Kissik Talks:ప్రస్తుతం తనవైన ఫోక్ సాంగ్స్ తో యూట్యూబ్ ని షేక్ చేస్తున్న రాము రాథోడ్ తాజాగా బిగ్ టీవీ ‘కిసిక్ టాక్స్’ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు.బిగ్‌బాస్ హౌస్‌లో తన అనుభవాలు, తనతో పాటు ఉన్న కంటెస్టెంట్లతో ఉన్న అనుబంధం గురించి పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు.
మనుషుల నిజ స్వరూపాలు అర్థమయ్యాయి
బిగ్‌బాస్ హౌస్ తనకు జీవితంలో ఎన్నో పాఠాలు నేర్పిందని ఆయన తెలిపాడు. హౌస్‌లో ఉన్నప్పుడు ఎవరు ఎన్ని తిట్టినా, ఇబ్బంది పెట్టినా ఏం బాధ పడలేదని, అయితే అక్కడి నుండి బయటికి వచ్చేస్తా అనడానికి కారణం మాత్రం తనకి తన కుటుంబం గుర్తురావడమే అని తెలిపాడు.ఇక బిగ్‌బాస్‌లోకి వెళ్లాక మనుషుల నిజ స్వరూపాలు అర్థమయ్యాయని, మన ముందోలా, వెనుక మరోలా మాట్లాడేవారిని, అవసరం ఉన్నంతవరకే వాడుకుని ఆ తర్వాత పట్టించుకోని వ్యక్తులను దగ్గరగా చూశానని బిగ్ బాస్ రోజులని గుర్తు చేసుకున్నాడు. అక్కడ ఎదురయ్యే ప్రెజర్ ని తట్టుకుని నిలబడేవారే జీవితంలోనూ ఎదుగుతారని తన అభిప్రాయాన్ని తెలిపాడు.
ఇక హౌస్ నుంచి బయటకు వచ్చాక కూడా తనూజ, రీతు, డెమోన్ పవన్‌లతో తన బాండింగ్ కొనసాగుతోందని తెలిపాడు. తన పాటలు విడుదలైనప్పుడు తనూజ పూర్తి సపోర్ట్ అందిస్తుందని, రీతు, డెమోన్‌లతో కూడా సాధారణంగానే కలుస్తుంటానని చెప్పాడు. అయితే రీతు, డెమోన్ పవన్ అనుబంధంపై సోషల్ మీడియాలో జరుగుతున్న ట్రోలింగ్‌పై తనదైన శైలిలో మండిపడ్డాడు రాథోడ్.
స్నేహమా లేక మరేదైనా బాండింగా
వారిద్దరి మధ్య ఉన్నది స్నేహమా లేక మరేదైనా బాండింగా అనేది పూర్తిగా వారి పర్సనల్ అని,దాంట్లో ఇతరులు జోక్యం చేసుకోవడం మంచిది కాదని సూచించాడు.ఇక సెలబ్రిటీలైనంత మాత్రాన వారికి మనసు, భావాలు ఉండవా అని మండిపడ్డాడు.చిన్న చిన్న విషయాలను పెద్దది చేసి సోషల్ మీడియాలో రచ్చ చేయడం వల్లే వారి పర్సనల్ లైఫ్స్ ఇబ్బందుల్లో పడతాయనిఏదైనా ఉంటే వాళ్లే మాట్లాడుకుని పరిష్కరించుకుంటారని స్పష్టం చేశాడు.
బిగ్‌బాస్ మరింత ప్లస్
ఇక ఫోక్ సింగర్‌గా ఇప్పటికే మంచి పేరు ఉన్నప్పటికీ, బిగ్‌బాస్ షో తన కెరీర్‌కు మైనస్ కాదని, మరింత ప్లస్ అయిందని బిగ్‌బాస్ గురించి చెప్పుకొచ్చాడు.బయట చాలామంది తనను ‘బిగ్‌బాస్ రాము రాథోడ్’ అని గుర్తుపడుతున్నారని, హౌస్‌లో తన సరదాగా ఉండే బిహేవియర్ ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయని చెప్పాడు .
ఇకపొతే బిగ్‌బాస్ హౌస్‌లో రూ.15 లక్షల ఆఫర్ తీసుకుని బయటకు వచ్చిన కంటెస్టెంట్ మంచి నిర్ణయం తీసుకున్నాడని ఆకాశానికి ఎత్తేశాడు.ఇక షోలో ఒక్కొక్కరి పరిస్థితి, ఫ్యాన్ ఓటింగ్, గెలిచే అవకాశాలపై ఉండే అంచనాలు వేరుగా ఉంటాయని తన అభిప్రాయాన్ని బయటపెట్టాడు.
అయితే ఆ సమయంలో ఆ కంటెస్టెంట్ తీసుకున్న నిర్ణయం అతని పరిస్థితికి తగ్గట్టు సరైనదే అయి ఉంటుందని అన్నాడు. దాన్ని ప్రేక్షకులు ఎవరి కోణంలో వారు అర్థం చేసుకుంటారని చెప్పాడు. మొత్తానికి బిగ్‌బాస్ ఎక్స్పీరియన్స్ అనేది తనకు సొసైటీని, అలాగే మనుషులను మరింత స్పష్టంగా అర్థం చేసుకోవడానికి ఉపయోగపడ్డాయని ఈ ఇంటర్వ్యూ చెప్పుకొచ్చాడు ఈ ట్రెండింగ్ ఫోక్ సింగర్ !