E-Paper
Advertisement

Priyanka Jain -Shiva Kumar:  ప్రియాంక జైన్, శివకుమార్ ఎంగేజ్మెంట్.. గుడ్ న్యూస్ చెప్పిన నటి!

Priyanka Jain -Shiva Kumar:  ప్రియాంక జైన్, శివకుమార్ ఎంగేజ్మెంట్.. గుడ్ న్యూస్ చెప్పిన నటి!
Advertisement

Priyanka Jain -Shiva Kumar: బుల్లితెరపై నటీనటులుగా కొనసాగుతూ ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న వారిలో నటుడు శివకుమార్(Shiva Kumar) నటి ప్రియాంక జైన్ (Priyanka Jain)గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ మౌనరాగం అనే సీరియల్ ద్వారా తెలుగు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి సీరియల్ తోనే మంచి ఆదరణ సొంతం చేసుకున్నారు. ఇక ఈ సీరియల్ అనంతరం ప్రియాంక జైన్ జానకి కలగనలేదు అనే సీరియల్ తో మరింత మంది అభిమానులను సొంతం చేసుకున్నారు ఈ సీరియల్ తర్వాత ఈమె బిగ్ బాస్ అవకాశం అందుకున్న సంగతి తెలిసిందే. ఇక ప్రియాంక మౌనరాగం సీరియల్ నటుడు శివకుమార్ తో ప్రేమలో ఉన్న సంగతి తెలిసిందే. ఈ సీరియల్ నుంచి ప్రేమలో ఉన్న ఈ జంట ఇప్పటివరకు పెళ్లి చేసుకోకపోవడంతో తరుచూ వీరు పెళ్లి గురించి ఎన్నో రకాల విమర్శలు ప్రశ్నలు ఎదురయ్యాయి.

గుడ్ న్యూస్ సూన్

ఇలా వీరి పెళ్లి గురించి ఎన్నో సందర్భాలలో ప్రశ్నలు ఎదురైనప్పటికీ ఈ జంట మాత్రం పెళ్లికి సంబంధించి ఇప్పటివరకు గుడ్ న్యూస్ చెప్పలేదు. ప్రస్తుతం వీరిద్దరూ తమ కెరియర్ పరంగా సీరియల్స్ వెబ్ సిరీస్లలో నటిస్తూ బిజీగా ఉన్నారు. అయితే ప్రియాంక జైన్ బిగ్ బాస్ అనంతరం ఎలాంటి సీరియల్ కు కమిట్ అవ్వకపోయినా వెబ్ సిరీస్ లలో, బుల్లితెర కార్యక్రమాలలో సందడి చేస్తున్నారు. ఇక యూట్యూబ్ ఛానల్ ద్వారా తమకు సంబంధించిన అన్ని విషయాలను అభిమానులతో పంచుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ జంట సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు .ఇందులో భాగంగా ప్రతి ఒక్కరు ఇంకా ఎందుకు పెళ్లి చేసుకోలేదు అంటూ తమ పెళ్లి గురించి అడుగుతున్నారు. కానీ దేవుడికి కొద్ది రోజులు వెయిట్ చేయమని చెప్పారు అంటూ ఒక ఫన్నీ రీల్ షేర్ చేశారు.

Advertisement

ఈ రీల్ షేర్ చేస్తూ ఈమె “గుడ్ న్యూస్ సూన్” అంటూ రింగ్ ఉన్న ఒక ఎమోజినీ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఈమె ఇలా గుడ్ న్యూస్ చెబుతూ ఉంగరం ఉన్న ఎమోజిని షేర్ చేశారంటే త్వరలోనే వీరిద్దరూ నిశ్చితార్థం(Engagment) జరుపుకోబోతున్నారని స్పష్టం అవుతుంది అంటూ ఈ జంటకు అభినందనలు తెలియజేస్తున్నారు. అతి త్వరలోనే నిశ్చితార్థం చేసుకోబోతున్న ఈ జంట వెంటనే పెళ్లి తేదీని కూడా ప్రకటిస్తే బాగుంటుందని అభిమానులు కోరుకుంటున్నారు. మరి ఆ శుభవార్తను ఎప్పుడూ చెబుతారో తెలియాల్సి ఉంది.ఇక ప్రియాంక ప్రస్తుతం బుల్లితెర సీరియల్స్ కు దూరంగా ఉన్నప్పటికీ శివకుమార్ మాత్రం స్టార్ మా లో నిన్ను కోరి అనే సీరియల్ లో నటిస్తున్నారు .ఈ సీరియల్ మంచి ఆదరణ సొంతం చేసుకుంది. ఈ సీరియల్స్ తో పాటు షార్ట్ ఫిలిమ్స్ కూడా చేస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Also Read: MSVPG Film: ఏపీలో ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ కు పెరిగిన టికెట్ రేట్లు ..

Related News

క్యాస్టింగ్ కౌచ్‌పై ఝాన్సీ ఏమన్నారంటే.. ఇండస్ట్రీలో మహిళల పరిస్థితి ఇదేనా?

సలార్‌లో ఛాన్స్ కోసం ఝాన్సీ ఏం చేశారో తెలుసా?

ఆ రోజు షూటింగ్‌లో ఏం జరిగిందంటే.. ఝాన్సీ కన్నీటి కథ!

సుధీర్ కామెడీకి ఫిదా అవ్వాల్సిందే.. ఇస్మార్ట్ బతుకమ్మలో ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్!

జాను లిరి ఒక్క పాటకు ఎంత తీసుకుంటుందో తెలుసా?

యూట్యూబర్ నందనకి కోర్టులో భారీ ఊరట.. సంచలన పోస్ట్ వైరల్!

Telugu Tv Serials : బిగ్ బాస్ ఎఫెక్ట్.. ఆ సీరియల్స్ కు శుభం కార్డు పడినట్లే..?

ఒక్కరోజులో మారిపోయిన లెక్కలు..ఆరో వారం ఊహించని ఎలిమినేషన్ ట్విస్ట్..!

Big Stories

Advertisement
×