E-Paper
Advertisement

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!

డిండి ఎత్తిపోతల పథకం పూర్తిగా రద్దు.. ఎంపీ డీకే అరుణ సంచలన డిమాండ్!
Advertisement

Dindi Project; డిండి ఎత్తిపోతల పథకాన్ని తక్షణమే రద్దు చేయాలని మహబూబ్‌నగర్‌ ఎంపీ డీకే అరుణ డిమాండ్‌ చేశారు. పాలమూరు రైతుల సాగునీటి ప్రయోజనాలకు విఘాతం కలిగించే చర్యలను సహించబోమని స్పష్టం చేశారు. నల్లగొండ జిల్లా అభివృద్ధికి పాలమూరు ప్రాంతం ఎన్నడూ అడ్డుపడలేదని, అయితే ఆ జిల్లా అవసరాల పేరుతో పాలమూరు రైతులకు అన్యాయం చేయడం తగదని హితవు పలికారు. డిండి ప్రాజెక్టుపై పదేపదే వ్యాఖ్యలు చేస్తూ రైతుల మధ్య ఉద్రిక్తతలు పెంచవద్దని శాసనమండలి ఛైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి సూచించారు. రెండు జిల్లాల ప్రజలు, రైతుల మధ్య విభేదాలు సృష్టించే పరిస్థితులకు తావివ్వకూడదన్నారు. డిండి లిఫ్ట్‌ పథకాన్ని రద్దు చేయకపోతే ఉద్యమాన్ని మరింత ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు. సోమవారం మహబూబ్‌నగర్‌లోని తన నివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

0.6 టీఎంసీల నీటి తరలింపును వ్యతిరేకిస్తున్నాం..

డిండి ప్రాజెక్టు ద్వారా 0.6 టీఎంసీల నీటిని తరలించే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని డీకే అరుణ తెలిపారు. ఈ చర్య పాలమూరు రైతుల సాగునీటి ప్రయోజనాలను దెబ్బతీస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. నల్లగొండ జిల్లాలోని నీటి సమస్యల పరిష్కారానికి నక్కలగండి, నాగార్జునసాగర్‌, ఎస్‌ఎల్‌బీసీ, మల్లన్నసాగర్‌ వంటి ప్రత్యామ్నాయ మార్గాలను పరిశీలించాలని సూచించారు. ఆయా అవకాశాలను వినియోగించుకోవాల్సింది పోయి, ఫ్లోరైడ్‌ సమస్యను సాకుగా చూపుతూ పాలమూరు రైతులకు అన్యాయం చేయడం సరికాదన్నారు. జాతీయ పార్టీలో ఉన్నంత మాత్రాన రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించకూడదా? అని ఆమె ప్రశ్నించారు. డిండి ప్రాజెక్టు విషయంలో తాను వ్యక్తం చేస్తున్న అభ్యంతరాలపై గుత్తా సుఖేందర్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలను ఖండించారు.

అసలు లక్ష్యానికి విరుద్ధంగా పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టు..

Advertisement

పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకం అసలు లక్ష్యం దెబ్బతిన్నదని డీకే అరుణ విమర్శించారు. తొలుత జూరాల నుంచి నీటిని తీసుకునేలా రూపొందించిన ప్రణాళికను మార్చి, శ్రీశైలం బ్యాక్‌వాటర్‌ నుంచి నీటిని తీసుకునే విధంగా నిర్ణయించడంతోనే ప్రాజెక్టు లక్ష్యం మారిపోయిందన్నారు. 72 జీవోలో డిండి ద్వారా నీటిని తరలించే అంశం లేదని పేర్కొన్నారు. పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టును తొలుత రూపొందించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్‌) ప్రకారం సమీక్షించి, పెండింగ్‌లో ఉన్న పనులను వెంటనే ప్రారంభించాలని డిమాండ్‌ చేశారు.

Also read: భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. కండక్టర్‌తో గొడవ… కాళ్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

పాలమూరు–రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలి..

Advertisement

విభజన చట్టంలో పోలవరం ప్రాజెక్టుకు కల్పించిన తరహాలోనే పాలమూరు–రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జాతీయ హోదా కల్పించాలని గతంలో దిల్లీలో జరిగిన సమావేశంలో తాను కోరినట్లు డీకే అరుణ గుర్తుచేశారు. ఈ ప్రాజెక్టుకు నిధులు సమకూర్చే అంశంపై కేంద్రం సానుకూలంగా స్పందించిందని గతంలో మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి మీడియా ముందు వెల్లడించిన విషయాన్ని ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ప్రాజెక్టుల పూర్తికంటే కాంట్రాక్టులు, కమీషన్లపైనే ఎక్కువ శ్రద్ధ ఉందని ఆమె ఆరోపించారు. గత మూడేళ్లలో పాలమూరు జిల్లాలో ఒక్క ప్రాజెక్టు కూడా పూర్తికాలేదని విమర్శించారు. జూరాల ప్రాజెక్టు మరమ్మతులకు సైతం నిధులు విడుదల చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో కేసీఆర్‌ పాలమూరుకు ఉరితాడు వేస్తే, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఆ ఉచ్చును మరింత బిగిస్తున్నారని వ్యాఖ్యానించారు.

పెండింగ్‌ ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలి..

పాలమూరు జిల్లాలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న సాగునీటి ప్రాజెక్టులను ప్రభుత్వం తక్షణమే పూర్తి చేయాలని డీకే అరుణ డిమాండ్‌ చేశారు. డిండి ఎత్తిపోతల పథకం రద్దు కోసం భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమం చేపడతామని ప్రకటించారు. త్వరలోనే జిల్లాలోని పెండింగ్‌ ప్రాజెక్టులను సందర్శించి, వాటి ప్రస్తుత పరిస్థితిని పరిశీలిస్తామని తెలిపారు. అనంతరం భవిష్యత్తు కార్యాచరణను రూపొందించి ప్రకటిస్తామని వెల్లడించారు.

Also read: ఢిల్లీ రాజకీయాల్లో పెరిగిన హీట్.. సీఎం చంద్రబాబు అమిత్ షా భేటీ అందుకేనా..?

Tags

Related News

మహబూబ్‌నగర్ జిల్లాలో ఎల్ నినో విలయం.. 30 నుంచి 41 శాతం పడిపోయిన జలాలు!

హరీష్‌రావు పై మెట్టు సాయికుమార్ సంచలన ఆరోపనలు.. ఏమన్నారంటే?

భద్రాద్రి కొత్తగూడెంలో దారుణం.. కండక్టర్‌తో గొడవ… కాళ్లపై దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు!

20 ఏళ్లుగా రగులుతున్న ప్రాణహిత-తుమ్మిడిహట్టి బ్యారేజీ.. ఈ సారైనా మోక్షం దక్కేనా..?

ఓట్ల చోరీకి నిరసనగా కాంగ్రెస్ సమరశంఖం.. నవంబరు 1న భారీ బహిరంగ సభ!

తెలంగాణలో అలయ్ బలయ్ ఆత్మీయ సమ్మేళనం!

బిగ్ బ్రేకింగ్.. తెలంగాణలో అతి భారీ వర్షాలు.. రెడ్ అలర్ట్ జారీ!

Big Stories

Advertisement
×