E-Paper
Advertisement

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!

కరెన్సీ నోట్లపై గీతలకు ఇంత అర్థముందా? ఇన్నాళ్లు పిచ్చి గీతలు అనుకున్నామే..!
Advertisement

Currency Note Lines: సాధారణంగా కరెన్సీ నోట్లపై ఉండే చిన్న చిన్న గీతలను మనం తరచూ చూస్తూనే ఉంటాం. అయితే చాలామంది ఇవి కేవలం అందమైన డిజైన్ కోసం ముద్రించారని భావిస్తుంటారు. మరికొందరు ముద్రించే క్రమంలో పడిన  అలా మీరు అనుకుంటే పప్పులో కాలేసినట్లే. ఎందుకంటే ఈ గీతలు ముద్రించడం వెనుక పెద్ద కారణమే ఉంది. నిత్య జీవితంలో ఉపయోగించే రూ.100, రూ.200, రూ.500 నోట్ల అంచులపై ఉండే ఆ గీతల వల్ల కలిగే ప్రయోజనం ఏంటో ఈ ప్రత్యేక కథనంలో చూద్దాం.

స్పర్శతోనే గుర్తు పట్టొచ్చు..!

నోట్లపై ఈ ప్రత్యేక గుర్తులను ‘బ్లీడ్ లైన్స్’ (Bleed Lines) లేదా స్పర్శ గుర్తులు అని పిలుస్తారు. దృష్టి లోపం ఉన్నవారు లేదా చూపులేని వ్యక్తులు ఇతరుల సహాయం లేకుండా కేవలం చేతి వేళ్లతో తాకి (స్పర్శ ద్వారా) నోటు విలువ ఎంతో సులభంగా తెలుసుకోవడానికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఈ ఏర్పాట్లు చేసింది. ప్రతి నోటుపై ఉండే ఈ గుర్తులు వేర్వేరు రకాలుగా అమర్చబడి ఉంటాయి.

ఏ నోటుపై ఎలాంటి గుర్తులుంటాయి?

Advertisement

రూ.100 నోటుకు రెండు వైపులా అంచుల్లో నాలుగు వాలు (slanting) గీతలు ఉంటాయి. అదే రూ.200 నోటు అయితే.. నాలుగు వాలు గీతలతో పాటు వాటి మధ్యలో రెండు చిన్న సున్నాలు (Circles) కూడా ఉంటాయి. ఇక రూ.500 నోటుకు వస్తే.. ఇరువైపులా ఐదు వాలు గీతలు వేళ్లకు స్పష్టంగా తగిలేలా ముద్రించారు. వీటి ఆధారంగా అంధులు.. కళ్లతో చూడలేకపోయినా ఆ నోటు విలువ ఎంతో ఈజీగా గుర్తుపట్టేందుకు వీలు కలుగుతుంది.

Also Read: 23 రోజుల్లో 9 చలాన్లు.. రూ.56 వేల జరిమానా.. నోయిడా రేప్ బస్సు పాపాల చిట్టా!

ఎవరిపై ఆధారపడక్కర్లేదు!

Advertisement

సాధారణ పౌరులకు ఈ గీతలతో పెద్దగా అవసరం ఉండదు కాబట్టే మెజారిటీ ప్రజలకు వీటి గురించి తెలియదు. అయితే దృష్టి లోపం ఉన్నవారికి మాత్రం ఇది ఎంతో ఉపయోగకరంగా ఉంటోంది. ఇతరులపై ఆధారపడకుండా నోటును గుర్తించేందుకు ఈ గీతలు వారికి సహాయపడుతున్నాయి. ఒకవేళ ఈ గీతలు లేని పక్షంలో అంధులు నోట్లను గుర్తించేందుకు ఇతరులపై ఆధారపడాల్సి వస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇతరులు ఆ డబ్బుతో పరారయ్యే ప్రమాదం కూడా ఉంటుందని గుర్తించి.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇలాంటి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకుంది.

Also Read: పాక్‌లో ఘోరం.. 125 ఏళ్ల నాటి ఆలయం కూల్చివేత.. రగిలిపోతున్న హిందువులు!

Tags

Related News

ఫుడ్ లవర్స్‌కు క్రేజీ ఆఫర్.. SBI ఎటర్నల్ కార్డ్ లాంచ్.. ఉచితంగా జొమాటో గోల్డ్ సేవలు!

బంగారం-వెండి వస్తువుల ఎగుమతులపై కేంద్రం కీలక నిర్ణయం

చిన్న వయసులోనే కోటీశ్వరుడు అవ్వడం ఎలా? ఇదిగో అత్యుత్తమ ప్లాన్.. రూ.10 వేలు ఉంటే చాలు!

పోటీకి మేం సిద్ధమే.. మస్క్ ఆరోపణలపై రిలయన్స్ స్ట్రాంగ్ కౌంటర్

మధ్యతరగతి రిటైర్మెంట్ కోసం రూ.1 కోటి సరిపోతుందా? భవిష్యత్తు కోసం మేజిక్ ఫిగర్ ఎంత?

భార్య లోన్ కట్టకపోతే భర్త పెన్షన్ డబ్బులు కట్ చేసిన బ్యాంక్.. కోర్టు తీర్పు ఇదే

తప్పుడు అకౌంట్‌కు యూపీఐ మనీ ట్రాన్స్‌ఫర్ అయిందా? డబ్బులు వెనక్కి రావాలంటే ఇలా చేయండి!

డబ్బులు కావాలని ఫోన్ చేస్తే.. బంధువులు, స్నేహితులకు ‘నో’ చెప్పడం ఎలా?

Big Stories

Advertisement
×