E-Paper
Advertisement

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు

ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి.. బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, స్వదేశీ మంత్రంతోపాటు
Advertisement

PM Modi: దేశ ఆర్థిక వృద్ధి ఈసారి అంచనాలను మించుతుందని వార్తల నేపథ్యంలో ప్రధాని నరేంద్రమోదీ రియాక్ట్ అయ్యారు. విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని, దేశ ప్రజలకు మరోసారి పిలుపు ఇచ్చారు. అవసరం లేకుంటే బంగారం కొనుగోలు చేయవద్దని విజ్ఞప్తి చేశారు. ఈసారి స్వదేశీ మంత్రాన్ని జపించాలని కోరారు. దీనికితోడు విదేశీ ప్రయాణాలు, విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్స్ మానుకోవాలని సూచన చేశారు. ఇంకా ఏం చెప్పారంటే..

దేశ ప్రజలకు ప్రధాని మోదీ మరోసారి విజ్ఞప్తి

దేశం ఆర్థిక వృద్ధి రేటు 7.8 శాతం సాధించినందుకు అభినందిస్తూ ఎక్స్ వేదికగా ప్రధాని నరేంద్రమోదీ మాట్లాడారు. కిర్గిజిస్థాన్ పర్యటనలో ఉన్న ప్రధాని మోదీ.. ఈ మేరకు సోషల్‌మీడియాలో ఓ వీడియోను విడుదల చేశారు. అందుకు దేశ ప్రజలకు అభినందనలు తెలిపిన ఆయన, ఇది దేశ ప్రజల సంకల్పం, కృషికి నిదర్శనమని తేల్చేశారు.

Advertisement

ప్రపంచం క్లిష్ట పరిస్థితులను ఎదుర్కొంటున్న ఇలాంటి సమయంలో భారత్ ఈ అసాధారణ ఘనతను దక్కించుకుందని వెల్లడించారు. యావత్త ప్రపంచం యుద్ధంలో మునిగిపోయిందని, ఎటుచూసినా వాటి వార్తలు వస్తున్నట్లు తెలిపారు. ఫలితంగా సరఫరా గొలుసు పూర్తిగా దెబ్బతిందన్నారు. గతంలో చేసిన విజ్ఞప్తిని మరోసారి విజ్ఞప్తి చేశారు.

 

బంగారం కొనుగోళ్లపై కీలక వ్యాఖ్యలు, విదేశీ టూర్లపై కూడా

Advertisement

స్వదేశీ వస్తువులను కొనుగోలు చేయాలని, విదేశీ ప్రయాణాలు వద్దని తేల్చేశారు. విదేశాల్లో డెస్టినేషన్ వెడ్డింగ్ వద్దని, అవసరం లేకుండా బంగారం కొనుగోలు చేయవద్దని దేశ ప్రజలను మరోసారి కోరారు. ఈ నిర్ణయానికి ప్రధాన కారణం వెనుక దేశం ఎదుర్కొంటున్న వాణిజ్య లోటు.

జూలై నెలలో బంగారం దిగుమతులు దాదాపు 5 శాతం పెరిగి 4.16 బిలియన్ డాలర్లకు చేరింది. మన కరెన్సీలో రూ.39వేల 520 కోట్లు అన్నమాట. మన వాణిజ్య లోటు 6 నెలల గరిష్ట స్థాయి 31.98 బిలియన్ డాలర్లకు చేరింది. భారత కరెన్సీ లెక్కల్లో రూ.3 లక్షల 3 వేల 810 కోట్లు. విదేశాల నుంచి బంగారాన్ని దిగుమతి చేసుకోవడంతో ఫారెక్స్ రిజర్వ్స్ తరలిపోతుండం ఇందుకు ప్రధాన కారణం.

విదేశీ వస్తువులపై మోజు తగ్గించుకుని స్వదేశీ విధానాన్ని బలోపేతం చేయాలని పిలుపునిచ్చారు. ప్రజలు ‘మేక్ ఇన్ ఇండియా’ అనే మంత్రంతో ముందుకు సాగాలన్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే నాటికి అభివృద్ధి చెందిన దేశాన్ని యువ తరానికి అప్పగిస్తామనే నమ్మకం నాకు ఉందన్నారు. బంగారంలో సుమారు 99 శాతం విదేశాల నుంచి కొనుగోలు చేస్తుంది భారత్.

ALSO READ:  సదరన్ రైల్వే శాఖలో జాబ్స్.. 4471 ఖాళీలు.. దరఖాస్తు, స్టైపెండ్ వివరాలు మీ కోసం

2025-26లో బంగారం దిగుమతులు రూ. 6.4 లక్షల కోట్లని ఓ అంచనా. విదేశీ వస్తువులపై చేసే మొత్తం వ్యయంలో 9 శాతంతో కలిపితే బంగారం రెండో అతిపెద్ద దిగుమతి వస్తువు. 2025-26 భారతదేశం గత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 4.76 శాతం తక్కువ బంగారాన్ని కొనుగోలు చేసింది. కాకపోతే దిగుమతుల బిల్లు 24 శాతం పెరిగింది. ప్రస్తుతం బంగారం ధర ఆకాశాన్ని తాకడం వల్ల దేశ విదేశీ మారక నిల్వలు వేగంగా తగ్గిపోతాయి.

పెరుగుతున్న ధర కారణంగా బంగారం దిగుమతిదారులు వెనక్కి తగ్గుతున్నారు. దేశానికి వచ్చే బంగారం కూడా తగ్గింది. జనవరిలో దాదాపు 100 టన్నుల బంగారం దిగుమతి కాగా, ఫిబ్రవరిలో దాదాపు 65 టన్నులకు చేరింది. మార్చిలో దాదాపు 22 టన్నులకు చేరింది. ఏప్రిల్‌లో కేవలం 15 టన్నులు మాత్రమే. గత 30 సంవత్సరాలలో ఇదే అత్యల్పం.

 

 

Related News

సదరన్ రైల్వే శాఖలో జాబ్స్.. 4471 ఖాళీలు.. దరఖాస్తు, స్టైపెండ్ వివరాలు మీ కోసం

ఆగష్టు నెల అగ్నిగుండమైంది.. 125 ఏళ్ల రికార్డు బద్దలు, సెప్టెంబర్ నెల మాటేంటి?

సుప్రీంకోర్టు కీలక నిర్ణయం.. కాక్రోచ్ జనతా పార్టీ నిరసనపై స్టే ఇచ్చేందుకు నిరాకరణ!

చికెన్ కోసం ఘోరం.. ఎక్కువ ముక్కలు తిన్నాడని.. స్నేహితుడి దారుణ హత్య!

15 కేజీ బంగారంతో చిక్కిన మహిళ, మాఫియాతో లింకులు.. సరిహద్దులో పసిడి పంట

దేశ రాజధాని ఢిల్లీలో ఘోరం.. స్లీపర్ బస్సులో 16 ఏళ్ల బాలికపై అఘాయిత్యం, 47 కిలోమీటర్లు రోడ్డుపై తిప్పుతూ

ఇస్రోలో ఫ్రెషర్స్‌కు మంచి ఛాన్స్.. సైంటిస్ట్, ఇంజినీర్ పోస్టుల ఖాళీలు.. పూర్తి వివరాలివిగో

Big Stories

Advertisement
×