E-Paper
Advertisement

MSVPG Film: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మూవీ టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి

MSVPG Film: ‘మన శంకర్ వరప్రసాద్ గారు’ మూవీ టికెట్ ధరలు పెంచేందుకు ప్రభుత్వం అనుమతి
Advertisement

MSVPG Film:  చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన తాజా చిత్రం “మన శంకర వరప్రసాద్ గారు”(MSVPG). ఈ సినిమా సంక్రాంతి పండుగను పురస్కరించుకొని జనవరి 12వ తేదీ ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైంది. ఇక 11వ తేదీ సాయంత్రం నుంచి ప్రీమియర్లు ప్రసారం కాబోతున్నాయి .ఈ నేపథ్యంలోనే సినిమా విడుదలకు అన్ని ఏర్పాట్లను పూర్తి చేస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఈ సినిమాకు టికెట్ ధరలను(Ticket Price) పెంచుతూ ఏపీ ప్రభుత్వాన్ని కోరగా అందుకు ఏపీ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి మన శంకర వరప్రసాద్ గారికి ఏపీలో ఏ స్థాయిలో టికెట్ ధరలు పెరిగాయనే విషయానికి వస్తే..

ఏపీలో పెరిగిన టికెట్ ధరలు..

ఈ సినిమా జనవరి 11వ తేదీ నుంచి ప్రీమియర్లు ప్రసారం కానున్నాయి . ఇలా ప్రీమియర్లకు జీఎస్టీ లతో కలిపి 500 రూపాయల టికెట్ ధరలను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక సినిమా 12వ తేదీ విడుదల కాగా 12వ తేదీ నుంచి పది రోజులపాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100లను పెంచగా, మల్టీప్లెక్స్ లలో రూ. 120 పెంచుతూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ పెరిగిన ధరలు జనవరి 12వ తేదీ నుంచి పది రోజులు పాటు అమలులో ఉండబోతున్నాయి. ఈ సినిమా ప్రీమియర్లతో పాటు టికెట్ ధరలను పెంచుతూ ఏపీ ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు రావడంతో మెగా అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

తెలంగాణలో టికెట్ ధరలు పెరగనున్నాయా?

Advertisement

ఇక ఈ సినిమాకు తెలంగాణలో టికెట్ ధరలు పెరుగుతాయా? లేదా? అనేది తెలియాల్సి ఉంది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం సినిమా టికెట్ ధరలను పెంచమని కోరుతూ ఎవరు తమ వద్దకు రావద్దని తేల్చి చెప్పింది . ఇటీవల ప్రభాస్ హీరోగా నటించిన ది రాజా సాబ్ సినిమాకు టికెట్ల రేట్లు పెంచడంతో కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు చెప్పిన లెక్కలేకుండా సినిమా టికెట్ల రేట్లు పెంచడం ఏంటి అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే తదుపరి విడుదల కాబోయే మన శంకర వరప్రసాద్ గారు సినిమాకు టికెట్ ధరలు పెరుగుతాయా లేదా అన్నది తెలియాల్సి ఉంది.

ట్రెండింగ్ లో హుక్ స్టెప్స్..

Advertisement

ఇక మన శంకర వరప్రసాద్ గారు సినిమా విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి డైరెక్షన్లో రాబోతున్న ఈ సినిమా ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది. చిరంజీవి నయనతార హీరో హీరోయిన్లుగా నటించిన ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్ కూడా నటించారు. వెంకటేష్ వెంకీ గౌడ  అనే పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఈ సినిమా నుంచి విడుదల చేసిన అప్డేట్స్ సినిమా పట్ల మంచి అంచనాలనే పెంచేసాయి. ఇటీవల ట్రైలర్ విడుదల చేయగా మంచి ఆదరణ లభించింది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విడుదల చేసిన “హుక్ స్టెప్స్” సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ పాట పెద్ద ఎత్తున వైరల్ అవ్వడమే కాకుండా ఎంతో మంది ఈ పాటకు రీల్స్ చేయటం విశేషం. మరొక రెండు రోజులలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం మెగా అభిమానులు కూడా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

Also Read: Sameera Sharif: నాపై కో*రి*కలు తీర్చుకున్నాడు… చిన్నప్పుడే లైంగిక వేధింపులపై సీరియల్ నటి

Related News

బీజేపీపికి నటుడు నరేష్ వార్నింగ్.. పెట్రోల్ విషయంలో ఆ తప్పు చెయ్యొద్దు.. పోస్ట్ వైరల్..

హిట్ కొట్టిన రోజా,నాగదుర్గ.. పాపం ఐశ్వర్య, లయ!

నేషనల్ అవార్డు విన్నింగ్ పై మెగాస్టార్ ట్వీట్.. నిహారిక క్రేజీ కామెంట్స్!

కన్నీటి పర్యంతమవుతున్న ‘మహారాజ’ బ్యూటీ.. అసలేం జరిగిందంటే?

డ్యాన్స్ మాస్టర్స్ అసోసియేషన్ వివాదం..ఫిలిం ఫెడరేషన్ అత్యవసర సమావేశం!

ఉత్తమ బాలల చిత్రంగా నేషనల్ అవార్డు అందుకున్న తొలి తెలుగు చిత్రం ఏంటో తెలుసా?

నేషనల్ అవార్డ్స్ రేసులో ధనుష్ రికార్డ్… ‘కలాం’ బయోపిక్‌పై హైప్!

ఆ హీరోతో అనుపమ పరమేశ్వరన్ బ్రేకప్?

Big Stories

Advertisement
×