవరి కోసం మీ పిల్లల కోసమే కదా మరి ఆ ఆస్తులు వాళ్లకి చెందినవే కాబట్టి వాళ్లకి ఎలాగైనా సరే ఆస్తులు ఇవ్వాలి అని వస్తేఅనుకుంటారు. అయితే వేదవతి ఎంత చెప్పినా కూడా అసలు వినకుండా రామరాజు తన కొడుకులు కోసమే ఇదంతా చేస్తున్న అని బాధపడిపోతూ ఉంటాడు. ఎలాగైనా సరే తన కొడుకులు అప్పులు తీర్చేస్తే తనకు ఎటువంటి బాధ ఉండదు అని రామరాజు ఆలోచిస్తూ ఉంటాడు. మొత్తానికి రామరాజు తన కొడుకులు కోసం కీలక నిర్ణయం తీసుకుంటాడు.
అటు వల్లి తన భర్త కోసం బాధపడిపోతూ ఉంటుంది. నాకు ఇంకొక ఛాన్స్ ఇస్తే నా భర్తకి నేను దగ్గరవుతాను అని అనుకుంటుంది. అయితే వల్లికి ఛాన్స్ ఇవ్వకుండా ఉంటున్నారు. నేను ఇప్పుడు మారితేనే నా జీవితం బాగుంటుంది. నా వాళ్ళందరినీ నేను మోసం చేశాను నేను వాళ్ళందరికీ ద్రోహం చేశాను అని చాలా బాధపడిపోతూ ఉంటుంది.. ఇప్పుడు నా వాళ్ళ నుంచి నేను మంచి దానిలాగా అనిపించుకోవాలి అని ఆలోచిస్తూ ఉంటారు. అటు ఆనంద్ రావు పోలీసులు వల్లి విషయంలో తనని ఇబ్బంది పెడుతున్నారని బాధపడిపోతూ ఉంటాడు. ఏదేం జరిగిన కూడా నా జీవితానికి ఇదొక ఛాన్స్ కాబట్టి నేను ఎలాగైనా సరే మారాలి అని ఆలోచిస్తుంది శ్రీవల్లి..
ప్రేమ ధీరజ్ కోసం ఎదురు చూస్తూ వస్తాడు నా రాజు అంటూ పాటలు పాడుతూ చాలా సంతోషంగా ఉంటుంది. ధీరజ్ రాగానే తనకి ఏదో ఒకటి తెస్తాడు 30 లక్షల తీసుకుని వస్తాడు అని చాలా సంతోషంగా ఎదురు చూస్తూ ఉంటుంది.. కానీ ఈరోజు మాత్రం ఐస్ క్రీమ్ తెచ్చాడు అని తెలుసుకోకుండా 30 లక్షలు తెచ్చావు ఆ భద్రకి వార్నింగ్ ఇచ్చి మరి ఆ 30 లక్షల గురించి నేను కడతాను అని అంటుంది ప్రేమ. నువ్వు అలా తిప్పి తిప్పి తిప్పుతూ ఉంటే ఐస్క్రీం కరిగిపోతుంది అందులో ఉండేది ఐస్ క్రీమ్ ఒకసారి చూసి తిను అనేసి అంటాడు అయితే ప్రేమ మొదట డబ్బులు తీసుకురాలేదని బెట్టి చేసిన కూడా ధీరజ్ వల్ల ఐస్క్రీం తినేస్తుంది..
తర్వాత రోజు ఉదయం రామరాజు స్థలాన్ని అమ్మేందుకు నిర్ణయించుకుంటారు.. బ్రోకర్ని రమ్మని ఎలాగైనా ఆ స్థలాన్ని అమ్మాలి అని అనుకుంటాడు కానీ అసలు అమ్మడానికి ఎవరూ ఒప్పుకోరు. నువ్వు ఆ స్థలాన్ని అమ్మాల్సిన అవసరం లేదు అని ధీరజ్ అంటాడు. అసలు అమ్మకుండా ఎలా తెస్తావ్ రా ఎలా కడతావురా అని అడుగుతాడు. రామరాజు కానీ ధీరజ్ మాత్రం ఏదో ఒకటి చేసి కడతాను అని అంటాడు. అటు సాగర్ కూడా నాకోసం నువ్వు పొలం అమ్మాల్సిన అవసరం లేదు కచ్చితంగా నేనే కడతానని సాగర్ దిగేసి చెప్పేస్తాడు కానీ రామరాజు మాత్రం ధీరజ్ అంటే ఏదో ఒకటి చేసి కడతాడు కానీ నువ్వు ఎక్కడి నుంచి కడతావు. దానికోసం తప్పులు చేస్తావా ఏంటి అని రామరాజు అనగానే సాగర్ సీరియస్ అవుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది రేపటి ఎపిసోడ్లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: పల్లవి రచ్చ.. కమల్ స్ట్రాంగ్ వార్నింగ్.. అవనికి షాక్..