E-Paper
Advertisement

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం

మెదక్ జిల్లాలో వింత ఘటన.. కుక్క పిల్లలకు పాలిస్తున్న వరాహం
Advertisement

Pig Mother: సాధారణంగా కుక్కలు, పందులు ఒకదానికొకటి దూరంగా ఉండే జంతువులు. కుక్కలు పందులపై దాడి చేయడం. వాటిని చూసి పందులు పరుగులు తీయడం మనం తరచూ చూస్తుంటాం. కానీ నర్సాపూర్‌లో మాత్రం ఇందుకు పూర్తి భిన్నమైన ఘటన చోటుచేసుకుంది.

తల్లి లేని ఆ కుక్క పిల్లలు..

నర్సాపూర్ మున్సిపల్ పరిధిలోని 15వ వార్డు మన్నెవారి వీధిలో ఓ వరాహం కుక్క పిల్లలకు తల్లిగా మారింది. కుక్క పిల్లలకు జన్మనిచ్చిన తల్లి కుక్క కొన్ని రోజుల క్రితం మృతి చెందడంతో.. తల్లి లేని ఆ కుక్క పిల్లలు ఆకలితో అలమటిస్తున్నాయి. ఈ పరిస్థితిని చూసిన ఓ వరాహం.. ఆ కుక్క పిల్లలను అక్కున చేర్చుకుని, వాటికి తన పాలు ఇస్తూ మాతృత్వాన్ని చాటుతోంది. గత నాలుగు రోజులుగా వరాహం కుక్క పిల్లలకు క్రమం తప్పకుండా పాలు ఇస్తున్నట్లు స్థానికుడు సుధీర్ కుమార్ గౌడ్ తెలిపారు.

Advertisement

Also read: హాట్ సీన్స్… అంతకుమించిన థ్రిల్… యూత్‌కి పూనకాలు తెప్పించే బోల్డ్ ఎరోటిక్ కామెడీ డ్రామా

స్థానికులు ఆశ్చర్యం..

సాధారణంగా జంతువుల మధ్య కనిపించే సహజ విరోధానికి భిన్నంగా.. ఈ వరాహం కుక్క పిల్లలను తన పిల్లలుగా భావించి ఆదుకోవడం స్థానికులను ఆశ్చర్యానికి గురిచేసింది. ఈ అరుదైన దృశ్యాన్ని చూసిన కాలనీవాసులు.. జంతువుల్లోనూ ప్రేమ, ఆప్యాయత, మాతృత్వానికి జాతి భేదాలు అడ్డుకావని ఈ ఘటన మరోసారి నిరూపించిందని అంటున్నారు. తల్లి కోల్పోయిన కుక్క పిల్లలకు.. మరో జాతికి చెందిన వరాహం తల్లిగా మారిన ఈ ఘటన ప్రస్తుతం నర్సాపూర్‌లో చర్చనీయాంశంగా మారింది.

Advertisement

Also read: ఈ వారం ఓటీటీలో పండగే పండగ… తెలుగులో ఏకంగా 6 సూపర్ హిట్ సినిమాలు

Tags

Related News

ఎల్‌నినో ఎఫెక్ట్‌.. తెలుగు రాష్ట్రాలకు రానున్న అతిపెద్ద గండం ఇదే?

భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో వింత దృశ్యం.. మిరప తోటల్లో సినీ తారల ఫ్లెక్సీలు!

కళ్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు!

నకిలీ యూఎల్‌సీ పత్రాలతో రిజిస్ట్రేషన్లు దందా కలకలం

తెలంగాణ సర్కార్ సంచలన నిర్ణయం.. మారనున్న ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు!

తెలంగాణలో హ్యుందాయ్ బిగ్ ప్లాన్.. రూ.8,528 కోట్లతో మెగా ప్రాజెక్ట్.. సీఎం రేవంత్ కీలక విజ్ఞప్తి!

నీ డేటా మొత్తం నా దగ్గర ఉంది పరేషాన్ కాకు.. కేటీఆర్‌ పై గజ్జెల కాంతం ఫైర్!

కరవు కట్టడి చర్యల్లో.. సీఎం రేవంత్ అట్టర్ ఫ్లాప్.. ప్రభుత్వంపై విరుచుకుపడ్డ కవిత!

Big Stories

Advertisement
×