Jasprit Bumrah: టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) సరికొత్త వివాదంలో చిక్కుకున్నాడు. అతనికి సంబంధించిన ఓ హాట్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. తన భార్యకు తెలియకుండా సెకండ్ సెటప్ పెట్టినట్లు కొంత మంది ప్రచారం చేస్తున్నారు. వేరే అమ్మాయితో టీమిండియా స్టార్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా క్లోజ్ గా కనిపించిన ఫోటో ఇప్పుడు నెట్టింట వైరల్ గా మారింది. దీంతో బుమ్రాపై దారుణంగా ట్రోలింగ్ జరుగుతుంది. సంజనా గణేషన్ ( Sanjana Ganesan ) లాంటి మంచి అమ్మాయిని కాదని, మరో అమ్మాయితో జస్ప్రీత్ బుమ్రా రిలేషన్ పెట్టుకుంటాడని ఫైర్ అవుతున్నారు ఫ్యాన్స్.
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) మరో అమ్మాయితో దిగిన ఫోటో వైరల్ గా మారింది. ఆ అమ్మాయి ఎవరో కాదు జూలీ లారియోస్ (Julie Larios). ఆమె ప్రముఖ సింగర్ అని తెలుస్తోంది. అయితే సంజనా గణేషన్ ను పెళ్లి చేసుకోక ముందు, జూలీ లారియోస్ తో బుమ్రా రిలేషన్ పెట్టుకున్నాడట. వీళ్ళిద్దరూ దాదాపు మూడు సంవత్సరాలు లివింగ్ రిలేషన్ షిప్ లో ఉన్నట్లు కూడా చెబుతున్నారు. ఈ సందర్భంగా ఆమెతో క్లోజ్ గా దిగిన ఫోటో ఇప్పుడు బయటకు వచ్చింది. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెకు బ్రేకప్ చెప్పిన బుమ్రా, ఆ తర్వాత సంజనా గణేషన్ ( Sanjana Ganesan) ను పెళ్లి చేసుకున్నాడు.
టీమిండియా స్టార్ క్రికెటర్ జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah ) అలాగే సంజనా గణేషన్ ( Sanjana Ganesan ) ఇద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. వీళ్ళిద్దరూ గోవాలో చాలా సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నారు. సాంప్రదాయ బద్దంగా సిక్కు ఆచారం ప్రకారం గోవాలో పెళ్లి చేసుకున్నారు. 2021 మార్చి 15వ తేదీన వీళ్ళ వివాహం కొద్ది మంది సమక్షంలోనే జరిగింది. కేవలం కుటుంబ సభ్యులు అలాగే సన్నిహితులు మాత్రమే హాజరయ్యారు. ఇక ఇటీవల ఈ జంటకు అబ్బాయి కూడా పుట్టాడు. అతనికి అంగద్ బుమ్రా అని నామకరణం చేశారు. ఇతను 2023 సెప్టెంబర్ నాలుగో తేదీన జన్మించాడు. బుమ్రా (Jasprit Bumrah ) భార్య సంజనా గణేషన్ ( Sanjana Ganesan ) యాంకర్ గా పనిచేస్తున్న సంగతి తెలిసిందే. కేవలం క్రికెట్ టోర్నమెంట్లలో మాత్రమే ఆమె కనిపిస్తూ ఉంటుంది. విదేశాల్లో కూడా జరిగే ఈవెంట్లకు వెళుతుంది. ఇటు ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్ లో కూడా మెరుస్తుంది సంజనా గణేషన్. అటు జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah )టీమ్ ఇండియాలో కీలక ప్లేయర్ గా కొనసాగుతున్న సంగతి తెలిసిందే.
Who's this girl with Jasprit Bumrah 👀
His ex? pic.twitter.com/Bs5HqvdnFs— Kusha Sharma (@Kushacritic) January 9, 2026