E-Paper
Advertisement

సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!

సుధీర్ రాకతో స్టేజ్ పై కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ!
Advertisement

Rashmi Gautam: జబర్దస్త్ కమెడియన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న సుడిగాలి సుధీర్ (Sudigali Sudheer), అదే జబర్దస్త్ లో యాంకర్ గా వ్యవహరిస్తున్న రష్మీ గౌతమ్ (Rashmi Gautam) జంట గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ముఖ్యంగా జబర్దస్త్ కి ఈ రేంజ్ లో టిఆర్పి రేటింగ్ రావడానికి కారణమైన వారిలో ఈ జంట కూడా ఒకటి. అద్భుతమైన ఆన్ స్క్రీన్ కెమిస్ట్రీ తో అందరి దృష్టిని ఆకట్టుకున్న ఈ జంట పెళ్లెప్పుడు అంటూ ఎన్నో ఏళ్లుగా అనేక డిస్కషన్స్ , ఊహాగానాలు కూడా నడిచాయి. ముఖ్యంగా సుధీర్ కి భారీగా క్రేజ్ రావడంతో జబర్దస్త్ ను వదిలేసి సినిమాల్లోకి అడుగు పెట్టాడు. కానీ రష్మీ మాత్రం జబర్దస్త్ లోనే పనిచేస్తూ అక్కడే తన కెరీర్ను కొనసాగిస్తోంది. అయితే చాలా రోజుల తర్వాత సుధీర్ మళ్లీ జబర్దస్త్ లోకి రావడంతో పాత విషయాలను గుర్తుచేసుకొని ఆమె కన్నీళ్లు పెట్టుకుంది.

కన్నీళ్లు పెట్టుకున్న రష్మీ..

ముఖ్యంగా నాగబాబు మళ్లీ రావడంతో జబర్దస్త్ కి తిరిగి పూర్వ వైభవం లభిస్తోందని చెప్పాలి. ముఖ్యంగా పంచులు, స్కిట్లు పూర్తిగా మారిపోయాయి. నాగబాబు రీ ఎంట్రీతో కొంతమంది పాత కమెడియన్లు కూడా మళ్లీ తిరిగి జబర్దస్త్ బాట పడుతున్నారు. ఇప్పటికే చంటి, ధనరాజ్ ,హైపర్ ఆది, సద్దాం వంటి వారు తిరిగి స్టేజ్ పై నవ్వులు పూయిస్తున్నారు. ఇక పాత టీం మేట్స్ లో ఒకరైన సుడిగాలి సుదీర్ , గెటప్ శ్రీను కూడా చాలా రోజుల తర్వాత మళ్లీ జబర్దస్త్ స్టేజ్ పైకి అడుగు పెట్టారు. ఇందుకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోని నిర్వహకులు విడుదల చేశారు. ఇందులో సుదీర్ ని చూడగానే రష్మీ ముఖం ఒక్కసారిగా వెలిగిపోయింది. ఆ తర్వాత కన్నీళ్లు పెట్టుకుంది.

ప్రోమో వైరల్..

Advertisement

హైపర్ ఆదితో స్టేజ్ పైకి వచ్చిన సుధీర్ స్కిట్ చేసి అందర్నీ ఆకట్టుకున్నాడు.. ఇక స్కిట్ చివరిలో గెటప్ శ్రీను కూడా ఎంట్రీ ఇవ్వడంతో అంతా గోలగోల చేశారు. తనకు బాగా అలవాటు అయిన తేడా గెటప్ తో కడుపుబ్బా నవ్వించాడు గెటప్ శ్రీను. ఇక జబర్దస్త్ ప్రోమో చివర్లో మాత్రం సుధీర్ తో తనకున్న బాండింగ్ గురించి చెబుతూ రష్మీ కన్నీటిపర్యంతం అయింది. మన జబర్దస్త్ లో మోస్ట్ లీడింగ్ , మోస్ట్ వాంటెడ్ అనే టీం సుడిగాలి సుదీర్ ది మాత్రమే .ఆ టీం నుంచి బాగా ఎదిగి అవకాశాలు దక్కించుకొని సుదీర్ మొదట బయటకు వెళ్లారు. ఇక జబర్దస్త్ స్టేజ్ మీద ఇద్దరు ఒకేసారి ఒకేరోజు అడుగుపెట్టామని , కానీ తనను వదిలి సుదీర్ వెళ్లిపోయాడని చెబుతూ రష్మీ కన్నీళ్లు పెట్టుకుంది.

also read:తండ్రి కాబోతున్న జబర్దస్త్ కమెడియన్.. ఎవరంటే?

సుధీర్ సమాధానం ఏంటి?

Advertisement

ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుంది. ఇకపోతే సుధీర్ గురించి రష్మీ ఏం చెప్పింది ? సుదీర్ ఎలాంటి సమాధానం ఇచ్చారు? ముఖ్యంగా ఆన్ స్క్రీన్ జోడీ అంటూ చెబుతున్న ఈ జంట నిజంగానే ప్రేమలో ఉన్నారా? తదితర విషయాలు తెలియాలి అంటే ఆదివారం ప్రసారమయ్యే జబర్దస్త్ ఫుల్ ఎపిసోడ్ వరకు ఎదురు చూడాల్సిందే. ఏది ఏమైనా సుధీర్ ని చూసి రష్మీ కన్నీళ్లు పెట్టుకున్న ఈ ప్రోమో ఎపిసోడ్ పై అంచనాలు పెంచేసింది.

Related News

Brahmamudi Serial Today Episode October 17th ‘బ్రహ్మముడి’ సీరియల్‌:  అపర్ణ రాసిన లెటర్ శేషు జీవితాన్ని మలుపు తిప్పుతుందా..? 

Saturday TV Movies : శనివారం టీవీ సినిమాలు.. మూవీ లవర్స్ కు జాతరే..

Nindu Noorella Saavasam Serial Today Episode October 17th‘నిండు నూరేళ్ల సావాసం’ సీరియల్‌: పార్థు హత్య కేసు నుంచి మనోహరి ఎస్కేప్ అవుతుందా..? 

సోషల్ మీడియాని షేక్ చేస్తున్న నల్గొండ గద్దర్ నరసన్న.. రమణిలో బతుకమ్మ పాటతో రచ్చ!

మాధురి రాథోడ్ లైఫ్‌లో జరిగినదే పాటలో ఉందా? ‘భామ సుందరా’ గ్లింప్స్ వైరల్!

త్రిగుణ్ ధూత.. వైల్డ్ కార్డ్స్ కి ఊహించని దెబ్బ..ఇది కదా అసలు గేమ్ అంటే?

సింగర్ కనకవ్వ పాటలకు అంత క్రేజ్ ఎందుకు?

మాట నిలబెట్టుకున్న వైవా హర్ష.. జబర్దస్త్ బాబుకి కళ్ళు చెదిరే గిఫ్ట్!

Big Stories

Advertisement
×