Kissik Talks Ramu Rathod: రాను బొంబాయి కి రాను, సొమ్మసిల్లి పోతున్నావే ఓ చిన్న రాములమ్మ, పల్లి పోకే సక్కుని సీతమ్మ వంటి ఫోక్ సాంగులతో డాన్సర్ గా, గాయకుడిగా తనకంటూ ప్రత్యేకమైన ఇమేజ్ సొంతం చేసుకున్నారు రాము రాథోడ్ (Ramu Rathod). ఒక మారుమూల గిరిజన కుటుంబంలో జన్మించిన ఈయన.. యూట్యూబ్ ద్వారా తన ప్రయాణాన్ని మొదలుపెట్టాడు. ఈయన చేసిన డాన్స్ కి, రాసిన పాట “రాను బొంబాయికి రాను ” పాటకి గాను యూట్యూబ్ నుంచే ఏకంగా కోటి రూపాయలు సంపాదించి రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశవ్యాప్తంగా సెన్సేషన్ క్రియేట్ చేశారు. అలాంటి రాము రాథోడ్ బిగ్ బాస్ వంటి రియాలిటీ షోలలో కూడా సందడి చేసిన విషయం తెలిసిందే.
ఇకపోతే తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పలు ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. ముఖ్యంగా ఫుల్ ఎపిసోడ్కి సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వాహకులు విడుదల చేయగా.. అందులో తనకు ఫేమ్ వచ్చిన తర్వాత నమ్మినవాళ్లే తనను మరింత మోసం చేశారంటూ చేసిన కామెంట్లు వైరల్ గా మారుతున్నాయి. మోసం చేసే వాళ్లకోసం రాము ఏం చెప్తారు? అని ప్రశ్నించగా.. రాను బొంబాయి కి రాను పాట సక్సెస్ తర్వాత ఇల్లు కొన్నాను. ఉన్న రేటు కంటే రూ.50 లక్షలకు పైగా ఎక్కువ తీసుకున్నారు. వాళ్లు మా వాళ్లు అని నమ్మాను. పనిచేస్తున్న విషయంలో కానీ.. ఎక్కడైనా సరే.. నమ్మాను. కానీ ఒక 6 లక్షల వరకు అక్కడ మోసం చేశారు అంటూ నమ్మినవారు తనను మోసం చేయడం పై ఆవేదన వ్యక్తం చేశారు రాము రాథోడ్.
కెరియర్ లో సక్సెస్ అవ్వాలి అంటే ఇప్పుడున్న జనరేషన్ కి మీరు ఎలాంటి సలహా ఇస్తారు అని ప్రశ్నించగా.. మీరు వాళ్లకు ఎంత చెప్పినా.. ఏ రకంగా చెప్పినా.. వాళ్లు మైండ్ కి తీసుకోరు. ఒకరికి సజెషన్స్ అవసరం లేదు. తల్లిదండ్రుల మాట అసలుకే వినరు.. అంటూ ఎవరికి సజెషన్స్ అవసరం లేదు అన్నట్టుగా తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చారు.
also read:ప్రేమలో విఫలమైతే చచ్చిపోవాలా.. రాము రాథోడ్ సంచలన కామెంట్స్!
మీరు మీ జీవితంలో ఎవరికైనా సారీ చెప్పాల్సి వస్తే ఎవరికి చెబుతారు అని ప్రశ్నించగా.. మా తల్లిదండ్రులకు. ఇప్పుడు నేను మా తల్లిదండ్రుల దగ్గర లేను. ఇప్పటికీ వాళ్ళు నన్ను వార్నింగ్ చేస్తూనే ఉన్నారు. అమ్మ ప్రేమను మిస్ అవుతూ ఉంటారు కదా అని అడగగా ఒకటి కావాలి అంటే మరొకటి వదులుకోవాల్సిందే కదా.. కెరియర్ కోసం తల్లిదండ్రులను పక్కన పెట్టాల్సి వచ్చింది అంటూ తెలిపారు రాము రాథోడ్.
మీకు ఇష్టమైన దేవుడు ఎవరు అని అడగగా.. కష్టాన్నే నేను దేవుడిగా నమ్ముతాను. ఇక డబ్బులు ఉన్నప్పుడు ఒకలాగా డబ్బులు లేనప్పుడు మరోలాగా ఉండడం నేను చాలా చూశాను అంటూ కూడా తన జీవితంలో ఎదుర్కొన్న ఎన్నో విషయాలను పంచుకున్నారు. ఇలా మరిన్ని విషయాలు తెలియాలి అంటే ఆదివారం రాత్రి 8 గంటలకు ప్రసారమయ్యే ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే.