Abhishek Sharma Angry On Vaibhav: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య టి20 సిరీస్ చాలా ఉత్కంఠ భరితంగా సాగుతోంది. ఇప్పటికే ఈ రెండు జట్ల మధ్య ఒక మ్యాచ్ ఫినిష్ కాగా.. శనివారం కూడా రెండవ మ్యాచ్ జరగనుంది. ఇలాంటి క్రమంలో వైభవ్ సూర్యవంశీపై అభిషేక్ శర్మ సీరియస్ అయినట్టు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ప్రాక్టీస్ చేస్తున్న క్రమంలో 15 ఏళ్ల కుర్రాడు వైభవ్ సూర్యవంశీని అభిషేక్ శర్మ వేలు పెట్టి బెదిరించిన ఫోటోలు కూడా బయటకు వచ్చాయి. వైభవ్ తో ఓపెనింగ్ చేయలేనని.. వాడు ముద్ద పప్పులా ఒకే దగ్గర ఉంటాడంటూ అభిషేక్ శర్మ (Abhishek Sharma) వార్నింగ్ ఇచ్చినట్టు ప్రచారం జోరుగా సాగుతోంది.
టీమిండియా మిగతా క్రికెటర్ల సమక్షంలోనే వైభవ్ ను బూతులు తిట్టినట్టు కూడా తెలుస్తోంది. సింగిల్స్ తీయలేని వైభవ్ సూర్యవంశీని ఓపెనర్ గా పంపకూడదని గొడవ పెట్టుకున్నట్టు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దీంతో ఈ సంఘటన ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. దీనిపై క్రికెట్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు. అభిషేక్ శర్మ తీరుపై విమర్శలు చేస్తున్నారు. 15 ఏళ్ల బుడ్డోడికి ఎంకరేజ్ చేయాలి కానీ, ఇలా చిన్న చూపు చూడొద్దంటూ ఫైర్ అవుతున్నారు. ఇంత రచ్చ జరుగుతున్నా, అక్కడ ఉన్న మిగతా క్రికెటర్లు, కోచ్ లు ఏం పీకుతున్నారని ప్రశ్నిస్తున్నారు. నిజంగానే వైభవ్ ను అభిషేక్ శర్మ తిట్టింటే వెంటనే బీసీసీఐ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరగనున్న మ్యాచ్ నేపథ్యంలో వైభవ్ సూర్యవంశీ అభిమానులకు బిగ్ రిలీఫ్ దక్కింది. రెండో టీ20 సందర్భంగా వైభవ్ లో బరిలోకి దిగనున్నాడు. వెస్టిండీస్ సిరీస్ సందర్భంగా ఒక్క మ్యాచ్ ఆడే అవకాశం రాకపోవడంతో నిరాశ చెందిన వైభవ్ సూర్యవంశీ అభిమానులకు ఇషాన్ కిషన్ గాయం రూపంలో బిగ్ రిలీఫ్ దక్కింది. మొదటి టెస్ట్ లో ఇషాన్ కిషన్ గాయపడటంతో అతని స్థానంలో తుది జట్టులో వైభవ్ సూర్య వంశీ స్థానం దక్కించుకున్నాడు.
దీంతో రెండు టి20 సందర్భంగా ఓపెనర్ గా బరిలోకి దిగనున్నాడు వైభవ్. వైభవ్ సూర్య వంశీ ఇవాల్టి మ్యాచ్ లో ఆడనున్న క్రమంలో అభిమానులు సంబరపడిపోతున్నారు. కాగా రెండో టి20 సందర్భంగా టాస్ గెలిచిన టీమిండియా ఎప్పటిలాగే మొదట బౌలింగ్ చేసేందుకు నిర్ణయం తీసుకుంది. దీంతో న్యూజిలాండ్ ఫస్ట్ బ్యాటింగ్ చేయనుంది. ఈ పిచ్ సెకండ్ బ్యాటింగ్ కు అనుకూలించే అవకాశాలు ఉన్నాయి. అంటే ఈ లెక్కన టీమ్ ఇండియాకు అడ్వాంటేజ్ జరగనుంది.