E-Paper
Advertisement

ఇదేక్కడి లాజిక్ రా మామా.. బ్రేకప్ అయితే కంగ్రాట్స్ అంటున్న రాము రాథోడ్!

ఇదేక్కడి లాజిక్ రా మామా.. బ్రేకప్ అయితే కంగ్రాట్స్ అంటున్న రాము రాథోడ్!
Advertisement

Kissik Talks:బిగ్ టీవీ ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న ‘కిసిక్ టాక్స్’ ఇంటర్వ్యూలో ఫోక్ సింగర్ రాము రాథోడ్ పాల్గొని బ్రేకప్, ప్రేమ, కుటుంబం, అలాగే తనపై వస్తున్న విమర్శలపై ఎన్నో విషయాలు చెప్పుకొచ్చాడుముఖ్యంగా ప్రేమలో విఫలమై బాధపడుతున్న యూత్ కి తనదైన శైలిలో హితబోధ చేయడం ఇక్కడ విశేషం.

ప్రేమ కోసం అడుక్కోవడం కరెక్ట్ కాదు 

Advertisement

ప్రేమ విషయంలో ఎదుటివారి ఇష్టాన్ని గౌరవించాలని, మన ప్రేమను చెప్పేశాక వారి నిర్ణయం కోసం వేచి చూడాలే తప్ప ప్రేమ కోసం అడుక్కోవడం కరెక్ట్ కాదని రాము రాథోడ్ స్పష్టం చేశాడు. ఒకవేళ ప్రేమలో బ్రేకప్ అయితే జీవితం అక్కడితో ఆగిపోదని, ఆ బాధలోనే ఉండిపోకుండా తమ కెరీర్‌పై దృష్టి పెట్టాలని సూచించాడు.

ఆశ్చర్యపోయేలా జీవితంలో ఎదగాలి 

Advertisement

ఇక బ్రేకప్ అయిన అబ్బాయిలకు శుభాకాంక్షలు చెబుతూ, అది జీవితంలో కొత్త చాప్టర్ కి నాంది కావాలని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడు. మనం సాధించాలనుకున్న లక్ష్యాలపై దృష్టి పెట్టి, మనల్ని వదిలేసిన వారు ఆశ్చర్యపోయేలా జీవితంలో ఎత్తుకు ఎదగాలని హితబోధ చేశాడు.ప్రేమలో మోసపోయామని జీవితాలను నాశనం చేసుకోవద్దని, మన కోసం కష్టపడే తల్లిదండ్రుల సంతోషం కోసం బతకాలని తెలిపాడు. బ్రేకప్ జ్ఞాపకాలను మర్చిపోవడం కష్టమే అయినప్పటికీ, వాటి వల్ల భవిష్యత్తును పాడుచేసుకోకూడదని చెప్పాడు రాము రాథోడ్.ఎదురైన అనుభవాలను పాఠాలుగా తీసుకుని లైఫ్ లో ముందుకు వెళ్ళడమే నిజమైన సక్సెస్ అని తన అభిప్రాయాన్ని తెలిపాడు.

ఏదైనా సాధించాలంటే కొన్నింటిని త్యాగం చేయాలి 

ఇక తన తల్లిదండ్రుల గురించి మాట్లాడుతూ, తాను ప్రస్తుతం హైదరాబాద్‌లో ఉంటున్నానని, తండ్రి వ్యవసాయం, తల్లి ఇంటి పనులతో ఊర్లోనే ఉంటున్నారని తెలిపాడు. హైదరాబాద్ వారికి అలవాటు కాకపోవడంతో అప్పుడప్పుడు వచ్చి వెళ్తుంటారని చెప్పాడు. తన తల్లిదండ్రులకు దూరంగా ఉండటం బాధగానే ఉన్నా, జీవితంలో ఏదైనా సాధించాలంటే కొన్నింటిని త్యాగం చేయక తప్పదని అన్నాడు. తన తల్లికి సర్‌ప్రైజ్‌లు ఇవ్వడం తనకి అలవాటని,వచ్చే రెండేళ్లలో తమ్ముడికి పెళ్లి చేసి కోడలిని ఇంటికి తీసుకురావాలనే కోరిక ఉందని సరదాగా మనసులోని మాటని బయట పెట్టాడు రాథోడ్.

నెగిటివిటీ కూడా అంతే అవసరం

ఇక ఆస్తుల విషయానికి వస్తే జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ లలో ఆస్తులేమీ లేవని, సొంత ఊరిలో ఒక ఇల్లు మాత్రమే ఉందన్నాడు. అభిమానుల ప్రేమే తనకు అసలైన ఆస్తి అని, కోట్లు సంపాదించినా దక్కని సంతోషం అభిమానులు తనని ఆదరించడంలో లభిస్తుందని చెప్పాడు.

ఇక సోషల్ మీడియాలో వచ్చే విమర్శలు, నెగిటివ్ కామెంట్లపై రియాక్ట్ అవుతూ చెట్టు బాగా పెరిగి మంచి పూలు పూయడానికి ఎరువు ఎంత అవసరమో, మన జీవితంలో ఎదగడానికి నెగిటివిటీ కూడా అంతే అవసరమని తనపై వస్తున్న ట్రోల్స్ కి కౌంటర్ ఇచ్చాడు రాథోడ్. ఎవరైనా తక్కువ చేసి మాట్లాడితే మరింత పట్టుదలతో సాధించి చూపించాలని, విమర్శలనే ఎరువుగా మార్చుకుని విజయాలు సాధించాలని చెప్పుకొచ్చాడు.చూడాలి వీటిపై సోషల్ మీడియాలో ఎలా రియాక్షన్స్ వస్తాయో !

Tags

Related News

అవమానాలే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చాయి.. రాము రాథోడ్ లైఫ్ స్టోరీ

తనూజ, రీతు, డెమోన్‌లపై రాము రాథోడ్ సంచలన కామెంట్స్!

కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!

ఫేమస్ అవ్వాలంటే తోకలుండాల్సిందే.. రాము రాథోడ్ కామెంట్స్ వైరల్!

రాను బొంబైకి రాను పాటను మించే సాంగ్ వస్తుందా? రాము రాథోడ్ ఏమన్నాడంటే!

నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు.. ఫోక్ సింగర్ రాము రాథోడ్ షాకింగ్ కామెంట్స్!

ఇదెక్కడి క్రేజ్ రా మామా.. గోరటి వెంకన్న పాటకు అప్పట్లో అంత డబ్బా?

Big Stories

Advertisement
×