Kissik Talks Ramu Rathod:యూట్యూబర్ గా, ఫోక్ డాన్సర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రాము రాథోడ్ గురించి పరిచయాల ప్రత్యేకంగా అవసరం లేదు. రాను బొంబాయి కి రాను, సొమ్ము సిల్లీ పోతున్నావే అంటూ పలు జానపద పాటలతో ఫోక్ డాన్సర్ గా మరింత పాపులారిటీ సొంతం చేసుకున్న ఈయన.. బిగ్ బాస్ సీజన్ 9లో కంటెస్టెంట్ గా పాల్గొని అందరి దృష్టిని ఆకట్టుకున్నారు. ఇక ఈమధ్య బుల్లితెర షోలలో కూడా సందడి చేస్తూ.. మరింత బిజీగా మారారు. అలాంటి రాము రాథోడ్ తాజాగా బిగ్ టీవీ ఎక్స్ క్లూజివ్ గా నిర్వహిస్తున్న కిస్సిక్ టాక్స్ (Kissik talks) కార్యక్రమంలో గెస్ట్గా పాల్గొన్నారు . ఈ మేరకు లేటెస్ట్ ఎపిసోడ్ కి సంబంధించిన ప్రోమో విడుదల చేయగా.. అందులో పలు విషయాలు పంచుకున్న రాము రాథోడ్.. సమాజంలో జరుగుతున్న లవ్ , బ్రేకప్ , సూసైడ్ పై తన అభిప్రాయాలను పంచుకున్నారు.
బ్రేకప్ లో ఉన్న వాళ్లు దాని పైనే ఆలోచిస్తూ.. బాధపడుతూ ఉంటారు. సరిగ్గా తిండి తినరు.. నిద్రపోరు.. డిప్రెషన్ లోకి వెళ్లి పోతారు. ఇంకొంతమంది అయితే ఏకంగా ప్రాణాలు తీసుకుంటుంటారు. ముఖ్యంగా ఈ మధ్యకాలంలో ప్రేమలో బ్రేకప్ అయ్యింది అంటే ఒకటి సూసైడ్ అయినా చేసుకోవాలి. లేదా జీవితంలో ఉన్నత స్థానానికైనా వెళ్లాలి.. ఇదే జరుగుతోంది అంటూ వర్షా చెప్పగా.. దీనిపై రాము రాథోడ్ మాట్లాడుతూ.. “ఒకసారి బ్రేకప్ జరిగింది అంటే మళ్ళీ అతకడం కష్టం. చచ్చి ఏం సాధిస్తారు. వీడు ఆ అమ్మాయి కోసం చనిపోయాడంట.. ఈమె వాడి కోసం చనిపోయిందంట అనే మాటలు తప్ప ఇంకేమి ఉండవు.
ఈ మధ్యకాలంలో సీరియస్ గా ఎవరు ఎవరిని ప్రేమించడం లేదు.. నెక్స్ట్ నేను చేయబోయే పాట కూడా అదే.. అంటూ ప్రస్తుత సమాజంలో జరుగుతున్న విషయాలపై, ప్రేమించడం, విఫలమైతే సూసైడ్ చేసుకోవడం లాంటి విషయాలపై రాము రాథోడ్ స్పందించి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
also read:ఫోక్ సింగర్ రాము రాథోడ్ ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా?
ఇకపోతే ఇదే ఇంటర్వ్యూలో తన ప్రేమ గురించి మాట్లాడుతూ.. నాన్న బుజ్జి కన్నా అని మేము ఏ రోజు మాట్లాడుకోలేదు. అసలు అలాంటిది ప్రేమే కాదు.. నేను అలసిపోయానో లేదో కూడా ఆమే చెబుతుంది. ముఖ్యంగా ఈరోజు గొడవ పడకపోతే అసలు ఎందుకు ఈ రోజు ఇంత కామ్ గా ఉంది అని ఆలోచిస్తాను. ఒక రకంగా చెప్పాలి అంటే గొడవ పడడమే మంచిది. ఎందుకంటే ఒకరి గురించి మరొకరు తెలుసుకోవడానికి ప్రేమలో గొడవలు పడడం చాలా అవసరం అంటూ కూడా చెప్పుకొచ్చారు రాము రాథోడ్, మొత్తానికైతే ప్రేమించడం, ప్రేమలో మోసపోవడం లాంటివి జరిగిన సరే ధైర్యంగా జీవితంలో ముందుకు వెళ్లాలని, బ్రేకప్ జరిగింది కదా అని, ఎదుటి వాళ్ల కోసం సూసైడ్ చేసుకొని మనల్ని నమ్ముకున్న వాళ్లకు అన్యాయం చేయడం మంచిది కాదు అంటూ తన అభిప్రాయంగా చెప్పుకొచ్చారు రాము రాథోడ్.