Kissik Talks:రాను బొంబాయికి రాను అంటూ సెన్సేషన్ క్రియేట్ చేసిన ఫోక్ సింగర్ రాము రాథోడ్ బిగ్ టీవీ ‘కిసిక్ టాక్స్’ ఇంటర్వ్యూలో పాల్గొని సందడి చేశాడు.ఈ క్రమంలో తన చిన్నతనంలో ఎదురైన అవమానాలు గురించి,అలాగే తన అభిమాన నటుడి గురించి, ప్రేమ గురించి మనసు విప్పి మాట్లాడాడు .
తన తండ్రి మేస్త్రీగా పనిచేసేవారని, ఆ కారణంగా చిన్నతనంలో తమ కుటుంబాన్ని కొందరు చులకనగా చూశారని గుర్తుచేసుకున్నాడు. ఇక తన బంధువులు కూడా సరిగా పట్టించుకోలేదని, ఆ పరిస్థితులే తనను బాగా డిస్టర్బ్ చేశాయని, ఒకరోజు తన తండ్రిని అందరి మధ్య గౌరవంగా కూర్చోబెట్టాలనే పట్టుదల పెంచుకున్నానని తెలిపాడు.
ఒకప్పుడు అవమానించిన వారే
ఆ కసితోనే కష్టపడి ఈ స్థాయికి వచ్చానని, నిద్ర కూడా లేని రాత్రులు ఎన్నో గడిపానని చెప్పాడు రాము రాథోడ్ .ఇకపొతే ఒకప్పుడు అవమానించిన వారే, ఇప్పుడు తన తండ్రి బుల్లెట్‌పై వెళ్తుంటే వేరేలా చూస్తున్నారని, మనిషి విలువను డబ్బుతో కొలవడం కరెక్ట్ కాదని, కష్టకాలంలో నిలబడే మనుషులే నిజమైన సంపద అని అన్నాడు.
ఇక తెలుగు నేటివిటీని చాటే జానపద పాటలే తనకు అన్నం పెట్టాయని, అందుకే ఫోక్ సాంగ్స్‌ను ఎప్పటికీ మరిచిపోనని చెప్పాడు. అయితే కేవలం ఫోక్ సింగర్‌గానే కాకుండా భవిష్యత్తులో ఒక మంచి సినిమా చేయాలనే కల ఉందని తెలిపాడు. ఇక మెగాస్టార్ చిరంజీవి అంటే తనకు ఎంతో ఇష్టమని, ఆయన ‘ఠాగూర్’ సినిమా తనకు చాలా ఇష్టమని, ఆయన గ్రేస్, డ్యాన్స్ మూమెంట్స్ చూసే ఎంతో నేర్చుకున్నానని చెప్పడం విశేషం.
మంగ్లీతో బాండింగ్ గురించి
ఇక ఫోక్ సింగర్ మంగ్లీతో తన అనుబంధం గురించి చెబుతూ ఆమె తనకి ఒక అక్కలాగా అని ఈ మధ్యే ఇద్దరం కలిసి ఒక ఈవెంట్ లో కూడా పాల్గొన్న విషయాన్ని గుర్తుచేసుకున్నాడు.ఇక మంగ్లీ గొంతులో జోష్ ఉంటుందని ఆమె పాడటం వింటే ఎనర్జీ వస్తుందని ,సంగీతం నేర్చుకోవాలని, తనకు వచ్చిన అవకాశాన్ని కాపాడుకోవాలని, జీవితానికి సంబంధించిన విషయాల్లో మంగ్లీ సలహాలు ఇస్తుంటారని చెప్పుకొచ్చాడు.
తన ఊరి కోసం ఏదైనా చేయాలనే ఆలోచన
ఇక తన ఊరి కోసం ఏదైనా చేయాలని అనుకుంటున్నానని, తన ఊరివారు తనకు ఎంతో సపోర్ట్ చేశారని, అయితే ఊరి కోసం ఏదైనా చేయాలనుకున్నప్పుడు కూడా కొంతమంది దాన్ని నెగెటివ్ గా చూస్తారని తన మనసులోని మాటని చెపాడు. అందుకే ఏదైనా చేయాలనుకున్నప్పుడు బాగా ఆలోచించి చేయాలని అనుకుంటున్నానని చెప్పాడు.
ఇక చివరగా ప్రేమ, బ్రేకప్ గురించి మాట్లాడుతూ.. ప్రేమలో ఫెయిల్ అయితే ప్రాణాలు తీసుకోవడం పరిష్కారం కాదని, బ్రేకప్ను మర్చిపోయేలా కెరీర్‌పై దృష్టి పెట్టాలని యూత్ కి తనదైన సలహా ఇచ్చాడు ఈ క్రేజీ ఫోక్ సింగర్ కం డాన్సర్.