E-Paper
Advertisement

తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!

తాత గారితో పందెం సీక్రెట్ బయటపెట్టిన రామోజీరావు మనవడు..!
Advertisement

Ramoji Rao:ఈటీవీలో ప్రసారమవుతున్న ‘ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2’ తాజాగా విడుదల చేసిన ప్రోమో నెట్టింట తీవ్రంగా వైరల్ అవుతోంది. ఈ ప్రత్యేక షోలో సుధీర్ తనదైన కామిక్‌తో పాటు ఆషు రెడ్డి, స్రవంతిలతో ఆడించే ఆటలు ఆకట్టుకున్నాయి. ఈ వేదికపై సీనియర్ నటి యమునతో పాటు రాజా రవీంద్ర, సమీర్, రూపాదేవి, ప్రీతి నిగమ్ వంటి నటులు సందడి చేశారు. ఈ క్రమంలో ఈటీవీ వ్యవస్థాపకులు దివంగత రామోజీరావు మనవడు, సుమన్ కుమారుడు సుజయ్ చెరుకూరి ముఖ్య అతిథిగా హాజరై తన తాతగారితో ఉన్న ఆసక్తికరమైన పందెం సీక్రెట్‌ను బయటపెట్టారు. ఆ విశేషాలు చూద్దాం..

ఈటీవీ వేదికపై సీనియర్ నటుల సందడి – సుధీర్ ఫన్:

‘ఫ్యామిలీ స్టార్స్ సీజన్ 2’ ప్రోమో ప్రారంభంలో సుధీర్‌ను ఆటపట్టించడంతో సందడి మొదలైంది. ఈటీవీ పాత సీరియల్స్, సినిమాల్లో నటించిన యమున, రాజా రవీంద్ర, సమీర్, రూపాదేవి, ప్రీతి నిగమ్ వంటి ప్రముఖులు వేదికపైకి వచ్చి పాత జ్ఞాపకాలను నెమరువేసుకున్నారు. అలాగే సుధీర్, ఆషు రెడ్డి, స్రవంతిలతో కలిసి ఆడిన సరదా ఆటలు ప్రేక్షకులను బాగా నవ్వించాయి.

నటి యమున ఎమోషనల్ – సుమన్ జ్ఞాపకాలు:

Advertisement

ఈ వేదికపై సీనియర్ నటి యమున మాట్లాడుతూ చాలా భావోద్వేగానికి లోనయ్యారు. “నాకు ఎప్పుడు పని కావాలన్నా వెనుకాడకుండా అవకాశమిచ్చిన ఏకైక వ్యక్తి సుమన్ గారే” అని చెప్పగా, సుధీర్ మీకోసం ఒక సర్‌ప్రైజ్ ఉందంటూ రామోజీరావు మనవడు, సుమన్ కుమారుడైన సుజయ్ చెరుకూరిని వేదికపైకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా సుమన్ వ్యక్తిత్వం, ఈటీవీకి ఆయన అందించిన సేవలను నటీనటులంతా కొనియాడారు.

తాతగారితో రూ.10 పందెం సీక్రెట్ బయటపెట్టిన సుజయ్:

వేదికపైకి వచ్చిన సుజయ్ తన తాత రామోజీరావుతో ఉన్న మధురమైన జ్ఞాపకాలను పంచుకున్నారు. “మా ఇద్దరి మధ్య ఒక ఆసక్తికరమైన పందెం నడిచేది. తాతగారు తన మాటల్లో ఏదైనా ఇంగ్లీష్ పదం వాడితే నాకు 10 రూపాయలు ఇవ్వాలి, ఒకవేళ నేను ఇంగ్లీష్ వర్డ్ వాడితే తాతగారికి 5 రూపాయలు ఇవ్వాలి. అలా పందెం కాస్తూనే నేను చాలా కొత్త తెలుగు పదాలు నేర్చుకున్నాను” అని చెప్పడంతో ప్రాంగణమంతా నవ్వులతో నిండిపోయింది.

Advertisement

also read:ఆర్ట్ డైరెక్టర్ కొడుకు అరెస్ట్.. పవన్ కళ్యాణ్ స్పందిస్తారా?

నాన్న సుమన్ తో ఉన్న యాక్షన్ సీన్ జ్ఞాపకం:

అలాగే తన తండ్రి దివంగత సుమన్ గురించిన విషయాలను కూడా సుజయ్ గుర్తుచేసుకున్నారు. “నాన్నగారు ప్రతీ సినిమాను ఎంతో ఎమోషనల్‌గా చేసేవారు. సినిమాల్లో ఫైట్స్ తక్కువగా ఉండటంతో.. మీరు కూడా రౌడీలను కొట్టేలా మాస్ ఫైట్ చేయొచ్చు కదా అని అడిగితే, నీకోసం మంచి యాక్షన్ కథ రాస్తానని నవ్వుతూ చెప్పేవారు” అని ఎమోషనల్ అయ్యారు.

బుల్లితెరపై చెరగని ముద్ర వేసిన చెరుకూరి సుమన్ జ్ఞాపకాలను స్మరించుకుంటూ, రామోజీరావు మనవడు ఈటీవీ కుటుంబంతో వేదికను పంచుకోవడం అందరినీ ఆకట్టుకుంది. ఇక తన తాతగారితో ఉన్న చిన్ననాటి పందెం ముచ్చట్లు, తండ్రి జ్ఞాపకాలను షేర్ చేసుకున్న ఈ ప్రోమో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఆడియన్స్‌ను ఎంతగానో అలరిస్తోంది.

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×