Illu Illalu Pillalu Today Episode September 6th: ధీరజ్ బయట తోరణాలు కడుతూ ఉండగా ఆటోలో నుంచి ఒక అమ్మాయి పరిగెత్తుకుంటూ వస్తుంది అది ఎవరో అని ప్రేమ చూస్తుంది అయితే ధీరజ్ అంటూ అమ్మాయి పరిగెత్తడం చూసిన ప్రేమ ఆ ముగ్దను వ్రతానికి కూడా పిలిచాడు అని చాలా తిట్టేసుకుంటూ ఉంటుంది.. ముద్ద రాగానే ధీరజ్ని కౌగిలించుకొని ఉండటం చూసి అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు. రామరాజు ఫ్యామిలీ అంతా బయటకు వచ్చి అసలు ఏం జరిగింది.. ఎవరు ఈ అమ్మాయి అని అందరికీ అనుమానం వస్తుంది. ధీరజ్ మాత్రం వదిన వాళ్ళ ఫ్రెండ్ అని చెప్పగానే ఇక నర్మదా కూడా తప్ప లేక ఒప్పుకుంటుంది.. ఇక అందరూ కలిసి వ్రతం చేసుకోలేని లోపలికి వెళ్తారు పంతులుగారు రావడంతో వ్రతాన్ని మొదలుపెడతారు…
రామరాజు ముద్ద బయటికి రాగానే ఎవరి అమ్మాయి ఎందుకు నిన్ను ఇలా వాటేసుకుంది అని అడుగుతాడు. కానీ ధీరజ్ మాత్రం ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఉండిపోతాడు. అసలు ఏం జరిగింది ఎవరు ఈ అమ్మాయి ఇంటి బయట ఏంటిది అని రామరాజు ధీరజ్ని సీరియస్గా అడుగుతాడు. వేదవతి అలాగే నర్మదా ఎవరి అమ్మాయి అని ఆలోచిస్తూ ఉంటారు. అప్పుడే ఒక ఆవిడ ఆ అమ్మాయి పేరు ముగ్ద అని అంటారు. ఈ పేరు ఎక్కడో విన్నట్టుందే ఎక్కడ విన్నాము అని ఆలోచిస్తూ ఉంటుంది వేదవతి. కానీ అప్పుడే నర్మదా ఎవరో కాదు బండిమీద నీ సుపుత్రుడు వెనకాల కూర్చొని చక్కర్లు కొట్టింది కదా.. ఆవిడే ఈవిడ అని అనగానే అదేంటి ఇది సడన్గా ఇంటికి వచ్చి ఊడిపోయింది. ఒకవేళ ఆ ప్రేమ చూస్తే ఇంట్లో మంటలు అంటుకుంటాయి అంటూ టెన్షన్ పడిపోతూ ఉంటుంది.
వీళ్ళిద్దరిని ఇలా చూస్తే ప్రేమ చంపేస్తుంది మనల్ని కూడా చచ్చిపోయేలా చేస్తుంది అని వేదవతి ఆలోచిస్తూ ఉంటుంది. అయితే వేదవతి అలా అనిందో లేదో ప్రేమ అప్పటికే ధీరజ్ తో ఉన్న అమ్మాయిని చూసేస్తుంది. అది చూసిన వా నర్మదా నువ్వు ఏమి కంగారు పడొద్దు ఆల్రెడీ నీ కోడలు చూస్తూనే ఉంది ఇప్పుడు కచ్చితంగా పెట్రోల్ బంబులు బయటకు వస్తాయి అంటూ అనగానే వేదవతి టెన్షన్ పడిపోతూ ఉంటుంది. మరి రామరాజుకి ఈ అమ్మాయి ఎవరు అని అనుమానం మొదలవుతుంది. ఆ అమ్మాయి ఎవరో కాదు అని ధీరజ్ మాట్లాడుతుండగా నర్మదా వదిన వాళ్ళ ఫ్రెండ్ అని ధీరజ్ చెప్పగానే ఒక్కసారిగా షాక్ అవుతుంది.. అదేంటి నువ్వు ఎప్పుడు కూరగాయలు కొనడానికి పోవు కదా మరి ఈ అమ్మాయి నీకు ఎలా పరిచయం అని వేదవతి అనగానే నేనే ఒకసారి పరిచయం చేశాను అత్తయ్య అని నర్మదా అంటుంది.
కానీ శ్రీవల్లి మాత్రం నాకు ఎక్కడో తేడా కొడుతుంది.. వీళ్లిద్దరి మధ్య అంత చనువు లేకపోతే ఎందుకు ధైర్సి వచ్చి ఇంతమందిలో వాటేసుకుంటుంది అని శ్రీవల్లి అంటుంది. ధీరజ్ కి ఈ అమ్మాయికి చదువు కాస్త ఎక్కువగానే ఉంది మరి నిజంగానే వీళ్లిద్దరి మధ్య ఆ బంధం ఉందా.. అని డౌట్ గా అంటుంది కానీ నర్మద మాత్రం ఊరుకో అక్క అన్ని నీకు డౌట్లే తను నా ఫ్రెండు అని అంటుంది.. ఇక రామరాజు ఏంటి బయటికి పంచాయతీ పూజకు టైం అయింది పదండి లోపలికి అని అనగానే సరే.. పదండి అని వెళుతూ ఉంటారు కానీ నర్మదా నీ ఫ్రెండ్ ని కూడా లోపలికి తీసుకురమ్మ అని అంటాడు రామరాజు.. ఇంకా అక్కడే ఉన్నావేంటి ఫ్రెండు పదో లోపలికి వెళ్దాం అని తను కూడా లోపలికి తీసుకొని వస్తుంది నర్మదా. శ్రీవల్లికి మాత్రం ఎక్కడో ఒకచోట అనుమానం ఉండనే ఉంటుంది.
రామరాజు ఇంట్లో వరలక్ష్మీ వ్రతం పూజ కోసమని అంత సిద్ధం చేస్తారు.. అయితే అందరూ పూజలు కూర్చొని చాలా సంతోషంగా పూజను పూర్తి చేస్తారు . తమ భర్తలతో ఆశీర్వాదం తీసుకోవాలని మూడు జంటలు అనుకుంటారు.. ఇక అందరూ చాలా సంతోషంగా ఆశీర్వాదం తీసుకున్న తర్వాత ధీరజ్ని తీసుకొని వేదవతి నర్మద ఇద్దరు బయటికి వెళ్లిపోతారు. ప్రేమను పిలిచి వాడి దగ్గర ఆశీర్వాదం తీసుకో అనేసి వేదవతి అంటుంది. కానీ వేదవతి మాత్రం ప్రేమకు ఎంత చెప్పినా కూడా నాకేం వద్దు అని మొండిగా మాట్లాడడంతో ఒక్కసారిగా అరుస్తుంది.. ప్రేమ ముందు నీ భర్తతో నువ్వు ఆశీర్వాదం తీసుకో అక్షింతలు వేయించుకొని వేదవతి చెప్పగానే ప్రేమ తన మాట విని అక్షింతలు వేయించుకొని ఆశీర్వాదం తీసుకుంటుంది. వీళ్ళిద్దరూ ఇలానే కలిసిపోతే బాగుంటుంది అని ఇద్దరు సంతోషంగా అనుకుంటారు అయితే ఇదంతా చూసిన భద్రావతి మాత్రం చాలా సీరియస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..
Also Read :Intinti Ramayanam Today Episode: కన్నతండ్రి మరణం.. కన్నీళ్లు పెట్టుకున్న కమల్.. నిజం చెప్పేస్తాడా..?