Ramiz Raza slams Babar Azam: పాకిస్తాన్ గడ్డపై వన్డే ట్రై సిరీస్ (Pakistan ODI Tri-Series, 2026 ) చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. శ్రీలంక, పాకిస్తాన్, ఇంగ్లాండ్ జట్ల మధ్య మెగా టోర్నమెంట్ కొనసాగుతోంది. 2027 వన్డే వరల్డ్ కప్ కంటే ముందు కీలకమైన ఈ టోర్నమెంట్ లో బాబర్ ఆజం (Babar Azam) మళ్లీ అట్టర్ ఫ్లాఫ్ అవుతున్నాడు. ఈ టోర్నమెంట్ లో ఇప్పటి వరకు బ్యాడ్ ఝులిపించిన దాఖలాలు లేవు. తాజాగా ఇంగ్లాండ్ తో జరిగిన నాలుగో మ్యాచ్ సందర్భంగా పది పరుగులకు క్లీన్ బౌల్డ్ అయ్యాడు బాబర్ ఆజం. దీంతో బాబర్ ఆజం బ్యాటింగ్ పై రమీజ్ రాజా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. పది పరుగులు కూడా చేయలేని దద్దమ్మ బాబర్ అంటూ ఫైర్ అయ్యాడు. ఇలాంటి వాడు విరాట్ కోహ్లీ రికార్డులను బద్దలు కొడతాడా..? అతని కాలిగోటికి కూడా సరిపోడంటూ రమీజ్ రాజా హేళన చేశాడు.
వన్డే ట్రై సిరీస్ లో భాగంగా పాకిస్తాన్ వర్సెస్ ఇంగ్లాండ్ మధ్య లాహోర్ లోని ( Lahore) గడాఫీ స్టేడియం ( Gadafi stadium) వేదికగా బిగ్ ఫైట్ ఆదివారం జరిగింది. ఈ కీలకమైన మ్యాచ్ లో బాబర్ ఆజం మరోసారి విఫలమయ్యాడు. ఫస్ట్ డౌన్ లో వచ్చిన బాబర్ ఆజం ఎప్పటిలాగే పది పరుగులకు వికెట్ సమర్పించుకున్నాడు. దీంతో రమీజ్ రాజా చాలా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒకప్పుడు కింగ్ లో ఉన్న బాబర్ ఆజం.. ఇప్పుడు పెద్ద జోకర్ అయ్యాడని పరువు తీశారు. ఇలాంటి జోకర్ ను పాకిస్తాన్ క్రికెట్ జట్టు నుంచి బయటకు పంపించాల్సిందేనని డిమాండ్ చేశారు.
ఒకప్పుడు బాగా ఆడిన బాబర్ ఆజం… మళ్లీ అదే రిథమ్ అందుకోలేకపోతున్నాడని పరువు తీశారు. మళ్లీ మొదట్లో ఆడినట్టుగా అతడు ఆడడం కష్టమేనని.. 2027 వన్డే వరల్డ్ కప్ దగ్గర పడుతున్న తరుణంలో బాబర్ ఆజం స్థానంలో మరో ఆటగాడిని పాకిస్తాన్ క్రికెట్ బోర్డు తయారు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలా కాకుండా బాబర్ ఆజం జపం చేస్తే మాత్రం పాకిస్తాన్ క్రికెట్ జట్టుకు ఎలాంటి లాభం ఉండదని వెల్లడించారు. గత ప్రదర్శనను దృష్టిలో పెట్టుకొని పాకిస్తాన్ జట్టులో బాబర్ ఆజంను కొనసాగిస్తున్నారని.. అంతేతప్ప వాడు కొత్తగా పీకిందేమీ లేదన్నారు. ఇలాంటి చేతకానీ దద్దమ్మ బాబర్ ఆజంను, విరాట్ కోహ్లీతో ఇన్ని రోజులు పోల్చారని ఫైర్ అయ్యారు. ఇప్పటికైనా ఆ పోలికలు ఆపేయండి అంటూ రమీజ్ రాజా వెల్లడించారు.