E-Paper
Advertisement

రాను బొంబైకి రాను పాటను మించే సాంగ్ వస్తుందా? రాము రాథోడ్ ఏమన్నాడంటే!

రాను బొంబైకి రాను పాటను మించే సాంగ్ వస్తుందా? రాము రాథోడ్ ఏమన్నాడంటే!
Advertisement

Kissik Talks:ఫోక్ సింగర్ రాము రాథోడ్ మరోసారి బిగ్ టీవీ ‘కిసిక్ టాక్స్’ ఇంటర్వ్యూలో తన మనసులోని మాటలను పంచుకున్నారు. ఈ క్రమంలో తనకెంతో పేరు తెచ్చి పెట్టిన రాను బొంబాయికి రాను గురించి అలాగే బిగ్ బాస్ గురించి,అలాగే ఇప్పుడున్న యూత్ పై తన అభిప్రాయలు ఏంటనే వాటిపై పలు ఆసక్తికరమైన విషయాలని చెప్పుకొచ్చాడు.

ఆ పాటను మించే సాంగ్ వస్తుందా

Advertisement

ముఖ్యంగా ‘రాను బొంబైకి రాను’ పాటతో ఓ ట్రెండ్ సెట్ చేసిన ఆయన, భవిష్యత్తులో ఆ పాటను మించే సాంగ్ వస్తుందా అంటే అది ప్రేక్షకుల చేతుల్లోనే ఉంటుందని, ఆ పాటే ఇప్పుడు తెలుగులో ఒక ఎవరెస్ట్‌లా నిలిచిందని తెలిపాడు. తాను ఏ పాట చేసినా వంద శాతం కష్టపడతానని, అయితే ఏది ఎంతలా వైరల్ అవుతుందో ముందే చెప్పలేమని అన్నాడు.

అతని నిజాయతీ, ధైర్యం చాలా ఇష్టం 

Advertisement

ఇక బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ, హౌస్‌లో కంటెస్టెంట్లు చాలా బాగా ఆడుతున్నారని చెప్పాడు. ముఖ్యంగా బిగ్ బాస్ కంటెస్టెంట్ నరేష్ ఆటతీరుపై ప్రశంసలు కురిపించాడు. నరేష్ హౌస్‌లో ఎలా ఉంటున్నాడో బయట కూడా అలాగే ఉంటాడని, అతని నిజాయతీ, ధైర్యం, మైండ్‌సెట్ తనకు చాలా ఇష్టమని, షూటింగ్స్‌లోనూ అతను అలాగే ఉంటాడని చెప్పి హ్యాట్సాఫ్ తెలిపాడు.

ఇక ఇప్పటి యూత్ గురించి చెబుతూ.. 2000 తర్వాత పుట్టిన పిల్లలకు ఫోన్లు, సోషల్ మీడియానే ప్రపంచమని, 18-19 ఏళ్ల వయసులోనే సొంతంగా ఆలోచించే స్థాయికి వచ్చారని అన్నాడు. వాళ్లకు ఎంత చెప్పినా వినరని, తమకు అంతా తెలుసని అనుకుంటారని తెలిపాడు. అలాగే హ్యాపీగా ఉండటమంటే కేవలం సరదాగా తిరగడం కాదని, జీవితంలో సంతోషంతో పాటు బాధలు కూడా ఉంటాయని, అప్పుడే జీవితంకి ఒక అర్థం ఉంటుందని చెప్పాడు.ఏది ఏమైనా ప్రకృతికి తలవంచి వచ్చిన వాటిని తీసుకోవాలని
ని అన్నాడు.

ఎంత విలువ ఇవ్వాలో నేర్చుకున్నా

ఇక తన జీవితాన్ని పూర్తిగా మార్చేసిన వ్యక్తి గురించి చెబుతూ.. కుటుంబం కాకుండా తన నిర్మాత వల్లీ గారు, రావు గారు తనకు ఎప్పుడూ అండగా ఉంటారని, ముఖ్యంగా ఒక వ్యక్తి తన జీవితంలోకి వచ్చాక నిజమైన స్నేహం అంటే ఏమిటో తనకు అర్థమైందని ఎమోషనల్ అయ్యాడు. ఆ వ్యక్తి వల్ల తన జీవితంలో ఎంతో మార్పు వచ్చిందని, స్నేహానికి ఎంత విలువ ఇవ్వాలో నేర్చుకున్నానని తెలిపాడు.

మాది ‘డేంజర్ బాండింగ్’

ఇక మ్యూజిక్ డైరెక్టర్ మదీన్, కళ్యాణ్ కీస్, శేఖర్ మాస్టర్ వంటివారితో తనకున్న అనుబంధం గురించి చెబుతూ, శేఖర్ మాస్టర్‌తో తన బాండింగ్ చాలా డిఫరెంట్ అని, దాన్ని ‘డేంజర్ బాండింగ్’ అంటారని సరదాగా నవ్వుతూ చెప్పాడు. బయటివాళ్లకు అది అర్థం కాదని, టేక్ మొదలైతే మాత్రం శేఖర్ మాస్టర్ చాలా సీరియస్ అండ్ డెడికేషన్ తో పనిచేస్తారని ఆకాశానికి ఎత్తేశాడు.

మొత్తానికి తన పాటల సక్సెస్ తో పాటు, వ్యక్తిగత జీవితంలో తనకు అండగా ఉన్న వారి గురించి అలాగే ఫ్రెండ్స్ మరియూ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ని రాము రాథోడ్ ఓపెన్‌గా పంచుకోవడంతో ఈ ఇంటర్వ్యూ ఇపుడు నెట్టింట తెగ వైరల్ అవుతుంది!

Tags

Related News

ఇదేక్కడి లాజిక్ రా మామా.. బ్రేకప్ అయితే కంగ్రాట్స్ అంటున్న రాము రాథోడ్!

కాబోయే భార్య ఇలాగే ఉండాలి…ఆ హీరోయిన్ లాగా ఉండాలంటూ!

ఫేమస్ అవ్వాలంటే తోకలుండాల్సిందే.. రాము రాథోడ్ కామెంట్స్ వైరల్!

నమ్మిన వాళ్లే నట్టేట ముంచారు.. ఫోక్ సింగర్ రాము రాథోడ్ షాకింగ్ కామెంట్స్!

ఇదెక్కడి క్రేజ్ రా మామా.. గోరటి వెంకన్న పాటకు అప్పట్లో అంత డబ్బా?

బండారి పూజిత క్రేజ్ మామూలుగా లేదుగా.. నెలకు ఎన్ని లక్షలు సంపాదిస్తుందో తెలుసా?

బిగ్ బాస్ 10 సర్ప్రైజ్ ఎలిమినేషన్.. షాలిని అవుట్!

Big Stories

Advertisement
×